ముస్లింల కులవ్యవస్థ
ఇస్లాం మతమునందు ప్రజలను, వారి జాతి, ప్రాంత, వర్గ, వర్ణ, వృత్తి లేదా మరే విధంగానైన విభజించి వివక్ష చూపడము నిషేధం[ఆధారం చూపాలి]. అయినప్పటికీ ఇస్లాం మతంలో అనేక కులాలు ఉన్నాయి. బాగా ప్రాచుర్యంలో ఉన్నది కేవలం షియా, సున్నీ వర్గాలే అయినప్పటికీ ఇంకా అనేక ఇతర కులాలు ఉన్నాయి.
హిందూ మతం నుండి ఇస్లాం మతంలోకి మారిన వాళ్ళు హిందూ సంప్రదాయాల్ని పూర్తిగా వదిలి పెట్ట లేదు. అది కూడా ముస్లింలలో కులవ్యవస్థ బలంగా వేళ్ళూనుకు పోవడానికి కారణం అని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త యోగిందర్ శిఖండ్ అన్నారు. [ఆధారం చూపాలి]
భారతదేశంలోని ముస్లింలలో కులవ్యవస్థ : ఇస్లాంలో సర్వమానవ సమానత్వ విషయాలు బోధింప బడుచున్ననూ[ఆధారం చూపాలి], దక్షిణాసియా ముస్లింలలో కుల వ్యవస్థ వేళ్ళూనుకొంది.[1].
ముస్లిమ్ కులాల జాబితా
మార్చుముస్లిములలో ఘికంగా విద్యాపరంగా వృత్తిపరంగా ఏర్పడ్డ కులాలు:
- బిసి-ఏ, మెహతర్ ముస్లిమ్,
- బిసి-బి, దూదేకుల,లద్దాఫ్,పింజరి /నూర్ బాషా ముస్లిమ్,
- బిసి-ఈ ముస్లిములు, ఇతర ముస్లిములు
- 1. అచ్చుకట్లవాండ్లు, సింగలి, సింగంవాళ్లు, అచ్చుపనివాళ్లు, అచుకట్టువారు,
- 2. అత్తరు సాయిబులు, అత్తరోళ్లు
- 3. దోభీ ముస్లిం, ముస్లిం దోభీ, ధోబి ముసల్మాన్, తురక చాకలి, తురక చాకల, తురుక సాకలి, తురకల వన్నన్, చాకల, సాకలా, చాకలా, ముస్లిమ్ రజకులు,
- 4.ఫకీరు, ఫకీరు బుడ్‌బుడ్కి, గంటి ఫకీర్, గంటా ఫకీర్లు, తురక బుడ్‌బుడ్కి, దర్వేష్ ఫకీర్,
- 5. గారడీ ముస్లిమ్, గారడీ సాయిబులు, పాముల వాళ్లు, కనికట్టు వాళ్లు, గారడోళ్లు, గారడిగ,
- 6. గోసంగి ముస్లిమ్, పకీరుసాయిబులు
- 7. గుడ్డి ఎలుగువాళ్లు, ఎలుగుబంటు వాళ్లు, ముసల్మాన్ కీలుగుర్ర వాళ్లు
- 8. హజమ్, నాయి, నాయి ముస్లిమ్, నవీద్
- 9. లబ్బి, లబ్బాయి, లబ్బన్, లబ్బ,
- 10. పకీరియా, బోరెవాలే, డేరా ఫకీర్లు, బొంతల
- 11. ఖురేషి, కురేషి,ఖసబ్, మరాఠి ఖాసబ్, కటిక ముస్లిం, ముస్లిం కటిక.
