మిషన్ 2020 2021లో విడుదలైన తెలుగు సినిమా. హనీ బన్నీ క్రియేషన్స్, శ్రీ మిత్ర అండ్ మై విలేజ్ సమర్పణలో మధు మృదు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై కుంట్లూర్‌ వెంకటేష్‌ గౌడ్‌, కె.వి.ఎస్‌.ఎస్‌.ఎల్‌.రమేష్‌ రాజు నిర్మించిన ఈ సినిమాకు కరణం బాబ్జి దర్శకత్వం వహించాడు. నవీన్ చంద్ర, నాగ బాబు, జయ ప్రకాష్, స్వాతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 అక్టోబరు 29న విడుదలైంది.

మిషన్ 2020
దర్శకత్వం
కరణం బాబ్జి
రచనకరణం బాబ్జి
నిర్మాతకుంట్లూర్‌ వెంకటేష్‌ గౌడ్‌, కె.వి.ఎస్‌.ఎస్‌.ఎల్‌.రమేష్‌ రాజు
తారాగణంనవీన్ చంద్ర, నాగ బాబు, జయ ప్రకాష్
ఛాయాగ్రహణంవెంకట్ ప్రసాద్
కూర్పుఎస్ బి ఉద్ధవ్
సంగీతంర్యాప్ రాక్ షకీల్
నిర్మాణ
సంస్థ
మధు మృదు ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
అక్టోబరు 2021 (2021-10)
దేశం భారతదేశం
భాషతెలుగు

విశాఖపట్నానికి చెందిన ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ ప్రకాశ్‌ అశ్లీల వీడియోల చూస్తూ వాటి వ్యసనానికి బానిసలై ఒకరోజు మత్తులో తన ముగ్గురు స్నేహితులతో కలిసి తమ స్నేహితురాలైన స్వాతి అనే అమ్మాయిపై అత్యాచారం చేస్తారు. ఈ అత్యాచార కేసును ఏసీపీ జయంత్‌ (నవీన్‌ చంద్ర) ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఆ నలుగురు విద్యార్థులను జయంత్ ఎలా కనిపెట్టి పట్టుకున్నాడు? వాళ్లకు ఎలాంటి శిక్ష పడేలా చేశాడు ? అనేదే మిగతా సినిమా కథ.[1]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: మధు మృదు ఎంటర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాతలు: కుంట్లూర్‌ వెంకటేష్‌ గౌడ్‌, కె.వి.ఎస్‌.ఎస్‌.ఎల్‌.రమేష్‌ రాజు [4]
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కరణం బాబ్జి
  • సంగీతం: ర్యాప్ రాక్ షకీల్
  • సినిమాటోగ్రఫీ: వెంకట్ ప్రసాద్
  • ఎడిటర్: ఎస్ బి ఉద్ధవ్
  • పాటలు: శ్రీ రాపాక
  • ఆర్ట్ : జె కె మూర్తి
  • డాన్స్ : గణేష్
  • ఫైట్స్ : సిందూరం సతీష్, స్టంట్ వై రవి
  • ప్రొడక్షన్ మేనేజర్ : రామారావు జాడ్డ
  • పీఆర్ ఓ : జర్నలిస్ట్ ప్రభు

మూలాలు

మార్చు
  1. Sakshi (29 October 2021). "'మిషన్‌ 2020' మూవీ రివ్యూ". Archived from the original on 1 November 2021. Retrieved 1 November 2021.
  2. Eenadu (29 October 2021). "Naveen Chandra: 2020 సందేశం - telugu news Naveenchandra Starer Mission 2020 Press meet". Archived from the original on 1 November 2021. Retrieved 1 November 2021.
  3. HMTV (13 November 2020). "'మిషన్ 2020' లో.. అల్లుడా బరిలో' మాస్ సాంగ్!". Archived from the original on 13 November 2020. Retrieved 1 November 2021.
  4. Andrajyothy (30 October 2021). "'మిషన్ 2020' చిత్రం నేటి సమాజానికి అవసరం: 'దర్జా' టీమ్". Archived from the original on 30 October 2021. Retrieved 1 November 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=మిషన్_2020&oldid=3396588" నుండి వెలికితీశారు