ముట్నూరి సంగమేశం

ముట్నూరి సంగమేశం సంస్కృతాంధ్ర, హిందీ పండితులు. వీరు ఏప్రిల్ 25, 1919 సంవత్సరంలో పుట్టారు. వీరు శ్రీకాకుళం జిల్లా,వంతరాంలో జన్మించి, విజయనగరం జిల్లా చీపురుపల్లి సమీపంలో గులివిందాడ అగ్రహారంలో స్థిరపడ్డారు. వీరు తెలుగులో హాస్య రచనలపై ప్రత్యేకంగా కృషిచేశారు. 1953లో తెలుగు హాస్యంపై వీరి రచన తెలుగు భాష సమితి బహుమతి పొందింది. అభిమన్యుడు-పద్మవ్యూహం అనే రచన కొండి రామంతో కలసి రచించారు. 2001 లో మరణించాడు.

తెలుగు హాస్యం

మార్చు

తెలుగు సాహిత్యంలో హాస్యరసము గురించి వీరు తెలుగు హాస్యం పేరున ఒక గ్రంథాన్ని రచించారు.[1] దీనిని ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు వారు 1954 లో ప్రచురించారు.

ఈ గ్రంథంలో నవ్వు, హాస్యరసము, హాస్యప్రయోగములోని విభేదాలు, హాస్యకల్పన, జానపదహాస్యం, తెలుగు సాహిత్యంలో హాస్యం, మన హాస్యగ్రంథాలు మొదలైన విషయాలను గురించి రచయిత విశేషంగా చర్చించారు.

ఈడొచ్చిన పిల్ల

మార్చు

ఇదొక కథా సంపుటి. దీనిని ఉమా పబ్లిషర్సు, విజయవాడ వారు 1956లో ప్రచురించారు.[2] ఇందులో మొండికాపురం, యీ అనబగం సాలదా, గుడ్డి మాలోకం, ఇష్టంలేని ప్రయాణానికి అన్నీ అపశకునాలే, నీతా జాతా, ఈడొచ్చిన పిల్ల, శేషయ్య ధర్మకర్త అయ్యాడు, ఆనర్రీ మెంబరు, మర్యాద, సిగరెట్టు, తరుణోపాయం, ఇంగ్లీషుపీడ మొదలైన కథలున్నాయి.

మూలాలు

మార్చు