మీరాబెన్

భారతీయ ఉద్యమకారిని

మెడిలియన్‌ స్లేడ్‌ (మీరాబెన్) (1892 నవంబరు 22 – 1982 జూలై 20), బ్రిటన్‌ వనిత. బ్రిటీష్‌ సైన్యాధిపతి సర్‌. ఎడ్మిరల్‌ స్లేడ్‌ కుమార్తె. మహాత్మాగాంధీ సిద్ధాంతాలకి ఆకర్షితురాలై భారత స్వతంత్య్ర పోరాటంలో గాంధీతో కలిసి పనిచేయడానికి తన ఇంటిని వదిలి వచ్చిన మానవతా వాది. స్లేడ్‌ తన జీవితాన్ని మానవాభివృద్ధికి దోహదం చేసిన వనిత. గాంధీ సిద్ధాంతాలని ఆచరిస్తూ దేశస్వాతంత్ర్యానికి ఉద్యమించిన ఈమెకు మహాత్మాగాంధీ శ్రీకృష్ణభక్తురాలైనా మీరా బాయ్‌ పేరుని పెట్టారు. అప్పటి నుండి స్లేడ్‌ మీరా బెహన్‌గా పిలవబడుతూ అందరికీ ఎంతో చేరువయ్యింది.

1931 లో గాంధీజీతో మీరాబెన్

ప్రారంభ జీవితం

మార్చు

మీరాబెన్ 1892లో బ్రితిష్ కుటుంబంలో జన్మించారు. అతను తండ్రి బ్రిటిష్ రాయల్ నావీలో అధికారిగా ఉండేవారు. అతను మొదట్లో ఈస్ట్ ఇండియా స్క్వార్డ్రన్ లో కమాండర్ ఇన్ ఛీఫ్ గా పనిచేసారు.[1] ఆమె బాల్యంలో అధికభాగం ఆమె తాత గారి వద్ద గడిపారు. అతను మనదేశంలో పెద్ద ఎస్టేట్ కు స్వంతదారుడు, జంతు ప్రేమికుడు.[2] ఆమె సంగీత ప్రేమికురాలు. ఆమె వియన్నా మరియ జర్మనీ దేశాలలో వివిధ ప్రదేశాలలో ప్రముఖ సంగీతకారుడు బీతోవన్ స్వరపరచిన సంగీతం గూర్చి తెలుసుకోవడానికి వెళ్ళింది. అచట ఆమె బీతోవన్ గురించి అనేక పుస్తకాలను చదివింది. ఆమె "రోమయిన్ రోలాండ్" బీతోవన్ పై వ్రాసిన పుస్తకాలను చదివింది. తరువాత ఆమె అతనును విల్లేనెయువె లో అతను నివాసంలో కలిసారు. ఆ సమావేశంలో రోలాండ్ మహాత్మా గాంధీ పై వ్రాసిన కొత్త పుస్తకం గూర్చి వివరించాడు. అతను గాంధీని 20 వశతాబ్దపు ప్రముఖుడని, మరొక క్రీస్తు అని వ్యాఖ్యానించాడు.[1][2] ఆమెతిరుగు ప్రయాణంలో రోలాండ్ వ్రాసిన గాంధీజీ జీవిత చరిత్రను చదివింది. ఆ పుస్తకం చదివిన తరువాత ఆమె గాంధీగారి ఆరాధకురాలైనది. ఆమె మహాత్మాగాంధీకి ఒక లేఖ వ్రాసింది.దానిలో గాంధీజీ అనుచరురాలిగా చేరి సబర్మతీ ఆశ్రమంలో నివసించుట కొరకు కోరింది. గాంధీజీ ఆశ్రమంలో క్రమశిక్షణాయుత జీవితం గురించి తెలియజేస్తూ ప్రత్యుత్తరం యిచ్చాడు.[3] ఆమె సన్యాసి జీవితం గురించి స్వయంగా శిక్షణ పొంది, భారతదేశంలో ఉండటానికి నిర్ణయించింది. శాకాహారం తీసుకోవడం, నూలు వడకడం, మద్యపానాన్ని విసర్జించడం వంటి నియమాలను అలవర్చుకుంది. ఆ సంవత్సరం ఇంగ్లాండులో ఆమె యంగ్ ఇండియాలో సభ్యత్వం పొంది ఆమె సమయంలో కొంత భాగం పారిస్లో భగవద్గీత, ఋగ్వేదం (ఫ్రెంచ్ భాషలో) చదువుటకు కేటాయించింది.[4]

