మెగాన్‌ యంగ్‌ ఫిలిప్పీన్స్ సుందరి. ఈమె మిస్‌ వరల్డ్-2013గా ఎంపికై వార్తలలో నిలిచింది . ప్రపంచం నలుమూలల నుంచి పోటీలో పాల్గొన్న 130 మంది సుందరీమణులను అధిగమించిన మెగాన్‌ యంగ్‌ మిస్‌ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. ఇండోనేసియాలోని బాలి దీవిలో 2013 సెప్టెంభరు 28 శనివారం జరిగిన ఫైనల్‌ పోటీల్లో 2012 మిస్‌ వరల్‌‌డ విజేత, చైనా సుందరి వెంగ్జియా యు నుంచి మెగాన్‌ యంగ్‌ కిరీటాన్ని అందుకుంది. తనను మిస్‌ వరల్‌‌డగా ఎంపిక చేసినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నానంటూ మెగాన్‌ హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది.

మెగాన్‌ యంగ్‌
అందాల పోటీల విజేత
జననముమెగాన్ లిన్నే యంగ్
(1990-02-27) 1990 ఫిబ్రవరి 27 (వయస్సు 32)
అలెగ్జాండ్రియా, విర్జీనియా, అమెరికా
వృత్తినటి, రూపదర్శి, శాంతి దూత
ఎత్తు1.73 m (5 ft 8 in)
జుత్తు రంగుDark Brown
కళ్ళ రంగుBrown
బిరుదు (లు)మిస్ వరల్డ్ ఫిలిప్పీన్స్ 2013 (విజేత) మిస్ వరల్డ్ 2013[1]
(విజేత)

నేపధ్యముసవరించు

మెగాన్‌ అమెరికాలో జన్మించగా, ఆమెకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె కుటుంబం ఫిలిప్పీన్‌‌సకు తరలి వచ్చింది. సినీ నిర్మాణ విద్యార్థిని అయిన మెగాన్‌, తన చదువు పూర్తయిన తర్వాత దర్శకురాలిగా తెరవెనుక పాత్ర పోషించాలని అనుకుంది.

2013 మిస్ వరల్డ్ అందాల పోటీలుసవరించు

ఈ పోటీలో ఫ్రెంచి సుందరి మేరీన్‌ లోర్ఫెలిన్‌ రెండో స్థానంలో, ఘనా సుందరి నా ఒకాయిలే షూటర్‌ మూడో స్థానంలో నిలిచారు. భారత్‌ తరఫున మిస్‌ ఇండియా వరల్‌‌డ నవనీత్‌ కౌర్‌ ధిల్లాన్‌ ఈ పోటీలో పాల్గొన్నా, తొలి పది స్థానాల్లో చోటు దక్కించుకోలేకపోయింది.

మూలాలుసవరించు

  1. JOHN, SIMI. "Miss World 2013: Miss Philippines Megan Young Crowned Winner". http://www.ibtimes.co.uk/. http://www.ibtimes.co.uk/. Retrieved 28 September 2013. {{cite web}}: External link in |publisher= and |work= (help)

బయటి లంకెలుసవరించు

Awards and achievements
అంతకు ముందువారు
క్వెన్నెరిచ్ రెహెమాన్
మిస్ వరల్డ్ ఫిలిప్పీన్స్
2013
తరువాత వారు
incumbent
Awards and achievements
అంతకు ముందువారు
వెన్ జియా యు
మిస్ వరల్డ్
2013
తరువాత వారు
incumbent