- 12. షైక్, షేక్
- 13. సిద్ధి, యాబ, హబ్షి, జసి
- 14. తురక కాశ, కుక్కుకొట్టే జింకసాయిబులు, చక్కిటకానెవాలే, తిరుగుడు గుంటలవారు, తిరుగాటిగంట, రోళ్లకు కక్కు కొట్టేవారు, పట్టర్ పోదులు, చక్కటకారే,
- 15. 1.సయ్యద్, 2.ముషేక్,3. మొఘల్, 4.పఠాన్, 5.ఇరాని,6. ఆరబ్,7. బొహరా, 8.షియా,9. ఇమామి, 10.ఇష్మాయిల్, 11.కుచిమెమన్,12. జమాయత్,13. నవాయత్లు
- అష్రఫులు (ముస్లిములలో అగ్రవర్ణాలు)
సయ్యదులు, పఠాన్, మొఘల్,, అగ్రవర్ణ హిందూవుల నుండి మత పరివర్తన చెందిన ముస్లిములు, ఉదాహరణకు బ్రాహ్మణ,క్షత్రియులు,వైశ్యులు
పుట్టు పూర్వోత్తరాలు
మార్చులభిస్తున్న వనరుల ప్రకారం ముస్లింలలో కులవ్యవస్థ అభివృధ్ధికి కారణం, భారతదేశంలోని ఇతర హిందూ సోదరులతో ఏర్పరచుకొన్న సంబంధ బాంధ్యవ్యాలు, హిందువుల ఇస్లాం స్వీకరణ.[1][2].[3] తమకు తాము "అష్రఫ్"లుగా ప్రకటించుకొన్న వారు తమ ఉన్నత్వాన్ని అరబ్బు జాతినుండి సంక్రమణ అని భావిస్తారు.Those who are referred to as Ashrafs are presumed to have a superior status derived from their foreign Arab ancestry,[4][5] "అజ్లఫ్"లు, ప్రాంతీయంగా వున్నటువంటి మతస్థులు ఇస్లాం స్వీకరించినవారు. వీరిని తక్కువ చూపుతో చూసేవారున్నారు. దీనికి కారణం అజ్లఫ్‌లు ఇస్లాంను స్వీకరించిననూ, పూర్తిగా ఇస్లాంను పాటించరని, వీరు ఇంకా కులవ్యవస్థ నుండి బయట పడలేదనీ భావించేవారున్నారు.[6] తమకు తాము అష్రఫ్‌లుగా ప్రకటించుకొన్నవారే ఈ కులవ్యవస్థకు ఆద్యులు, వారేగనగ అందరూ సమానమే అన్న ధ్యేయంతో అల్లాహ్, మహమ్మదు ప్రవక్త ఉపదేశాలను కచ్చితంగా పాటించి యుండి వుంటే, ఈ రోజు ముస్లింలలో ఈ కుల వ్యవస్థ వుండేది కాదు.
యోగిందర్ శిఖండ్ ప్రకారం, దక్షిణాసియా ముస్లింలపై హిందూ సంప్రదాయాల ముద్ర ఎక్కువ.[3].
ఈ రోజుల్లో ముస్లిం కుటుంబాలలో వధూవరులను చూచే 'పెళ్ళిళ్ళపేరయ్యలు' చాలామంది మౌల్వీలు, మౌలానాలు, ముల్లాలే. వధూవరుల పెళ్ళిళ్ళ విషయాల్లో వీరే కులాలను వర్గాలను ప్రోత్సహిస్తుంటారు. ఉదాహరణ: షేక్ లకు షేక్ లలోనే, సయ్యద్ లను సయ్యద్ లలోనే, పఠాన్ లకు పఠాన్ లలోనే, సున్నీలకు సున్నీలలోనే, షియాలకు షియాలలోనే, ధోబీలకు ధోబీలలోనే, మెహ్తర్ లకు మెహ్తర్ లలోనే వెతుకుతూంటారు, వీళ్ళంతా నూర్ బాషా, దూదేకుల సాయిబుల్ని పెళ్ళి చేసుకోరు సరిగదా లదాఫ్,పింజారీ అనే పేరులతో అవమానిస్తూ ఉంటారు. కానీ ఉపన్యాసం సమయం వచ్చిందంటే, అల్లాహ్ ముందు అందరూ సమానమే అని ఘోషిస్తారు. ఈ రెండు నాల్కల ధోరణి స్వర్గప్రాప్తి కలిగిస్తుందా? ఆచరించేది మనమే అయినపుడు దాని నింద నిష్ఠూరాలు ఇతరుల మీద మోపడం అల్లాహ్ దృష్టిలో శిక్షార్హం.
