గురు (2017 సినిమా)
గురు 2017, మార్చి 31న విడుదలైన తెలుగు చలనచిత్రం. సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేష్, రితికా సింగ్, నాజర్, తనికెళ్ల భరణి నటించగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.[2] సుధ కొంగర తమిళ, హిందీ భాషల్లో రూపొందించిన ద్విభాషాచిత్రం ఇరుది సుత్రు (సాలా ఖద్దూస్ - హిందీ) సినిమాకు రిమేక్ చిత్రం ఇది.[3] ఇందులో ఆర్. మాధవన్, రితికా సింగ్ నటించారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుండి అనుకూల స్పందనలు అందుకుంది.[4]
గురు | |
---|---|
దర్శకత్వం | సుధ కొంగర |
రచన | హర్ష వర్ధన్ (మాటలు) |
స్క్రీన్ ప్లే | మేఘు సునంద రఘునాథన్ |
కథ | మేఘు |
నిర్మాత | ఎస్. శశికాంత్ |
తారాగణం | వెంకటేష్ రితికా సింగ్ |
ఛాయాగ్రహణం | కె.ఏ. శక్తివేల్ |
కూర్పు | సతీష్ సూర్య |
సంగీతం | సంతోష్ నారాయణన్ |
నిర్మాణ సంస్థ | వై నాట్ స్టూడియోస్ |
విడుదల తేదీ | మార్చి 31, 2017[1] |
సినిమా నిడివి | 116 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుసిన్సియర్ బాక్సింగ్ కోచ్ ఆదిత్య (వెంకటేష్) తన ముక్కుసూటితనం, కోపం కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. బాక్సింగ్ అసోసియేషన్ లో జరిగే రాజకీయాల వల్ల ఢిల్లీ నుంచి వైజాగ్ కు బదిలీ అయిన ఆదిత్య తనేంటో రుజువు చేసుకోవాలనుకుంటాడు. ఆ క్రమంలో కూరగాయలు అమ్ముకుని బతికే పేదింటి అమ్మాయి రామేశ్వరి (రితికా సింగ్) ఆదిత్యకు కనిపిస్తుంది. రామేశ్వరిలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆమెకు బాక్సింగ్ శిక్షణ ఇవ్వడం మొదలుపెడతాడు. ఇతరుల వల్ల ఆదిత్య, రామేశ్వరి ఇద్దరూ అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటారు. వారు వాటిని అధిగమించి ఛాంపియన్ బాక్సర్ గా ఎలా తీర్చిదిద్దాడన్నది మిగతా కథ.[5]
తారాగణం
మార్చు- దగ్గుబాటి వెంకటేష్ (ఆదిత్య/ఆది)
- రితికా సింగ్ (రామేశ్వరి/రాములు)
- నాజర్ (పంచ్ పాండ్స్)
- ముంతాజ్ సర్కార్ (లక్ష్మీ/లక్స్)
- తనికెళ్ల భరణి (మురళి)
- రఘుబాబు (సోములు)
- అనితా చౌదరి (రాజ్యం)
- జాకీర్ హుస్సేన్ (దేవ్ ఖత్రి)
- అనంత్ బాబు (బాక్సింగ్ అసోసియేషన్ మెంబరు)
- సంచన నటరాజన్ (బాక్సింగ్ విద్యార్థి)
సాంకేతికవర్గం
మార్చు- బ్యానర్: వైనాట్ స్టూడియోస్
- కథనం: సుధ కొంగర, సునంద రఘునాధన్
- మాటలు: హర్షవర్ధన్
- కూర్పు: సతీష్ సూర్య
- సంగీతం: సంతోష్ నారాయణన్
- ఛాయాగ్రహణం: కె.ఏ. శక్తివేల్
- నిర్మాత: ఎస్. శశికాంత్
- కథ, దర్శకత్వం: సుధ కొంగర
నిర్మాణం
మార్చు2016 సెప్టెంబరులో హైదరాబాదులో చిత్రీకరణ ప్రారంభమై, వైజాగ్, హైదరాబాదు,గోవాలో చిత్రీకరణ జరుపుకుంది. 2016 డిసెంబరులో మొదటివారంలో షూటింగ్ పూర్తయింది. తమిళ మాతృకకు పనిచేసిన సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా, సతీష్ సూర్య కూర్పు గా ఈ సినిమాకు కూడా పనిచేశాడు. కళా దర్శకుడిగా టి. సంతానం స్థానంలో జాకీ ని తీసుకున్నారు.
పాటలు
మార్చుగురు | ||||
---|---|---|---|---|
సినిమా by | ||||
Released | 2017 | |||
Genre | పాటలు | |||
Length | 21:56 | |||
Label | లహరి మ్యూజిక్ | |||
Producer | సంతోష్ నారాయన్ | |||
సంతోష్ నారాయణన్ chronology | ||||
|
ఈ చిత్రానికి సంతోష్ నారయన్ సంగీతం అందించాడు. లహరి మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[6] వెంకటేష్ పాడిన జింగిడి పాట మినహా, మిగిలిన పాటల ట్యూన్స్ తమిళ చిత్రం నుండి తీసుకోబడ్డాయి.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "నీ జెర (రచన: శ్రీమణి)" | శ్రీమణి | సిద్ధార్థ్ మహదేవన్ | 4:15 |
2. | "జింగిడి (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | భాస్కరభట్ల రవికుమార్ | వెంకటేష్ | 2:57 |
3. | "గుండెలోతులలో (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | దీ | 3:10 |
4. | "ఎయ్ పటాకీ (రచన: భాస్కరభట్ల రవికుమార్)" | భాస్కరభట్ల | అనంతు | 3:04 |
5. | "ఉక్కు నరం (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | సిద్ధార్థ్ మహదేవన్ | 4:20 |
6. | "ఓ సక్కనోడ (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | దీ | 4:10 |
మొత్తం నిడివి: | 21:56 |
మూలాలు
మార్చు- ↑ "Venky's 'Guru' is preponed for a March 31 release". The Times of India. 26 March 2017. Retrieved 8 June 2020.
- ↑ తెలుగు ఫిల్మీబీట్, సినిమా రివ్యూ (31 March 2017). "బాక్సింగ్ కోచ్‌గా వెంకటేష్ నాకౌట్ (గురు రివ్యూ)". www.telugu.filmibeat.com. Retrieved 8 June 2020.
- ↑ తెలుగు ఏపి హెరాల్డ్, రివ్యూ. "వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమా ఏ చిత్రానికి రీమేకో తెలుసా..?". www.dailyhunt.in. Retrieved 8 June 2020.
- ↑ "Guru trailer: Venkatesh gets into shoes of R Madhavan in Saala Khadoos Telugu remake. But is he convincing enough?". 21 March 2017. Retrieved 8 June 2020.
- ↑ తుపాకి, రివ్యూ (31 March 2017). "గురు సినిమా రివ్యూ". www.tupaki.com. Archived from the original on 8 జూన్ 2020. Retrieved 8 June 2020.
- ↑ Santhosh Narayanan (12 March 2017). "Guru (Original Motion Picture Soundtrack)". iTunes. Apple Inc. Retrieved 8 June 2020.