మన దేశం

1949 సినిమా
(మనదేశం నుండి దారిమార్పు చెందింది)

మన దేశం, 1949లో విడుదలైన ఒక సాంఘిక తెలుగు సినిమా. ఈ చిత్రం లో ఎన్.టి. రామారావు బ్రిటిష్ పోలీస్ ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు. దీనికి దర్శకుడు ఎల్.వి.ప్రసాద్. ప్రసిద్ధ నటి కృష్ణవేణి ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా "విప్రదాస్" అనే బెంగాలీ నవల ఆధారంగా నిర్మింపబడింది. భారత స్వాతంత్ర్య సంగ్రామం ఈ చిత్ర కథకు నేపథ్యం.

మన దేశం
(1949 తెలుగు సినిమా)
Mana Desam 1949film.jpg
చందమామ పత్రికలో మనదేశం ప్రకటన
దర్శకత్వం ఎల్.వి.ప్రసాద్
నిర్మాణం కృష్ణవేణి
, ఆమె భర్త మీర్జాపురం రాజా
కథ సముద్రాల రాఘవాచార్య
శరత్ బెంగాలీ నవల ఆధారంగా
తారాగణం కృష్ణవేణి,
నాగయ్య,
నారాయణరావు,
ఎన్.టి.రామారావు,
రేలంగి,
బాలసరస్వతి,
వంగర,
రామనాధశాస్త్రి,
కాంచన్,
హేమలత,
లక్ష్మీకాంతం
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల,
జిక్కి,
ఎమ్.ఎస్. రామారావు,
పి.లీల
గీతరచన సముద్రాల రాఘవాచార్య
సంభాషణలు సముద్రాల రాఘవాచార్య
ఛాయాగ్రహణం ఎమ్.ఎ. రెహమాన్
నిర్మాణ సంస్థ ఎం.ఆర్.ఏ ప్రొడక్షన్స్
విడుదల తేదీ నవంబర్ 24, 1949
నిడివి 172 నిముషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

విశేషాలుసవరించు

 • ఈ చిత్రం ద్వారా పరిచయమైన ఎన్.టి. రామారావు, ఎస్.వి.రంగారావు తరువాత తెలుగు చలనచిత్ర రంగంలో ఎంతో ప్రసిద్ధులయ్యారు. అలాగే ఈ చిత్రం ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత దర్శత్వం వహించిన మొదటి సినిమా. గాయని పి. లీల కూడా ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా రంగం నేపథ్యగానంలో ప్రవేశించింది. ఇందులో రామారావు పోలీసు వేషం వేశాడు.
 • సినిమా కథనంలో బుర్ర కథ, ఒగ్గు కథ, వీధి నాటకాలు, బొమ్మలాటలు వంటి సాంస్కృతిక కళారూపాలను కదనానికి వినియోగించారు. ఇంకా దేశ భక్తి గీతాలు, దంపుడు పాటలు, భజనలు, ఇతర జానపద గీతాలను వాడారు.
 • సినిమాలో గాంధీ గారి ఉన్నతాదర్శాలను, స్వాతంత్ర్యం తరువాత దిగజారిన విలువలను చూపౌఇంచారు.
 • ఇది బెంగాలీ కథ ఆధారంగా వెలువడిన మొదటి తెలుగు సినిమా. తరువత దేవదాసు, ఆరాధన వంటి అనేక బెంగాలీ నవలలు తెలుగు సినిమా కథలుగా వెలువడి విజయవంతమయ్యాయి.
 • స్వాతంత్ర్యం రాకముందు ప్రారంభించినప్పటికి కొన్ని కారణాలవల్ల స్వాతంత్ర్యానంతరం పూర్తిచేసి విడుదల చేయడం జరిగింది.
 • ఈ చిత్రంలో పోలీసు ఇన్స్పెక్టరు పాత్ర పోషించిన ఎన్.టి.ఆర్.కు రూ.2000 పారితోషికం ఇచ్చారు.

కథసవరించు

పాటలుసవరించు

 1. ఏషా మధ్యేకాంచితంనో: రాజ్యం భోగ సుఖానిచ (శ్లోకం) - ఘంటసాల
 2. ఏమిటో సంబంధం ఎందుకో ఈ అనుబంధం - ఎం.ఎస్. రామారావు, కృష్ణవేణి - రచన: సముద్రాల
 3. కళ్ళ నిన్ను చూచినానే పిల్లా ఒళ్ళు ఝల్లుమన్నదే - ఘంటసాల, జిక్కి - రచన: సముద్రాల
 4. చెలో చెలో చెలో చెలో రాజా చెలో చెలో చెలో - ఎం.ఎస్. రామారావు, కృష్ణవేణి - రచన: సముద్రాల
 5. జయహే జయహే - ఘంటసాల, కృష్ణవేణి బృందం - రచన: సముద్రాల
 6. జడియకురా ధీరా సాత్వికరణ విజయము నీదేరా - నాగయ్య - రచన: సముద్రాల
 7. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయతి (శ్లోకం) - ఘంటసాల - రచన: సముద్రాల
 8. జయ జననీ పరమపావనీ జయ జయ భారతజనని- ఘంటసాల, కృష్ణవేణి - రచన: సముద్రాల
 9. దారులు కాచే రాజుసేనలు దాసి (బుర్రకథ) - ఘంటసాల, కృష్ణవేణి బృందం - రచన: సముద్రాల
 10. నిర్వేదమేలా కన్నీరదేల భరతజాతికపూర్వపర్వము ఈవేళ - నాగయ్య - రచన: సముద్రాల
 11. భారత యువకా కదలరా భారతయువతా - ఘంటసాల బృందం - రచన: సముద్రాల
 12. మరువలేనురా నిను నేను మరువలేనురా ఓ పంచదారవంటి - జిక్కి - రచన: సముద్రాల
 13. మావా నందయ మావా అందుకో నన్నందుకో నా అందాలే - జిక్కి - రచన: సముద్రాల
 14. మాటా మర్మము నేర్చినవారు మనసు - ఘంటసాల, కృష్ణవేణి బృందం - రచన: సముద్రాల
 15. వెడలిపో తెల్లదొరా మాదేశపు ఎల్ల దాటీ వెడలిపో - ఘంటసాల బృందం - రచన: సముద్రాల
 16. వైష్ణవ జనతో తేనే కహియే పీడపరాయీ (గుజరాతీ) - ఘంటసాల - రచన: నరసింహ మెహతా

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=మన_దేశం&oldid=3201416" నుండి వెలికితీశారు