ముంతాజ్ సర్కార్

ముంతాజ్ సర్కార్ (జననం 1986 సెప్టెంబరు 15) భారతీయ నటి, మోడల్.[1] ఆమె ప్రముఖ ఇంద్రజాలికుడు పి.సి.సర్కార్ మనవరాలు. ఆమె బంగ్లాదేశ్‌కు చెందిన గాయని మెహ్రీన్ మ్యూజిక్ వీడియోతో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె మొదటగా బిర్సా దాస్‌గుప్తా దర్శకత్వం వహించిన బెంగాలీ చిత్రం 033లో నటించింది.[2]

ముంతాజ్ సర్కార్
ముంతాజ్ సర్కార్
జననం
ముంతాజ్ సర్కార్

(1986-09-15)1986 సెప్టెంబరు 15
వృత్తి
 • నటి
 • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2009 – ప్రస్తుతం
తల్లిదండ్రులు
 • పి. సి. సర్కార్ జూనియర్
 • జోయ్‌శ్రీ సర్కార్
బంధువులుపి. సి. సర్కార్ (తాతయ్య)

ఆమె గురు (2017)లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.[3]

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

ఆమె పి. సి. సర్కార్ జూనియర్, జోయ్‌శ్రీ సర్కార్ దంపతులకు 1986 సెప్టెంబరు 15న కోల్‌కతాలో జన్మించింది.[4] ఆమె మోడరన్ హై స్కూల్ ఫర్ గర్ల్స్ లో పాఠశాల విద్య పూర్తిచేసింది. ఆమె కలకత్తా యూనివర్సిటీ పరిధిలోని సౌత్ కలకత్తా లా కాలేజీ నుండి బి.ఎ., ఎల్.ఎల్.బి. పూర్తి చేసింది.[5]

ఆమెకు క్రీడల పట్ల ఉన్న ఇష్టంతో క్రీడాకారిణిగా బెంగాల్ అమెచ్యూర్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సౌత్ కోల్‌కతా క్లబ్‌లో బాక్సింగ్‌లో శిక్షణ పొందింది.[6] ఆమె జూడోలో శిక్షణ కూడా పొందింది.[7] ఆమె షాట్‌పుట్‌లో వై.ఎమ్.సి.ఎ. బంగారు పతక విజేత. ఆమె క్లాసికల్ జాజ్ డాన్సర్ కూడా.

కెరీర్

మార్చు

ఆమె 2010లో వచ్చిన బెంగాలీ చిత్రం 033తో అరంగేట్రం చేసింది.[8] ఆమె శౌమిక్ సేన్ నో పాబ్లెమ్‌లో ప్రారంభ రోజులలోనే నటించింది.[2][9] ఆ తర్వాత ఆమె అనేక టాలీవుడ్ చిత్రాలకు సంతకం చేసింది.[10][11]

మూలాలు

మార్చు
 1. "Mumtaz Sorcar". IMDb (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-05-01.
 2. 2.0 2.1 "The rising stars". The Telegraph. Kolkata, India. 21 December 2008. Archived from the original on 29 December 2008. Retrieved 25 February 2009.
 3. "GURU Movie Review - Sakshi". web.archive.org. 2023-06-05. Archived from the original on 2023-06-05. Retrieved 2023-06-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 4. "Good Times on the cards". The Times of India. Archived from the original on 12 October 2020. Retrieved 1 June 2012.
 5. Roychoudhury, Amrita (9 July 2008). "I would certainly open my law firm some day". Bollywood-Entertainment. The Times of India. Archived from the original on 23 October 2012. Retrieved 10 March 2009.
 6. "A Sorcar Trades Wand for Gloves". The Indian Express. Retrieved 1 June 2012.
 7. Ganguly, Ruman (12 August 2009). "Mumtaz Gets Candid". The Times of India. Archived from the original on 9 July 2012. Retrieved 10 March 2009.
 8. "033 (2010) Bengali Movie Review". Archived from the original on 31 August 2011. Retrieved 1 June 2012.
 9. "Laugh out loud". The Telegraph (India). Calcutta, India. 1 April 2008. Archived from the original on 12 November 2010. Retrieved 25 February 2009.
 10. "Steamy debut". The Telegraph (India). Calcutta, India. 4 February 2009. Archived from the original on 8 February 2009. Retrieved 25 February 2009.
 11. "::: I Love Kolkata :::The rising stars". ilovekolkata.in. Archived from the original on 23 December 2008. Retrieved 25 February 2009.