ముంబై నాసిక్ ఎక్స్‌ప్రెస్‌వే
ముంబై నాసిక్ ఎక్స్‌ప్రెస్ వే [1] ముంబయి నుండి నాసిక్‌ని కలిపే 150 కి.మీ. (93 మై.) పొడవైన రహదారి. [2] ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ 4000 కోట్లు. [1] ఈ ప్రాజెక్టు టెండరును అప్పగించిన సమయంలో ఇది భారతదేశంలోనే అతిపెద్ద BOT రోడ్డు ప్రాజెక్టు. జాతీయ రహదారి-3 లోని 99.5 కి.మీ.ల వడపే-గొండే (ముంబయి-నాసిక్) భాగాన్ని నాలుగు వరుసలకు పెంచడం ఈ ప్రాజెక్టులో భాగం.[3]
ముంబై నాసిక్ ఎక్స్‌ప్రెస్‌వే | |
---|---|
మార్గ సమాచారం | |
నిర్వహిస్తున్న సంస్థ ఎన్‌హెచ్‌ఏఐ | |
పొడవు | 150 కి.మీ. (93 మై.) |
ముఖ్యమైన కూడళ్ళు | |
దక్షిణ చివర | థానే |
ఉత్తర చివర | నాసిక్ |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | మహారాష్ట్ర |
రహదారి వ్యవస్థ | |
ప్రాజెక్ట్ అభివృద్ధి
మార్చుNHDP దశ III Aలో అమలులో ఉన్న ప్రాజెక్ట్‌లు
- వాడ్పే నుండి గోండే
వాడ్పే థానే జిల్లాలోను, గోండే నాసిక్ జిల్లాలోనూ ఉన్నాయి. 100 కి.మీ. పని పూర్తయింది. ఈ కాంట్రాక్ట్ 2005 జూన్‌లో గామన్ ఇండియా + సద్భావ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ + బిల్లిమోరియా కన్సార్టియంకు ఇవ్వబడింది. ఈ రహదారి నిర్మాణం కోసం వీరు పెట్టిన ప్రత్యేక సంస్థ పేరు "ముంబై నాసిక్ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్". ప్రాజెక్టు ఖర్చు ₹5790 కోట్లు. కాంట్రాక్ట్‌ను అందించిన తేదీ నుండి 36 నెలల్లో పూర్తి అవుతుందని అంచనా వేసారు. గడువు తేదీని మొదట 2009 ఏప్రిల్ వరకు పొడిగించారు. తరువాత దాన్ని 2011 జనవరి వరకు పొడిగించారు. ఈ ప్రాజెక్ట్‌కు ప్రాజెక్ట్ పర్యవేక్షణ సలహాదారు షెలాడియా అసోసియేట్స్ INC- ఆర్టిఫాక్ట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ - USA
ఇవి కూడా చూడండి
మార్చుగ్యాలరీ
మార్చు-
ముంబై నాసిక్ ఎక్స్‌ప్రెస్ వే
-
ముంబై నాసిక్ ఎక్స్‌ప్రెస్ వే
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Mum-Nashik Expressway gets boost from MSRDC | Nashik ::::: A Complete Guide and Update on Nashik". Nashikcity.in. 29 January 2009. Archived from the original on 25 February 2011. Retrieved 2010-07-16.
- ↑ "Projects – Mumbai Nasik Expressway Limited (MNEL)". Gammoninfra.com. Archived from the original on 2010-12-16. Retrieved 2010-07-16.
- ↑ "Chennai". Indian Tollways. Retrieved 2010-07-16.
- ↑ Parag Parikh. "Mumbai-Nashik proj is key toll revenue maker: Gammon Infra – CNBC-TV18". Moneycontrol.com. Retrieved 2011-07-22.
- ↑ "The Mumbai-Nasik Expressway is expected to be commissioned before March 2011 | Nashik ::::: A Complete Guide and Update on Nashik". Nashikcity.in. 13 September 2010. Archived from the original on 25 March 2012. Retrieved 2011-07-22.