మీనాక్షి గోస్వామి (బెంగాలీ నటి)

(మీనాక్షి గోస్వామి నుండి దారిమార్పు చెందింది)

మీనాక్షి గోస్వామి (1933 మే 21 - 2012 ఏప్రిల్ 8) బెంగాలీ సినిమారంగానికి చెందిన భారతీయ నటి. ఆమె సహాయ పాత్రల్లో ఓగో బధు సుందరి, దుయ్ పాట, అమర్ గీతి, సామ్రాట్ ఓ సుందరి, ఛోటో బౌ, స్వీట్ పత్తరేర్ తాలా వంటి సినిమాల్లో నటించింది. ఆమె డైలాగ్ డెలివరీకి ప్రత్యేకించి ప్రసిద్ది చెందింది. సినిమాల్లో నటించడంతో పాటు ఆమె 2000 సంవత్సరంలో వాటర్ బ్యాలెట్ సిరీస్‌కి కూడా దర్శకత్వం వహించింది. ఆమె రేడియో డ్రామా, టెలివిజన్ సీరియల్స్‌లలో కూడా నటించింది. ఆమె టెలివిజన్ సీరియల్ కోల్‌కతార్ కాచే కి దర్శకత్వం వహించింది.[1]

మీనాక్షి గోస్వామి
జననం(1933-05-21)1933 మే 21
అలహాబాద్, బ్రిటిష్ ఇండియా
మరణం2012 ఏప్రిల్ 8(2012-04-08) (వయసు 78)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1980–2012
తల్లిదండ్రులు
  • సుధీర్ చంద్ర చౌదరి (తండ్రి)
  • పుష్పరాణి చౌదరి (తల్లి)

ప్రారంభ జీవితం

మార్చు

మీనాక్షి గోస్వామి 1933 మే 21న ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో జన్మించింది. ఆమె 1950లో జగత్తరణ్ ఇంటర్మీడియట్ స్కూల్‌లో, తర్వాత 1954లో అలహాబాద్ విశ్వవిద్యాలయంలో చదువుకుంది.

ఆమె చదువుకునే రోజుల్లో మంచి స్విమ్మర్, వాలీబాల్ క్రీడాకారిణి. రష్యాలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ లో ఆమె అలహాబాద్ యూనివర్సిటీ వాలీబాల్ జట్టులో సభ్యురాలిగా ఉంది. తరువాత ఆమె 1980 సంవత్సరంలో పీపుల్స్ లిటిల్ థియేటర్ (PLT)లో చేరింది, ఆమె సాధన్ గుహ, అతిన్‌లాల్ గంగూలీల వద్ద డ్యాన్స్ నేర్చుకుంది.[2]

ఫిల్మోగ్రఫీ

మార్చు

సినిమా

మార్చు
1. అలేయర్ అలో (2013)
2. లజ్జా (2010)
3. స్ట్రీర్ మర్యాద (2002)
4. బాబా కెనో చకర్ (1998)
5. చౌదరి పరిబార్ (1998)
6. గంగ (1998)
7. ప్రేమ్ జోవేర్ (1997)
8. జిబాన్ యోధా (1995)
9. కల్పురుష్ (1994)
10. మాయా మమత (1993)
11. మాయాబిని (1992)
12. స్వీట్ పత్తరేర్ థాలా (1992)
13. ఇడియట్ (1992)
14. నీలిమాయే నిల్ (1991)
15. జోవర్ భాటా (1990)
16. ఘోరర్ బౌ (1990)
17. ఛోటోబౌ (1988)
18. ప్రతీకార్ (1987)
19. సామ్రాట్ ఓ సుందరి (1987)
20. శ్యాంసాహెబ్ (1986)
21. నిశాంతయ్ (1985)
22. అమరగీతి (1984)
23. దుతీ పాట (1983)
24. తనయ (1983)
25. అపరూప (1982)
26. మేఘముక్తి (1982)
27. ఓగో బధు సుందరి (1981)
28. దక్షయజ్ఞ (1980)

టెలీవిజన్

మార్చు
  • ఈ నోరోదేహ

మూలాలు

మార్చు
  1. "Bengali Actress Minakshi Goswami Dead". newsonindiancelebrities.in.
  2. "Minakshi Goswami (Actor)". filmiclub.com.