మీర్జాపూర్ (ఉత్తర ప్రదేశ్)
మీర్జాపూర్, ఉత్తర ప్రదేశ్ లోని పట్టణం, మీర్జాపూర్ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది ఢిల్లీ, కోల్‌కతా ల నుండి సుమారు 650 కి.మీ., అలహాబాద్ నుండి 84 కి.మీ. దూరంలో ఉంది. [4] వారణాసి నుండి 59 కి.మీ. దూరంలో ఉంది.[5] తివాచీలు, ఇత్తడి సామాను పరిశ్రమలకు మీర్జాపూర్ ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణాన్ని కొండలు చుట్టుముట్టి ఉంటాయి. ఇది పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. వింధ్యాచల్, అష్టభుజ, కాళీ ఖోహ్, దేవరాహ్వా బాబా ఆశ్రమం ఇక్కడి చూడదగ్గ స్థలాలు.
మీర్జాపూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 25°08′46″N 82°34′08″E / 25.146°N 82.569°E | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
Elevation | 80 మీ (260 అ.) |
జనాభా (2011)[1] | |
• పట్టణం | 2,33,691 |
• జనసాంద్రత | 567/కి.మీ2 (1,470/చ. మై.) |
• Metro | 2,45,817 |
భాషలు | |
• అధికారిక | హిందీ[3] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 231001 |
టెలిఫోన్ కోడ్ | 05442 |
లింగనిష్పత్తి | 0.903 (2011) |
భౌగోళికం
మార్చుమీర్జాపూర్ 25°09′N 82°35′E / 25.15°N 82.58°E వద్ద [6] సముద్ర మట్టం నుండి 80 మీటర్ల ఎత్తున ఉంది.
జనాభా వివరాలు
మార్చు2011 జనాభా లెక్కల ప్రకారం, మీర్జాపూర్ జనాభా 2,33,691, పట్టణ సముదాయం జనాభా 2,45,817. పట్టణమ్లో 1,000 మంది పురుషులకు 869 మంది స్త్రీలున్నారు. జనాభాలో 11.9% మంది ఆరేళ్ల లోపు పిల్ల్లలు. ఏడేళ్ళ పైబడిన వారిలో అక్షరాస్యత 78.25%; పురుషుల అక్షరాస్యత 83.85%, స్త్రీల అక్షరాస్యత 71.80%.
వాణిజ్యం
మార్చుమీర్జాపూర్లో ప్రధాన వ్యాపారం కార్పెట్ తయారీ. చాలా చిన్న తరహా సంస్థల నుండి మధ్య తరహా సంస్థల వరకు ఉన్నాయి. భారతదేశంలో తివాచీల మార్కెట్ పరిమితంగానే ఉన్నందున ఇక్కడ తయారైన తివాచీలు ఎక్కువగా విదేశాలకు ఎగుమతి అవుతాయి. తివాచీల తరువాత ప్రధానమైన వ్యాపారం ఇత్తడి పాత్రల తయారీ.
భారత ప్రామాణిక సమయం లెక్కింపు
మార్చుమీర్జాపూర్ లోని గడియార స్తంభం దాదాపుగా భారత ప్రామాణిక సమయాన్ని లెక్కించే 82.5° తూర్పు రేఖాంశానికి దగ్గరలో 82.57° వద్ద ఉంది (4 కోణీయ నిమిషాల తేడాలో). ఆంధ్రప్రదేశ్ లోని తుని పట్టణం కూడా ఈ రేఖాంశానికి దగ్గర లోనే ఉంది.. [7]
ప్రస్తావనలు
మార్చు- ↑ "Provisional Population Totals, Census of India 2011; Cities having population 1 lakh and above" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 26 March 2012.
- ↑ "Provisional Population Totals, Census of India 2011; Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 26 March 2012.
- ↑ "52nd Report of the Commissioners for Linguistic Minorities in India" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 26 December 2018.
- ↑ "Google Maps". Google Maps. Retrieved 23 May 2017.
- ↑ "Google Maps". Google Maps. Retrieved 23 May 2017.
- ↑ Falling Rain Genomics, Inc – Mirzapur. Fallingrain.com. Retrieved on 1 June 2012.
- ↑ India investigates different time zones. BBC. 21 August 2001