స్వాతంత్ర్య పోరాటంలో మీరా పాత్ర

మార్చు

ఆమె 1925 నవంబరు 7న ఈమె భారతదేశంలో అడుగు పెట్టింది. ఈమెని ఆనాడు మహదేవ్‌ దేశాయ్‌, వల్లభాయ్‌ పటేల్‌, స్వామీ ఆనంద్‌ రిసీవ్‌ చేసుకున్నారు.ఈ విధంగా వచ్చిన స్లేడ్‌ 34 సంవత్స రాలుగా భారతదేశంలోనే స్థిరనివాసం ఏర్పరచుకుంది.[4] ఇక్కడ ఉన్న కాలంలో ఈమె హిందీ నేర్చు కునేందుకు కంగ్రిటో గురుకులానికి వెళ్ళేది. ఆ తరువాత భగవద్భక్తి ఆశ్రమానికి కూడా వెళ్ళి ఆ ఆశ్రమ వ్యవస్థాపకులైన స్వామీ పరమానంద మహారాజ్‌ ఆశీస్సులు అందుకుంటూ ఉండేది. ఈ ఆశ్రమంలో తనకు కలిగిన ఆధ్యాత్మిక అనుభ వాల్ని మహాత్మాగాంధీకి రాస్తూండేది.

 
Mira Behn (extreme right) with Mahatama Gandhi at the Greenfield Mill, at Darwen, Lancashire

1931లో లండన్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమవేశం గాంధీ, ఇతర ప్రముఖులతో పాటు మీరా కూడా పాల్గొంది.లండన్ నుండి తిరిగి వచ్చే ముందు ఆమె,గాంధీజీతో కలసి రోలాండ్ ను సందర్శించింది. వారు అచట ఒక వారం రోజులు ఉన్నారు. రోలాండ్ ఆమెకు ఆమె భారతదేశంలో ఉన్న సమయంలో "బీతోవన్" పై వ్రాసిన ఒక గ్రంథాన్ని యిచ్చాదు. 1960 లో ఆ గ్రంథాన్ని చదవడం ప్రారంభించింది. ఆమె తన చివరి రోజులను బీతోవన్ సంగీతం సృష్టించిన నేల అయిన ఆస్ట్రేలియాలో గడపాలని నిర్ణయించుకుంది.[1] 1931లో తరిగి ప్రారంభమైన సహాయ నిరాకరణోద్యమం కారణంగా 1932-33లో ఈమె జైలు జీవితం గడపవలసి వచ్చింది.[5]

మీరా ఒక కేసు వాదన విషయంలో డేవిడ్‌ ల్లోయిడ్‌ జార్జ్‌, జనరల్‌ స్మత్స్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌లతో పాటు అమెరికా వెళ్ళింది. అక్కడ వైట్‌ హౌస్‌లో ఈ కేసు నిమిత్తం మాట్లాడ్డానికి రూస్‌వెల్ట్‌ను కూడా కలిసింది. సేవాశ్రమ్‌ని అభివృద్ధిచేయాలన్ని దృఢసంకల్సం మీరాకి ఎప్పుడూ ఉండేది. 1942లో జపాన్‌ దాడిని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా ఎదుర్కునేందుకు ఒరిస్సా ప్రజలతో మమేకమై చేసిన పోరాటం సాగించింది. మీరా గాంధీతో పాటు 1942 నుండి 1944 వరకూ పూణేలోని ఆగాఖాన్‌ పేలస్‌లో నిర్భధంలో ఉంది. అప్పుడే, ఈమె మహాదేవ్‌ దేశాయ్‌, కస్తూరీబాయ్‌ మరణాలు చూసి చలించిపోయింది. అంతే కాకుండా ఈరోజుల్లో జరిగిన ప్రతి సన్నివేశాన్నీ కళ్ళారా చూసిన ప్రత్యక్షసాక్షి మీరాయే. చివరికి గాంధీగారి అంతిమ యాత్రలో కూడా మీరా సాక్షీభూతురాలై నిలిచింది.

