మిశ్రమ లోహము (ఆంగ్లం: alloy) అంటే పలు రకాలైన రసాయనిక మూలకాల మిశ్రమం. ఇందులో తప్పనిసరిగా ఒక లోహం ఉంటుంది. ఇతర రసాయనిక సమ్మేళనాలతో పోలిస్తే మిశ్రమ లోహంలో అందులో కలుపబడిన లోహం విద్యుత్ వాహకత, మృదుత్వం, అపారదర్శకత, ప్రకాశం లాంటి గుణగణాలన్నీ అట్టే ఉంటాయి.

ఎడమ నుంచి కుడికి: మూడు మిశ్రమ లోహాలు ( బెరీలియం కాపర్, ఇంకోనెల్, స్టీల్) మూడు స్వచ్ఛమైన లోహాలు (టైటానియం, అల్యూమినియం, మెగ్నీషియం)

మిశ్రమ లోహాలను లోహ బంధాల పై ఆధారపడి నిర్వచించవచ్చు.[1] ఎర్ర బంగారం (బంగారం, రాగి మిశ్రమం), తెల్ల బంగారం (వెండి, బంగారం మిశ్రమం), ఇత్తడి, కంచు లాంటివి మిశ్రమ లోహాలకు కొన్ని ఉదాహరణలు.

మిశ్రమ లోహాలను రోజువారీ వాడకంలో వివిధ రంగాల్లో ఉపయోగిస్తారు. ఉక్కు మిశ్రమాలను భవనాల్లో, వాహనాల్లో, శస్త్రచికిత్స పరికరాల్లో వాడతారు. టైటానియం మిశ్రమ లోహాలను విమాన పరిశ్రమలో ఉపయోగిస్తారు.

సిద్ధాంతం మార్చు

మిశ్రమ లోహాన్ని తయారు చేయడంలో భాగంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇతర మూలకాలతో లోహాన్ని కలపుతారు. అత్యంత సాధారణ, పురాతన మిశ్రమ ప్రక్రియ అనేది మూల లోహాన్ని దాని ద్రవీభవన స్థానం దాటి వేడి చేసి, ఆపై ద్రావణాలను కరిగిన ద్రవంలోకి కరిగించడం ద్వారా నిర్వహించబడుతుంది. ఇది ద్రావణం యొక్క ద్రవీభవన స్థానం కంటే చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ సాధ్యమవుతుంది. ఉదాహరణకు ద్రవ స్థితిలో ఉన్న టైటానియం చాలా లోహాలు, మూలకాలను కరిగించే సామర్థ్యం ఉన్న చాలా బలమైన ద్రావకం. అదనంగా, ఇది ఆక్సిజన్ వంటి వాయువులను తక్షణమే గ్రహిస్తుంది. నైట్రోజన్ సమక్షంలో దహనం చేస్తుంది. ఈ ప్రక్రియ జరిగేటపుడు ఉపరితలం నుండి వేరే మూలకాలతో కలుషితమయ్యే అవకాశం ఉంది కాబట్టి వాక్యూమ్ ఇండక్షన్-హీటింగ్, ప్రత్యేకమైన, వాటర్-కూల్డ్, కాపర్ క్రూసిబుల్లలో కరిగించాలి.[2]

చరిత్రలో ఉదాహరణలు మార్చు

ఇనుము సాధారణంగా భూమిలో ఇనుప ధాతువుగా లభ్యమవుతుంది. గ్రీన్లాండ్‌లోని స్థానికంగా లభించే ఇనుము నిక్షేపాలను ఇన్యూట్ ప్రజలు ఉపయోగించారు.[3] స్వాభావికంగా లభించే రాగి, వెండి, బంగారం, ప్లాటినంతో పాటు ప్రపంచవ్యాప్తంగా దొరుకుతున్నాయి. వీటిని కొత్తరాతియుగం కాలం నుండి ఉపకరణాలు, నగలు, ఇతర వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించారు. 1903 లో రైట్ సోదరులు తేలికైన అల్యూమినియం మిశ్రమ లోహాన్ని ఉపయోగించి మొదటిసారిగా విమానం తయారు చేశారు.[4]

మూలాలు మార్చు

  1. Callister, W.D. "Materials Science and Engineering: An Introduction" 2007, 7th edition, John Wiley and Sons, Inc. New York, Section 4.3 and Chapter 9.
  2. Metals Handbook: Properties and selection By ASM International – ASM International 1978 Page 407
  3. Buchwald, pp. 35–37
  4. Metallurgy for the Non-Metallurgist by Harry Chandler – ASM International 1998 Page 3—5

ఆధార గ్రంథాలు మార్చు

  • Buchwald, Vagn Fabritius (2005). Iron and steel in ancient times. Det Kongelige Danske Videnskabernes Selskab. ISBN 978-87-7304-308-0.