నాసిక్ జిల్లా
మహారాష్ట్ర లోని జిల్లాలలోనాసిక్ జిల్లా (హిందీ:) ఒకటి. నాసిక్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 15,530 చ.కి.మీ.
నాశిక్ జిల్లా
नाशिक जिल्हा | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
డివిజను | నాసిక్ |
ముఖ్య పట్టణం | Nashik |
మండలాలు | 1. Nashik, 2. Sinnar, 3. Igatpuri, 4. Trimbak, 5. Niphad, 6. Yeola, 7. Peth, 8. Dindori, 9. Chandwad, 10. Nandgaon, 11. Surgana, 12. Kalwan, 13. Deola, 14. Baglan, 15. Malegaon[1] |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | 1. Nashik, 2. Dindori (ST), 3. Dhule (shared with Dhule district) Based on (Election Commission website) |
విస్తీర్ణం | |
• మొత్తం | 15,530 కి.మీ2 (6,000 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 49,87,923 |
• జనసాంద్రత | 320/కి.మీ2 (830/చ. మై.) |
ప్రధాన రహదార్లు | NH-3, NH-50 |
Website | అధికారిక జాలస్థలి |
సరిహద్దులు
మార్చుజిల్లా ఉత్తర సరిహద్దులో ధూలే జిల్లా, తూర్పు సరిహద్దులో జలగావ్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో ఔరంగాబాద్ జిల్లా, దక్షిణ సరిహద్దులో అహ్మద్‌నగర్ జిల్లా, వాయవ్య సరిహద్దులో ఠాణే జిల్లా, పశ్చిమ సరిహద్దులో గుజరాత్ రాష్ట్రంలోని వల్సద్ జిల్లా, నవ్‌సరి జిల్లా, నైరుతీ సరిహద్దులో డంగ్ జిల్లా ఉన్నాయి.
భౌగోళికం
మార్చుసయాద్రి పర్వతావళి జిల్లా ఉత్తర భూభాగం నుండి దక్షిణ భూభాగం వరకు విస్తరించి ఉన్నాయి. పశ్చిమ భూభాంలోని కొన్ని గ్రామాలు వరకు కొండప్రాంతం విస్తరించి మద్యలో నదీ ప్రవాహాలు ఉన్నాయి. ఇక్కడ భూమి స్వల్పంగా మాత్రమే వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. పశ్చిమ భూభాగంలోని దిగువభూమి దామన్ గంగా నది వంటి పలు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ నదులు అరేబియన్ సముద్రంలో సంగమిస్తిన్నాయి.
జిల్లాలోని తూర్పు భూభాగం అధికంగా దక్కన్ పీఠమూమిలో భాగంగా ఉంది. ఇది వ్యవసాయ అనుకూలమైన భూమి. తూర్పు, పడమరలుగా విస్తరించి ఉన్న చందర్ పర్వతావళి పీఠభూమిని విడదీయటంలో ప్రధాన పాత్ర వహిస్తింది. ఈ జిల్లాలో జన్మించిన గోదావరి నది తూర్పుగా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో సంగమిస్తుంది. చండేర్ పర్వతావళికి దక్షిణంలో ప్రవహిస్తున్న వాగులు సెలఏర్లు, కద్వ, దామా నదులు గోదావరి నదిలో సంగమిస్తూ ఉన్నాయి. చందర్ పర్వతావళికి ఉత్తరంలో ప్రవహిస్తున్న గిర్నా, మౌసం నదులు తపతి నదిలో సంగమిస్తున్నాయి.
చరిత్ర
మార్చు18వ శతాబ్దంలో నాసిక్ ప్రాంతం మరాఠా సమాఖ్యలో భాగంగా ఉండేది. నాశిక్ ప్రాంతం మీద మరాఠా పేష్వా ఆధీనంలో ఉండేది. జిల్లాలో పలు హిల్ ఫోర్ట్ (కొండ కోటలు ఉన్నాయి). 1818 నాటికి ఈ జిల్లా పేష్వా పాలన తరువాత బ్రిటిష్ ప్రభుత్వంలో భాగంగా మారింది. నాసిక్‌ప్రాంతం బ్రిటిష్ ఇండియాలోని బాంబే ప్రెసిడెన్సీలోని ముందుగా కందేష్, అహ్మద్‌నగర్ జిల్లాలో భాగంగా ఉండేది. 1869లో నాసిక్ జిల్లా రూపొందించబడింది. 1901 లో జనసంఖ్య 816,504. 1890 - 1901 మద్య కాలంలో జనసంఖ్య 3% క్షీణించింది.
