మునుగంటి పానకాలరావు

మునుగంటి పానకాలరావు (1882 - 1918) నటుడు, గాయకుడు, .వాగ్గేయకారుడు. అతను స్వరగతులు, వర్ణాలు, కృతులు, జావళీలు, సంగీత లోకానికి అందించాడు.

జీవిత విశేషాలు

మార్చు

అతను కాకినాడలో నారాయణరావు పంతులు, వెంకటరత్నమ్మ దంపతులకు 1882లో జన్మించాడు. మునుగంటి శ్రీరామమూర్తి, పానకాలరావులు సోదరులు. వారు జంత్ర గాత్ర నిపుణులు . శ్రీరామమందిరం నిర్మించి చాలా సభలు చేయించి దానధర్మాలు చేశారు శ్రీరాములుగారి దత్తపుత్రుడు మునుగంటి వెంకటరావు .[1]

అతను తన గురువుగారిలాగే గాత్ర విద్వాంసుడే కాక మంచి వాయులీన విధ్వాంసుడు.

తన అన్నయ్య దగ్గర సంగీతం నేర్చుకొని కాకినాడలో ప్రభుత్వ సంగీత పాఠశాలలో సంగీత ఉపాధ్యాయునిగా పనిచేసాడు. అతను మంచి నటులు కావడం వలన సంగీతానికి నటన తోడై వాటికి అందమైన శరీరం శ్రావ్యమైన కంఠం వన్నె తెచ్చాయి. అతను ఆంధ్ర ప్రదేశ్ లో అనేక ముఖ్యమైన పట్టాణాలలో సంగీత సభలు చేసి ఖ్యాతిని పొందాడు. అతను "స్వరవర్ణ సుధానిధి", "సంగీతకృతి దర్పణము" అనే ఉత్కృష్టమైన రచనలను సంగీత లోకానికి అందించాడు.

వీరు 36 సంవత్సరాల యుక్త వయసులో 1918 సంవత్సరం పుష్య బహుళ పంచమి రోజున పరమపదించారు.

కొన్ని రచనలు

మార్చు
  • స్వరజతి: ఏరా ధీరా ఇటు వినరా, కీరవాణి రాగం, ఆదితాళం.
  • కీర్తన : త్యాగరాజస్వామి గురుని, ఖరహరప్రియ రాగం, ఆదితాళం.
  • వర్ణం : శ్రీరామచంద్ర..., కేదారి రాగం, ఆదితాళం.
  • కీర్తన: రాదా నీ దయ..., బిలహరి రాగం ఆది తాళం

మూలాలు

మార్చు
  1. gdurgaprasad (2020-01-08). "దాక్షిణాత్య సంగీత కళా తపస్సంపన్నులు -16 ఆధునిక ఆంద్ర గాయక మహాశయులు 3". సరసభారతి ఉయ్యూరు. Retrieved 2020-07-22.

బాహ్య లంకెలు

మార్చు