విభజన
మార్చుదక్షిణాసియాలోని కొన్ని ప్రాంతాలలో ముస్లింలు అష్రఫ్లు గాను, అజ్లఫ్లు గాను విభజింపబడ్డారు.[7] అష్రఫ్ లు తమ అరబ్భుజాతి వంశపారపర్యాలపట్ల గర్వపడుతూ వుంటాయి.[4][8]. అష్రఫేతరులు (అజ్లఫ్ లు) అనగా భారతదేశంలో ఇతర మతాలనుండి ఇస్లాంలో ప్రవేశించినవారు, వీరు వృత్తిపరమైన కులాలలో విభజింపబడ్డారు.[8]
ఉలేమాలు ఈ కులవ్యవస్థ పట్ల ఆందోళన ప్రకటిస్తారు. కాని సమాజంలో వృత్తిపరమైన కులాలు ఇంకనూ మనగలుగుతున్నాయి. ముహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంనాటి ఇస్లామీయ పండితుడు జియాఉద్దీన్ బరానీ "ఫత్వా-ఎ-జహాందారీ"లో 'అష్రఫ్'ల, 'అజ్లఫ్'ల గూర్చి చర్చించాడు.[9]
- బరానీ దృష్టిలో సత్శీలురు అనగా మహమ్మదు ప్రవక్త వంశస్థులు, వీరికి అందరూ గౌరవించాల్సిందే, వీరు జన్మతః ఉన్నతులు. అలాగే ఉన్నతస్థాయి కలిగిన తురుష్కుల రాజులూ, ఉన్నత పదవులలో వున్నవారినీ 'అష్రఫ్'లుగా ప్రకటించాడు. మిగతావారిని అజ్లఫ్‌లుగా ప్రకటించాడు. వీరిని పలువిధమైన కులాలలో వర్గీకరించాడు. అష్రఫ్‌లు సమాజంలో ఉన్నతవర్గాలనీ, అజ్లఫ్‌లు క్రిందిస్థాయి వర్గాలనీ ప్రకటించాడు.[9]
- రచయిత దృష్టిలో సచ్ఛీలురు అనగా సత్ప్రవర్తన గల వారు. మహమ్మదు ప్రవక్త వంశస్థులు సచ్ఛీలురే, వీరికి అందరూ గౌరవించాల్సిందే, వీరు జన్మతః ఉన్నతులు (సందేహము లేదు). మహమ్మదు ప్రవక్తవంశస్థులేగాక ఇతరులలోనూ సచ్ఛీలురు గావచ్చు. అల్లాహ్ అందరివాడు, సచ్ఛీలులందరినీ గౌరవిస్తాడు.
హదీసుల ప్రకారం మహమ్మదు ప్రవక్త తన కుమార్తె ఫాతిమాతో ఇలా అన్నారు: 'ఫాతిమా! నీవు ప్రవక్త కుమార్తెయని, నీకు అల్లాహ్ ఈ ప్రాతిపదికపైన మోక్షం ప్రసాదిస్తాడని అనుకోకు, నీవు నీ కర్మానుసారం మాత్రమే అబ్ది పొందుతావు' అని. అర్థం ప్రవక్త వంశమూ కర్మానుసారం సాగిపోవలసిందే.