వ్యవసాయం
మార్చుజిల్లాలో ప్రధానంగా సజ్జలు, గోధుమలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, పత్తి, చెరుకు పండుతుంది. జిల్లాలో అధికంగా ద్రాక్షతోటలు, పండ్ల తోటలు ఉన్నాయి.
ఆర్ధికం
మార్చుయోలాలో సిల్క్ నేత, పత్తి వస్త్రాలు తాయారీకి ప్రసిద్ధి చెందింది. మాలేగావ్ వద్ద పిండిమిల్లులు అధికంగా ఉన్నాయి. మన్మద్, ఇగత్‌పూర్ వద్ద రైల్వే వర్క్‌షాపులు అధికంగా ఉన్నాయి. మాలేగావ్ వద్ద కంటోన్మెంటు ఉంది.
రైలు మార్గాలు
మార్చుషరన్పూర్ వద్ద క్రిస్టియన్ గ్రామం, అనాథశరణాలయం ఉన్నాయి. దీనిని 1854లో క్రైస్తవ మిషనరీ స్థాపించింది. 1861లో జిల్లాలో " గ్రేట్ ఇండియన్ పెనింసులా రైల్వే " రైలు మార్గనిర్మాణం పూర్తి అయింది. 1878లో మన్మద్, దౌంద్ జిల్లాల మద్య నార్తీస్ట్ లైన్ నిర్మాణం పూర్తి అయింది. పూణె జిల్లావరకు ఆగ్నేయ రైలు మార్గం నిర్మాణం పూర్తి అయింది. 1947 - 1960 మధ్యకాలంలో నాసిక్ ప్రాంతం బాంబే రాష్ట్రంలో భాగంగా ఉండేది. తరువాత మహారాష్ట్రా, గుజరాత్ లలో భాగంగా విభజించబడింది.
వాతావరణం
మార్చునాసిక్ జిల్లాలో గరిష్ఠంగా 1960 మే 12న ఉష్ణోగ్రత 42.4 డిగ్రీల సెల్షియస్ నమోదైంది. అత్యంత కనిష్ఠంగా 1945 జనవరిలో 0.6 డిగ్రీల సెల్షియస్ నమోదైంది. [2]
శీతోష్ణస్థితి డేటా - Nashik district | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 29 (84) |
31 (88) |
35 (95) |
37 (99) |
37 (99) |
32 (90) |
28 (82) |
27 (81) |
29 (84) |
32 (90) |
31 (88) |
29 (84) |
31 (89) |
సగటు అల్ప °C (°F) | 10 (50) |
12 (54) |
16 (61) |
20 (68) |
22 (72) |
23 (73) |
22 (72) |
21 (70) |
21 (70) |
18 (64) |
14 (57) |
12 (54) |
18 (64) |
సగటు అవపాతం mm (inches) | 1.2 (0.05) |
0.5 (0.02) |
1.0 (0.04) |
4.7 (0.19) |
15.1 (0.59) |
154.9 (6.10) |
315.0 (12.40) |
259.0 (10.20) |
183.3 (7.22) |
68.0 (2.68) |
22.3 (0.88) |
4.6 (0.18) |
1,029.6 (40.55) |
Source 1: wunderground.com[3] | |||||||||||||
Source 2: data.gov.in[4] |
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 6,109,052,[5] |
ఇది దాదాపు. | ఇఐ సల్వాదర్ దేశ జనసంఖ్యకు సమానం.[6] |
అమెరికాలోని. | మిస్సౌరీ నగర జనసంఖ్యకు సమం..[7] |
640 భారతదేశ జిల్లాలలో. | 11వ స్థానంలో ఉంది.[5] |
1చ.కి.మీ జనసాంద్రత. | 393 [5] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 22.33%.[5] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 931:1000 [5] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 80.96%.[5] |
జాతియ సరాసరి (72%) కంటే. | |
2007 నగరీకరణ | 75.64%.[8] |
భౌగోళికం
మార్చునాసిక్ ప్రాంతంమంతా బసాలిక్ లావా ప్రవాహించింది. లావాప్రవాహం మైదానపు ఎత్తును పెంచి ఈ ప్రాంతాన్ని పీఠభూమిగా మార్చింది. ఈ లావా ప్రవాహాలు పొరలుపొరలుగా ఉండి భూభాగానికి ఒక ప్రత్యేకత తీసుకువచ్చాయి. గోదావరి జలాలు తీసుకువచ్చిన వండ్రుమట్టి కారణంగా నదీ తీరంవెంట పలుచని భూమి పొర ఏర్పడింది. ఈ భూమి బూడిద, నలుపు, ఎరుపు, గులాబీ వర్నాలతో ఉంటుంది.[9]
భాషలు
మార్చుజిల్లాలో ప్రధానంగా మరాఠీ భాష వాడుకలో ఉంది. ఉత్తర భాగంలో అహిరాని, భిల్లి భాషలు కూడా స్వల్పంగా వాడుకలో ఉన్నాయి.[10] ఆధ్యాత్మిక కేంద్రాలయిన నాసిక్, త్రియంబకం వంటి ప్రదేశాలలో పురాతన భారతీయ భాష అయిన సంస్కృతం వాడుకలో ఉంది.
