మీ సేవ (తెలంగాణ)
మీ సేవ అనేది తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందించిన ఆన్‌లైన్ సేవాకేంద్రం. మీ సేవ కేంద్రాలలో 150కి పైగా ప్రభుత్వ, 600 ప్రైవేట్ సంబంధిత ఆన్‌లైన్ చెల్లింపుల సేవలు అందించడుతున్నాయి.[1][2] 2018 ఫిబ్రవరిలో ఈ సేవ ద్వారా 10 కోట్ల లావాదేవీలను పూర్తి చేయబడ్డాయి. రాష్ట్ర ఏర్పాటు తరువాత డిజిటల్ లావాదేవీల విభాగంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.[3] ఇందులోని సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీస్ (టిఎస్‌టిఎస్) అభివృద్ధి చేసి, సహకరిస్తోంది.
మీ సేవ | |
---|---|
ప్రాంతం | తెలంగాణ |
దేశం | భారతదేశం |
మంత్రిత్వ శాఖ | తెలంగాణ ఐటిశాఖ |
ప్రధాన వ్యక్తులు | కల్వకుంట్ల తారక రామారావు, ఐటిశాఖ మంత్రి జయేష్ రంజన్, ఐటిశాఖ కార్యదర్శి జిటి వెంకటేశ్వర్ రావు, కమీషనర్ (మీ సేవ) |
ప్రారంభం | 2 జూన్, 2014 |
చరిత్ర
మార్చు2011, నవంబరు 4న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో మీ సేవ ప్రారంభించబడింది. 2014, జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, దీని సేవలు విభజించబడ్డాయి.[4]
సేవలు
మార్చుతెలంగాణ రాష్ట్రం 31 జిల్లాల్లోని 4758 ఫ్రాంచైజ్ కేంద్రాల్లో ఈ సేవ ద్వారా ఆన్‌లైన్ సేవలను అందిస్తున్నారు.[5] ఇందులో 10 శాతం లాభం ప్రభుత్వానికి, 90 శాతం లాభం లైసెన్స్ పొందిన ఫ్రాంచైజీకి వెళుతుంది.
2018, ఏప్రిల్ 12న పట్టాదారు పాస్ బుక్ లకు ఆధార్ సీడింగ్ నేను మీ సేవ సర్వీసు ప్రొవైడర్స్ కు ఇవ్వబడింది. ఈ సేవ కేంద్రాలలో ఈకెవైసీ పద్ధతిని ఉపయోగించి ఆధార్ ఖాతాకు బయోమెట్రిక్‌లను నవీకరించవచ్చు.
టి యాప్ ఫోలియో
మార్చుమీ సేవా 2.0లో భాగంగా మొబైల్ వినియోగదారులకోసం ఒక యాప్ తయారుచేశారు. ఈ యాప్ లో 180 సేవలు, మీ సేవా సేవలు, ఆర్టీఏ సేవలు, ఫీజు చెల్లింపులు, బిల్ చెల్లింపు వంటి సేవలు అందిస్తున్నారు. 2018, ఫిబ్రవరి 28న తెలంగాణ ఐటి మంత్రి కెటి రామారావు ఈ యాప్ ను ప్రారంభించాడు.[6] భారత ప్రభుత్వం రూపొందించిన ఉమాంగ్ మాదిరిగానే టి యాప్ ఫోలియో ఉంటుంది. ఈ యాప్ సమాచార సేవలు, మీసేవా కేంద్రాలు, రేషన్ షాపులు, హై-ఫై హాట్‌స్పాట్‌ల వంటి స్థాన సేవలను కూడా అందిస్తుంది.
అవార్డులు
మార్చుమూలాలు
మార్చు- ↑ Insights from Telangana Govt.'s MeeSeva Platform Going Mobile - CIOL
- ↑ Telangana's Mee Seva, HawkEye in Hall of Fame
- ↑ TS is on top in country in digital transactions: KTR
- ↑ "Mee Seva services to help speed up passport issue". The Hindu. 6 May 2017. Retrieved 17 June 2019.
- ↑ http://www.newindianexpress.com/states/telangana/2017/sep/30/officials-fail-to-act-as-mee-seva-franchisees-fleece-customers-1664729.html
- ↑ https://economictimes.indiatimes.com/tech/software/telangana-launches-integrated-app-for-all-government-services/articleshow/63114771.cms
- ↑ Telangana MeeSeva bags award at WCIT