ఈ అష్రఫ్, అజ్లఫ్ లే గాక ఇంకోవర్గముంది, దీని పేరు అర్జల్. కులవ్యతిరేక ఉద్యమకారులైన బాబాసాహెబ్ అంబేద్కర్ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు [10][11] అర్జల్ అనగా 'తక్కువజాతి'వారు. వీరిలో భనార్, హలాల్ ఖోర్, హిజ్డా, లాల్బేగి, మౌగ్తా, మెహ్తర్ మొ.[10][11][12] 1901 గణాంకాల ప్రకారం అర్జల్ లు దళిత ముస్లింలు, వీరు ముస్లింల సమూహాలనుండి దూరంగా నివసించేవారు. వీరు పాకీ పని చేసుకొని జీవించేవారు.[13].
2006 సచ్చర్ కమిటీ తన రిపోర్టులో ఈకులవిభజన ప్రస్తావించింది.[14]
ముస్లింలలో కులాలు
మార్చుస్థూలంగా దక్షిణాసియాలో ఈ కుల సాంప్రదాయం కానవస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో కులాల వర్గీకరణ ఈ విధంగా నున్నది. ఈ వర్గీకరణ హిందూ ధర్మశాస్త్రాలలోని 'మనుస్మృతి' వర్ణక్రమాన్ని తలపింపజేస్తుంది.
సాధారణంగా ముస్లింలలో కనపడే కులాలు అయినటువంటి సయ్యద్, షేఖ్, మొఘల్, పఠాన్ లాంటి కులాలు యే వర్గాలకు చెందుతాయో సరైన ఆధారాలు లేవు. కానీ ఈకులాలకు చెందినవారు దాదాపు అందరూ తమ కులాలు గొప్పవని చాటుకుని తాము అష్రఫ్ లు అని సంతోషపడేవారున్నారు. కొందరైతే సయ్యద్, షేఖ్ లు అష్రఫ్ లు అని, మొఘల్, పఠాన్ లు అజ్లఫ్ లు అనీ భావించేవారూ గలరు. అయిననూ వీటికి మూలాలు కనబడవు.
అగ్రవర్ణాలుగా లేదా ఉన్నత కులస్థులుగా పరిగణింపబడిన వారు. వీరు ఎక్కువగా పట్టణ ప్రాంతాలలో వ్యాపారాలు చేస్తుంటారు. వీరు ఉర్దూ భాషలో మాట్లాడుతారు.
వృత్తి రీత్యా కులాలుగా వర్గీకరింపబడిన వారు. వీరు గ్రామీణ ప్రాంతాలలో ఇస్లాం మతం స్వీకరించిన మాజీ హిందూ కుటుంబాలకి చెందిన వారు. వీరిలో ఎక్కువ మంది ఉర్దూ కాకుండా స్థానిక భాషలలో మాట్లాడుతారు.
వీరు పాకీ పని చేసుకుని సమాజాలనుండి దూరంగా నివసించేవారు. ఆంధ్రప్రదేశ్ లోని మహాతర్ లు, మోచీ లను ఈ వర్గంవారిగా వర్ణిస్తారు. వీరిలో హిజ్రా (అడుక్కుంటూ తిరిగే వారు) లాంటి ఇతర కులాలు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్ర్రాంతాలలో వీరిని మస్జిద్ లోపలికి రానివ్వరు.
విధ్య, విధుల పై నిషేదం
మార్చుఒకప్పుడు హిందువులలో శూద్రులు చదువుకోకూడదని నియమం ఉన్నట్టే ముస్లిమ్లలో కూడా అజ్లాఫ్ లు చదువుకోకూడదని నియమం ఉండేది. (కాని ఖురన్ లో అలా లేదు.)
As Barani sees it, if the ajlaf were allowed access to education, they might challenge ashraf hegemony, he sternly warns the Sultan:
They (ajlaf and arzal) are not to be taught reading and writing, for plenty of disorders arise owing to the skill of the low born in knowledge. The disorder into which all affairs of the religion and the state are thrown is due to the acts and words of the low born, who have become skilled. For, on account of their skill, they become governors (wali), revenue-collectors ('amils), auditors (mutassarif), officers (farman deh) and rulers (farman rawa). If teachers are disobedient, and it is discovered at the time of investigation that they have imparted knowledge or taught letters or writing to the low born, inevitably the punishment for their disobedience will be meted out to them.
