ముంబై - న్యూ ఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్
ముంబై-న్యూ ఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్, ఇది ముంబై, న్యూ ఢిల్లీ ల మధ్య నడుస్తున్న దురంతో రకం రైలు. దీన్ని ముంబై AC దురంతో ఎక్స్‌ప్రెస్ అని కూడా అంటారు. ఇది 16 ఎయిర్ కండిషన్డ్ బోగీలు కల రైలు. ఇది మహారాష్ట్ర నుండి ఢిల్లీకి నడిచే అత్యంత వేగవంతమైన రైళ్ళలో ఒకటి. దీనిని పశ్చిమ రైల్వే (WR), ముంబై డివిజన్ నిర్వహిస్తుంది. ఈ రైలు గతంలో వాణిజ్య హాల్ట్‌లు చేసేది కాదు, కానీ ఇప్పుడు వడోదర, రత్లాం, కోటాలలో వాణిజ్య హాల్ట్‌లున్నాయి. ఎగువ దిశలో, న్యూఢిల్లీ నుండి ముంబైకి, రైలు నంబర్ 22210తో, దిగువ దిశలో, ముంబై నుండి న్యూఢిల్లీకి రైలు నంబర్ 22209గా ఈ సేవ నడుస్తుంది. సీల్దా-న్యూ ఢిల్లీ దురంతో రైలును బికనీర్ వరకు పొడిగించిన తర్వాత, ఈ రైలు ప్రస్తుతం భారతీయ రైల్వేలలో అత్యంత వేగవంతమైన దురంతో ఎక్స్‌ప్రెస్.
సారాంశం | |
---|---|
రైలు వర్గం | దురంతో ఎక్స్‌ప్రెస్ |
స్థానికత | మహారాష్ట్ర, గిజరాత్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ |
తొలి సేవ | 23 మార్చి 2012 |
ప్రస్తుతం నడిపేవారు | పశ్చిమ రైల్వే |
మార్గం | |
మొదలు | ముంబై సెంట్రల్ |
గమ్యం | న్యూ ఢిల్లీ |
ప్రయాణ దూరం | 1,384 కి.మీ. (860 మై.) |
సగటు ప్రయాణ సమయం | 22209 – 17 hours 15 minutes; 22210 – 16 hrs 45 mins |
రైలు నడిచే విధం | వారానికి 2 సార్లు: 22209 – Mondays and Fridays; 22210 – Tuesdays and Saturdays |
రైలు సంఖ్య(లు) | 22209 / 22210 |
సదుపాయాలు | |
శ్రేణులు | AC First Class, AC 2 tier, AC 3 tier |
కూర్చునేందుకు సదుపాయాలు | No |
పడుకునేందుకు సదుపాయాలు | Yes |
ఆహార సదుపాయాలు | పాంట్రీ కార్ ఉంటుంది |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | LHB coaches |
వేగం | గరిష్ఠ వేగం 130 km/h (81 mph) సగటు వేగం 83 km/h (52 mph) |
ఇతర దురంతో రైళ్లలో చాలా వరకు రాజధాని రైళ్ళ కంటే తక్కువ ప్రయాణ సమయాన్ని తీసుకుంటాయి. అందువల్ల, ముంబై దురంతో ప్రవేశపెట్టడానికి ముందు, ఇది భారతీయ రైళ్ళలో అత్యంత వేగవంతమైన సేవగా ఉంటుందని భావించారు. ఈ మార్గంలో అత్యధిక ప్రాధాన్యతను పొందే రాజధాని ఎక్స్‌ప్రెస్ ముంబై-ఢిల్లీ మార్గంలో అత్యంత వేగవంతమైన రైలుగా నిలిచింది. కానీ, ఒకప్పుడు నాన్‌స్టాప్ సర్వీసుగా నడిచినప్పటికీ, దురంతో రాజధాని రైళ్ళ కంటే 40–70 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకుంటుంది.
రైలు యొక్క తొలి పరుగు 2012 మార్చి 18 న జరిగింది. ఇది మొదటిసారిగా 02209 ముంబై సెంట్రల్-న్యూ ఢిల్లీ దురంతో ప్రారంభ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌గా నడిచింది [1] టైమ్‌టేబుల్ ప్రకారం మొదటి పరుగు 2012 మార్చి 20 న ఢిల్లీ నుండి ముంబైకి జరిగింది.
బోగీలు
మార్చుభారతదేశంలో తయారైన ఎరుపు-బూడిద రాజధాని లివరీలో LHB కోచ్‌లను ఈ రైలు కోసం ఉపయోగిస్తారు. మా-మాటీ-మానుష్ అని పిలువబడే దురంతో రైలుకు దురంతో వినైల్ లేదా వాల్‌పేపర్ అతికిస్తారు.
ఈ రైలులో 9 థర్డ్ AC (3A), 3 సెకండ్ AC (2A), 1 ప్యాంట్రీ, 1 ఫస్ట్ AC (1A), 2 జనరేటర్ కార్ లు ఉంటాయి. సెలవుల సమయంలో అదనపు రద్దీని తట్టుకోడానికి గరిష్టంగా 1–2 అదనపు కోచ్‌లను జోడించవచ్చు
హాల్టులు
మార్చుఈ రైలుకు రెండు దిశలలోను మూడు వాణిజ్య హాల్టులున్నాయి:-
- వడోదర జంక్షను
- రత్లాం జంక్షను
- కోట జంక్షను
వేగం
మార్చుఈ మార్గం లోని కొన్ని భాగాల్లో మినహాయించి ఈ రైలు గరిష్టంగా అనుమతించదగిన వేగం గంటకు 130 కి.మీ.