మిస్ వరల్డ్
మిస్ వరల్డ్ (ఆంగ్లం: Miss World) అత్యంత పురాతనమైన అంతర్జాతీయ అందాల పోటీ. ఇది యునైటెడ్ కింగ్‌డమ్‌లో 1951లో ఎరిక్ మోర్లీచే ప్రారంభించబడింది.[1][2] 2000లో అతను మరణించిన తరువాత అతని భార్య జూలియా మోర్లీ ఈ పోటీలకు సహ-అధ్యక్షురాలుగా ఉన్నారు.[3][4] మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్‌లతో పాటు, ఈ పోటీ బిగ్ ఫోర్ అంతర్జాతీయ అందాల పోటీలలో ఒకటి.[5]
ఆశయం | అందం - ఒక ప్రయోజనం |
---|---|
స్థాపన | 29 జూలై 1951 |
రకం | అందాల పోటీ |
ప్రధాన కార్యాలయాలు | లండన్ |
కార్యస్థానం | |
అధికారిక భాష | ఆంగ్లం |
అధ్యక్షులు | జూలియా మోర్లీ |
ముఖ్యమైన వ్యక్తులు | ఎరిక్ మోర్లీ |
మిస్ వరల్డ్ 2021
మార్చుఇది మిస్ వరల్డ్ పోటీల 70వ ఎడిషన్. ప్రస్తుత ప్రపంచ సుందరి పోలాండ్‌కు చెందిన కరోలినా బిలావ్స్కా(Karolina Bielawska), ఆమె 2022 మార్చి 16న ప్యూర్టో రికోలోని శాన్ జువాన్‌లో జమైకాకు చెందిన టోని-ఆన్ సింగ్ చేత పట్టాభిషేకం చేయబడింది.[6] ప్రపంచ సుందరి గెలుచుకున్న రెండవ పోలిష్ ఆమె.[7]
23 ఏళ్ళ కరోలినా ప్రస్తుతం మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. తాను పీహెచ్‌డీ చదవాలని భావిస్తున్నట్లు తెలిపింది. కరోలినా మోడల్‌గా కూడా పనిచేస్తోంది. ప్రపంచ సుందరిగా ఎంపికైన కరోలినాకు స్విమ్మింగ్, స్కూబా డైవింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడటం అంటే ఎంతో ఇష్టమట.[8]
విజేతలు
మార్చు- 1966: రీటా ఫారియా
- 1994: ఐశ్వర్య రాయ్
- 1997: డయానా హేడెన్
- 1999: యుక్తా ముఖీ
- 2000: ప్రియాంక చోప్రా
- 2002: అజ్రా అకిన్
- 2003: రోసన్నా డేవిసన్
- 2013: మెగాన్ యంగ్
- 2017: మానుషి చిల్లర్
- 2023: క్రిస్టినా పిస్కోవా
మూలాలు
మార్చు- ↑ Michael Smith (6 June 2013). "Miss World Competition Says No to Bikini Yes to Sarong". Guardian Liberty Voice. Retrieved 26 January 2016.
- ↑ "Miss Universe on August 23". Timesofmalta.com. Retrieved 24 May 2011.
- ↑ Paul Lewis (11 November 2000). "Eric Morley, 82, Miss World Promoter, Dies". The New York Times. Retrieved 11 October 2013.
- ↑ "Pageant News Bureau – Miss World: A long, glittering history". Pageant.com. Archived from the original on 15 February 2011. Retrieved 24 May 2011.
- ↑ "Beauty Pageants: Are The Crowns On the Right Heads? – Nigerian News from Leadership News". Nigerian News from Leadership News. Archived from the original on 22 December 2015. Retrieved 3 January 2016.
- ↑ "Miss World 2018 – Pageant Planet". www.pageantplanet.com. Retrieved 7 January 2019.
- ↑ "Vanessa Ponce de Leon – Pageant Planet". www.pageantplanet.com. Retrieved 7 January 2019.
- ↑ "పోలాండ్‌కు చెందిన కరోలినా బిలావ్స్కాకు మిస్ వరల్డ్ 2021 కిరీటం". andhrajyothy. Retrieved 2022-03-17.