ఉపవిభాగాలు
మార్చుపరిపాలనాపరంగా, జిల్లా 15 తాలూకాలు, 4 ఉప విభాగాలు ఉన్నాయి:
- నాసిక్ ఉప విభజన: దిందోరి (మహారాష్ట్ర), ఇగాత్,నాసిక్, నాసిక్ రోడ్, పేట్ తాలూకా,ట్రింబకేశ్వర్.
- మాలేగావ్ ఉప విభజన: చంద్వద్, మాలేగావ్,నంద్గఒన్ (మహారాష్ట్ర)
- నిఫద్ ఉప విభజన: నిఫద్, సిన్నర్ తాలూకా యెవొల
- కల్వన్ సబ్-డివిషన్, కెఒల, కల్వన్, బగ్లన్ తాలూకా,సతన, భారతదేశం, సుర్గానా
- నాసిక్ జిల్లా నుండి మలేగావ్ జిల్లాను రూపొందించాలని ప్రతిపాదించబడింది. నాసిక్ జిల్లా ఈశాన్యభూభాగాన్ని మలేగావ్ జిల్లాల్లో కలపాలని ప్రతిపాదించారు.
కొత్తగా రూపొందిస్తున్న మలెగాగ్ జిల్లాలో :- మలేగావ్, నందగావ్, డియోల, బగ్లాన్, కల్వాన్ తాలూకాలు చేర్చాలని ప్రతిపాదించబడింది.
గుర్తించతగిన పట్టణాలు
మార్చు- ఓజర్ మిగ్ నాసిక్ నుండి 20 కి.మీ దూరంలో ఉంది. ఇది ఒకప్పుడు ఇత్తడి బిందెలకు ప్రసిద్ధి. ఇక్కడ మరాఠీ & ఇంగ్లీష్ మీడియం పాఠశాల, సైన్సు అండ్ కామర్స్ జూనియర్ కాలేజ్ ఉన్నాయి.అన్నపూర్ణా హోటల్, బాస్కెట్ బాల్ స్టేడియం, గజ్జు కాఫీ షాప్, కినో దియేటర్ ఉన్నాయి.
- సిన్నర్ నాసిక్ జిల్లాలోని ప్రధాన నగరాలలో ఒకటి.
స్థలాలను
మార్చునాసిక్ జిల్లాలో ప్రతి ప్రతి పన్నెండు సంవత్సరాలకు కుంభ మేళా జరుగుతుంది.
- త్రయంబకేశ్వర్ పన్నెండు వన్ జ్యోతిర్లింగాలలో
- వాణి లేదా సప్తశృంగి
- త్రయంబకేశ్వర
- కలరం ఆలయం
- సర్ (నాసిక్ జిల్లా)
- కల్సుబై
- చంద్వాడ్
- సోమేశ్వర్
- మంగి తుంగి
- దేవ్లాలి
- అంకై ఫోర్ట్
- యెవొలా పైథాని
Notes
మార్చు- ↑ Based in part on "Map of talukas" Archived 2011-07-16 at the Wayback Machine, Nashik district
- ↑ [1]
- ↑ "Historical Weather for Delhi, India". Weather Underground. June 2011. Archived from the original on 2019-01-06. Retrieved November 27, 2008.
- ↑ "District Rainfall Normal (in mm) Monthly, Seasonal And Annual : Data Period 1951-2000". Government of India. Retrieved November 5, 2014.
- ↑ 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
El Salvador 6,071,774 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Missouri 5,988,927
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-25. Retrieved 2014-11-27.
- ↑ Deshpande S.M.and Aher K.R.'Quality of Groundwater from Tribakeswar-Peth area of Nashik District and its Suitability for Domestic and Irrigation Purpose', Gondwana Geological Magazine,26(2),2011 ISSN 0970-261X.
- ↑ M. Paul Lewis, ed. (2009). "Ahirani: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
మూలాలు
మార్చు- Hunter, William Wilson, Sir, et al. (1908). Imperial Gazetteer of India, Volume 18, pp 398–409. 1908-1931; Clarendon Press, Oxford.