ముని అనే ఈ సినిమా ఆత్మ పగ తీర్చుకోవడం అనే పాయింటును ఆధారంగా చేసుకొని నిర్మింపబడిన చిత్రం.

ముని
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం లారెన్స్
నిర్మాణం మన్యం రమేష్
రచన రాఘవ లారెన్స్
తారాగణం లారెన్స్,
వేదిక,
రాజ్ కిరణ్,
నాజర్,
బియాంకా దేశాయ్
సంగీతం రమణీ భరద్వాజ్
ఛాయాగ్రహణం కె.వి.గుహన్
కూర్పు సురేష్ అర్స్
భాష తెలుగు

కథాగమనం

మార్చు

గణేష్{లారెన్స్} ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు. అతనికి సాయంత్రం ఆరు దాటిందంటే భయం. అప్పుడు బాత్రూంకు పోవాలన్నా తల్లిని {కోవై సరళ}ను తోడు రమ్మనేంత భయం. గణేష్ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకొంటాడు. గణేష్ తండ్రి ఒక యం.ఎల్.ఏ ఇంటిని అద్దెకు తీసుకొంటాడు. ఆ ఇంట్లో గతంలో ఎం.ఎల్.ఏ ఒకతన్ని బ్రతికుండగానే పెట్రోల్ పోసి కాల్చి చంపుతాడు. చనిపోయిన అతని ఆత్మ ఆ ఇంట్లోనే ఉంటుంది. ఆ ఆత్మ గణేషును ఆవరిస్తుంది. అది తెలుసుకొన్న గణేష్ తలిదండ్రులు ఒక మలయాళ మాంత్రికుడిని తీసుకొచ్చి పూజలు చేయిస్తే ఆ ఆత్మ గణేష్ నుండి బయటకు వచ్చి తానెవరో గణేషును ఎందుకు ఆవహించాల్సి వచ్చిందో చెప్తుంది. ఆకథ ఏమిటంటే ధండపాణి ఎం.ఎల్.ఏ అతడు ఎన్నికలలో గెలవాలంటే ముని {రాజ్ కిరణ్} అనే పల్లెకారుల నాయకుని సహాయం కావాలి. కాని ముని అందుకు నిరాకరిస్తాడు . కారణం ఏమంటే గతంలో ఎం.ఎల్.ఏగా అతడు చేసిన వాగ్ధానాలేవీ నెరవేర్చలేదని. కానీ మునిని సెంటిమెంటుతో లొంగదీసుకొని అతని పలుకుబడి వాడుకొని ఎన్నికలలో గెలుస్తాడు. ఎం.ఎల్.ఏ చేసిన వాగ్ధానాల గురించి అడుగుతాడు ముని. వాగ్ధానలకు అవసరమైన ధనాన్ని అతనికే ఇస్తాను రమ్మని చెప్పి మునిని అతని కూతురినీ చంపేసి కూతురి పెళ్ళి ఘనంగా చేయడానికి తానిచ్చిన ధనన్ని తీసుకు ముని పారిపోయాడని ప్రచారం కల్పిస్తాడు. ఇలా తన కథ చెప్పి వచ్చే మహాశివరాత్రి వరకూ తాను గణేషును ఆవహించి ఉండి తన పగ తీర్చుకొంటానని చెపుతుంది. దీనికి మాంత్రికుడు వప్పుకోడు. కాని అతని కథ విన్న గణేష్ తన ప్రాణాలకు ప్రమాధం అని తెలిసీ అతని కోరిక తీర్చడానికి తన శరీరాన్ని వాడుకొనేందుకు వప్పుకొంటాడు. అక్కడి నుండి తనను చంపిన వారినొక్కరినీ చంపుతూ పోతుంటాడు గణేష్ సహాయంతో ముని. చివరిగా ఎం.ఎల్.ఏతో ప్రజలందరి మధ్య తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పించి అందరికీ కనిపించి ఇదంతా నిజమేనని చెప్పి ఎం.ఎల్.ఏని చంపేసి గణేషును వదిలి వెళ్ళి పోతడు.ఆత్మ ఆవహించగా చేసిన హత్యలకు అతనికీ సంభంధంలేదని పోలీసులు అతనిని అరెస్ట్ చేయరు.

చిత్ర వి‌‌‌‌శేషాలు

మార్చు

ముని ఆత్మ ఆవహించినపుడు మామూలుగా ఉన్నపుడు లారెన్స్ పాత్రలో చూపించిన వ్యత్యాసం బాగుంది. మామూలు చిత్రాలకు భిన్నంగా విభిన్నమైన కథాంశంతో హర్రర్,కామెడీ,యాక్షన్ మిక్ష్ చేసి తీసిన చిత్రం."