ముఖ్యనాథస్వామి గుడి

తెలంగాణా రాష్ట్రంలోని, హన్మకొండ జిల్లా, ధర్మసాగర్ మండలం, ముప్పారం గ్రామంలోని అత్యంత పురాతనమైన కాకతీయుల కాలం నాటి దేవాలయం చుట్టూ అద్భుతమైన ప్రకృతి, అందమైన చెరువుతో, మరో రామప్ప అనేట్లు సందర్షకులకు కనువిందు చేస్తుంది.

కాకతీయులు పూర్తివాస్తుతో ఎన్నో నిష్ఠ, నియమములతో నిర్మించింది. ఈ ముఖ్యనాధుని దేవాలయం గమనించినట్లు ఐతే, సూర్యకిరణాలు దేవాలయాన్ని నలుదిక్కుల తాకుతూ తన గమనదిశకు ప్రయాణిస్తాడు. గుడిపై భాగంకి వెళ్లే రెండుదారుల నీడ ప్రకాశమైన వెలుగులతో కలిసి శివుడి ఆకారం కన్పిస్తుంది.

ముఖ్యనాథస్వామి దేవాలయం

ముఖ్యనాథుడి పునర్వైభవానికి ముప్పారం గ్రామస్థులు ఐక్యమై కృషిచేస్తున్న వేళలో అద్భుత అవకాశంగా దొరికిన శాసనం, శాసనానికి సంబంధించిన వివరాలకోసం చరిత్ర పరిశోధకులకు, పురావస్తు అనుభవజ్ఞులు త్వరలో ముఖ్యనాథస్వామి దేవాలయం చరిత్ర, వారసత్వపు పునర్నిర్మాణంలో గొప్పమైలురాయి కానున్నదని భావిస్తున్నారు.

గుడి విశిష్టత

మార్చు
  • కీ.శ. 11 వ శతాబ్దం, దాదాపు 800 సంవత్సరాల క్రితం నిర్మితమైన అతి పురాతనమైన ఆలయం,
  • కాకతీయ గణపతి దేవుని కాలంలో ఈ దేవాలయన్ని నిర్మించినట్టు, మనకు ఆధారాలు సమీపంలో గల బయ్యన్న బోడు (గుట్ట) పై గల శాసనం ఆధారంగా, పురావస్తు పరిశోధకుల వల్ల తెలియవచ్చింది.
  • 3T (Town,Tank,Temple) ప్రకారం అత్యంత అద్భుతమైన ప్రదేశంగా, విలసిల్లె సుందరమైన గ్రామముగా ముప్పారం ఉండినది.
  • గుడి త్రికుటా ఆలయం[1]గా, సూర్య భగవానుడు, విష్ణు, శివలింగం ఉన్నట్లుగా గ్రామ ప్రజలు, పరిశోధకులు గత రోజుల్లో చెప్పెడి వారు..
  • ఈ రోజున ఆ విగ్రహాలు కానరాకున్నవి. ప్రస్తుత గుడి పరిస్థితి, ధ్వంసం చేయబడ్డ - విశ్వకర్మ విగ్రహం, శివ లింగం, నంది విగ్రహంలు, కాలభైరవ విగ్రహం, భటుల విగ్రహాలు  కలిగినది.
 
తూర్పు భాగం
 
కాల భైరవ స్వామి
  • కొత్తగా గుడికి సమీపంలో చెరువు మత్తడి కింద గణపతి విగ్రహం ప్రజలకు లభించగా, ప్రజలందరూ కలిసి గుడిలో చేర్చి, సంతోషం గా, వారికి తోచినట్టు భక్తీ శ్రద్ధలతో పూజలు చేసుకుంటున్నారు.
  • ఆలయ ముఖ ద్వారం ముందు 66 అడుగుల ఎత్తుగల కాషాయ జెండా పర్యాటకులను కనువిందు చేస్తుంది.

మూలాలు

మార్చు
  1. "త్రికూటాలయం రుద్రేశ్వరుడు". Sakshi. 2017-02-21. Archived from the original on 2017-02-22. Retrieved 2022-01-11.