మీరా నందన్
మీరా నందన్, దక్షిణ భారత సినీ నటి. మలయాళ టీవీలో వ్యాఖ్యాతగా కెరీర్ ప్రారంభించింది ఆమె. ఆ తరువాత సినిమాల్లో నటిగా మారింది మీరా. ఆమె ఎక్కవగా మలయాళ సినిమాల్లో నటించింది.
మీరా నందన్ | |
---|---|
జననం | మీరా నందకుమార్ 1988 నవంబరు 26 |
వృత్తి | నటి, రేడియో జాకీ, మోడల్, టీవీ హోస్ట్ |
క్రియాశీల సంవత్సరాలు | 2008–2017 2022 - ప్రస్తుతం |
బంధువులు | దివ్య ఉన్ని (కజిన్) |
తొలినాళ్ళ జీవితం
మార్చు26 నవంబరు 1990న కొచ్చిలో జన్మించింది మీరా. ఆమె అసలు పేరు మీరా నందకుమార్. ఆమె తల్లిదండ్రులు నందకుమార్, మాయ.[1] ఆమె తమ్ముడు అర్జున నందకుమార్. మీరా భవన్స్ విద్యా మందిర్ లో ప్రాథమిక విద్య చదివింది. ఎర్నాకులంలోని సెయింట్ తెరిస్సా కళాశాలలో ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తరువాత మణిపాల్ విశ్వవిద్యాలయం నుండి దూర విద్య ద్వారా మాస్ కమ్యూనికేషన్ లో మాస్టర్స్ చదివింది ఆమె.[2][3] నటి దివ్య ఉన్ని కు దూరపు బంధువు అవుతుంది మీరా.[4]
కెరీర్
మార్చుమోహన్ లాల్ కు చెందిన యాడ్ లో మొట్టమొదటిసారి నటించింది మీరా. 2007లో ఆసియా నెట్ లో ప్రసారమైన ఐడియా స్టార్ సింగర్ షో కోసం గాయనిగా ఆడిషన్ కు వెళ్ళిన మీరా, చివరికి ఆ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఎంపికవ్వడం విశేషం. ఆమె అమృతా టీవి, జీవన్ టీవీల్లో కూడా ఎన్నో షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.[5]
పురస్కారాలు
మార్చుసంవత్సరం | పురస్కారం | విభాగం | సినిమా | ఫలితం |
---|---|---|---|---|
2007 | కేరళ టెలివిజన్ పురస్కారాలు[6] | Best Second Actress | Veedu | గెలుపు |
2008 | దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు | ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నూతన నటీమణులు | ముల్లా | |
Best Actress - Malayalam | ప్రతిపాదించబడింది | |||
2009 | ఆసియానెట్ సినిమా పురస్కారాలు | Best New Face of the Year (Female) | గెలుపు | |
AMMA Awards | Best Supporting Actress | Puthiya Mukham |
మూలాలు
మార్చు- ↑ "Meera Nandan celebrates her birthday in LA!". Sify. Archived from the original on 14 డిసెంబరు 2009. Retrieved 10 November 2009.
- ↑ "മീര എഴുതുകയാണ്". mangalamvarika.com. Oct 20, 2014. Archived from the original on 21 అక్టోబరు 2014. Retrieved 20 October 2014.
- ↑ "മീരയ്ക്ക് പുതിയ മുഖം – articles,fashion – Mathrubhumi Eves". Mathrubhumi.com. Archived from the original on 9 జూలై 2014. Retrieved 9 July 2014.
- ↑ "'I have not yet found true love' -Meera Nandan". Southscope.in. 16 June 2012. Archived from the original on 14 జూలై 2014. Retrieved 9 July 2014.
- ↑ "Welcome to". Sify.com. 20 January 2007. Archived from the original on 1 జూలై 2014. Retrieved 9 July 2014.
- ↑ "'Daya' and 'Typewriter' bag State TV awards". The Hindu. Chennai, India. 15 November 2008. Archived from the original on 7 జూలై 2013. Retrieved 30 జూన్ 2020.