స్వాతంత్ర్యానంతర జీవితం

మార్చు

ఆగాఖాన్‌ పేలస్‌ నుండి విడుదలయ్యిన తర్వాత గాంధీగారి అనుమతితో రూర్కీలో కిసాన్‌ ఆశ్రమాన్ని స్థాపించింది. ఈ ఆశ్రమ నిర్మాణానికి గ్రామీణులు పెద్ద ఎత్తులో స్థలాన్ని సమకూర్చారు. స్వాతంత్ర్యం వచిన తర్వాత ఋషికేశ్‌లో పశులోక్‌ ఆశ్రమాన్ని స్థాపించి, ఆ ప్రాంతానికి బాపూ గ్రామ్‌ అనే పేరుని సార్థకం చేసింది.అలాగే 1952లో భిలాంగనలో గోపాల్‌ ఆశ్రమం కూడా స్థాపించింది[4]. ఈ ఆశ్రమాలో గడుపుతూ ఈమె పాల సరఫరా, వ్యవసాయంలో పరిశోధనలు చేస్తూండేది. అలాగే ఒకొక్కసారి కాశ్మీరు వెళ్ళి కొంత కాలం గడుపుతూ ఉండేది. ఈమె ఆ సమయంలో అక్కడ అడవులు నరికి వేయడం, అందువల్ల విశాల భూముల్లో వరదలు ముంచుకురావడం వంటిని పరిశీలించి, ఆరోజుల్లోనే ఈ నేపథ్యంలో ‘సమ్‌థింగ్‌ రాంగ్‌ ఇన్‌ ది హిమాలయా’ అనే పుస్తకాన్ని కూడా ప్రచురించింది.[6]

మనదేశానికి ఇంత సేవచేసిన మెడిలి యన్‌ స్లేడ్‌ (మీరా బెహన్‌) 1959లో ఇంగ్లాండ్‌కి తిరిగి వెళ్ళిపోయింది. 1960లో ఆమె ఆస్ట్రేలియాలో 22 సంవత్సరాలపాటు వియన్నాలో గడిపారు. 1982లో మరణించారు.

ఈమెకి మన భారత ప్రభుత్వం 1981లో భారతదేశ రెండవ పౌరురా లుగా ప్రకటించి, అత్యంత ప్రతిష్ఠాత్మక మైన పద్మవిభూషన్‌ బిరుదుతో ఈమె సేవల్ని కొనియాడుతూ ఘనంగా సత్క రించింది.

మీరాబెన్ వ్రాసిన పుస్తకాలు

మార్చు

Mirabehn's autobiography is titled The Spirit's Pilgrimage. She also published Bapu's Letters to Mira and New and Old Gleanings.[7][8] At the time of her death she had also left behind an unpublished biography of Beethoven, the Spirit of Beethoven.[9]

ప్రసిద్ధ సంస్కృతిలో

మార్చు

గ్రంథములు

మార్చు
  • Spirits Pilgrimage, by Mirabehn. Great River Books. 1984. ISBN 0-915556-13-8.
  • New and old gleanings, by Mirabehn. Navajivan Pub. House. 1964.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 Lindley, Mark. "Mirabehn , Gandhi and Beethoven". Academia.edu.
  2. 2.0 2.1 Gupta, Krishna Murti. "Mira Behn: A friend of nature".
  3. 3.0 3.1 Singh, Khushwant (1 October 2005). "IN LOVE WITH THE MAHATMA". The Telegraph.
  4. 4.0 4.1 4.2 "Associates of Mahatma Gandhi, Mirabehn".
  5. "WOMEN AND INDIA'S INDEPENDENCE MOVEMENT". Archived from the original on 2015-09-27. Retrieved 2015-07-23.
  6. Langston, Nancy. "Significant Women in Forestry". Archived from the original on 2016-04-20. Retrieved 2015-07-23.
  7. "Mira Behn, disciple of Mahatma Gandhi". indiavideo.org.
  8. "Books by Mirabehn". amazon.com.
  9. "The making of Mirabehn". The Hindu. 24 September 2000. Archived from the original on 19 డిసెంబరు 2012. Retrieved 23 జూలై 2015.

ఇతర లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మీరాబెన్&oldid=3798976" నుండి వెలికితీశారు