పాకిస్తానీ ముస్లింల కుల వ్యవస్థ
మార్చుఇండియాలో కులవ్యవస్థ ఎంత బలంగా ఉందో పాకిస్తాన్ లో కూడా అంతే బలంగా ఉంది. పాకిస్తాన్ లో అగ్రకుల ముస్లింల దిగువకులాల ముస్లింలని పెళ్ళిల్లకి, ఇతర కార్యక్రమాలకి పిలవరు. పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలలో వేరు వేరు కులాల వారు వేరు వేరు వీధుల్లో ఉంటారు. పాకిస్తాన్ లో ముఖ్తారన్ మాయీ పైన ఒక భూస్వామ్య కులం వాళ్ళు జరిపిన సామూహిక అత్యాచారం పాకిస్తాన్ లోని కుల వ్యవస్థ యొక్క బలాన్ని ఉదహరిస్తోంది. పాకిస్తాన్ లో ఈ తరహా అత్యాచారాలు అనేకం జరుగుతున్నపటికీ అందులో వెలుగులోకి వచ్చేవి చాలా తక్కువ. వెలుగులోకి వచ్చినా పొలీసు అధికార్లు, జడ్జిలలో ఉన్న కులతత్వం వల్ల కేసులు నీరుగారి పోతుంటాయి.
ఓ ఆశా కిరణం
మార్చుఈ కులాల వర్గీకరణలు అంత స్పష్టంగా లేవు. స్పష్టంగా వున్నాయంటూ తగిన ఆధారాలూ లేవు. ఇస్లామీయ ధార్మిక గ్రంథాలలో ఇలాంటి రెఫరెన్స్లులూ లేవు. కులాల గురించి చర్చించిన వారికి అల్లాహ్, ముహమ్మద్ తీవ్రంగా మందలించిన గారణంగా, ముస్లిం గణం ఈ విషయంలో అణగి మణగి ఉంది. అయిననూ పెళ్ళీ పెటాకుల విషయంలో ఈ కులాల రోగాల బారిన పడుతూనే ఉన్నారు. ముల్లాలు వీటికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. మేధావులు ఈ ముల్లాల గుట్టును రట్టు చేసి కులాల కుంపటిని ఆర్పవలసిన అవసరం చాలా ఉంది.
ఓటు బ్యాంకు
మార్చుముస్లింలను ఓటు బ్యాంకుగా భావించి వారిని రిజర్వేషన్ల కొరకు ప్రోత్సహిస్తున్నారు. ముస్లిమ్లలో దూదేకుల (దూది శుభ్రం చేసే వాళ్ళు), కసాయి (మాంసం కోసే వాళ్ళు) లాంటి కులాలకి రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ విషయం పైకి చెప్పకుండా, వోట్ల కోసం ముస్లిమ్లందరికీ రిజర్వేషన్లు ఆంటగట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముస్లిమ్లలో కూడా కులవ్యవస్థని వ్యతిరేకించే నిజాయితీ పరులు కొందరు ఉన్నపటికీ వారి సంఖ్య చాలా స్వల్పం. అందుకే ఇలాంటి విషయాలలో ముస్లింల నుంచి వ్యతిరేకత పైకి కనిపించడం లేదు.
గుర్తుంచుకోవలసిన విషయాలు
మార్చు- మతాలు దైవాన్ని చేరే మార్గాలు.
- మతాలు కులాలను వర్గీకరించవు.
- మతాలు మనుషుల మధ్య సోదరభావాలు ప్రకటిస్తాయి గాని, వర్గాలుగా, కులాలుగా విభజించి సామాజిక అసమతౌల్యాలను ప్రవేశపెట్టవు.
- కులం సాంఘిక (దురా) ఆచారం. కొందరు దీనిని సామాజిక వ్యవస్థకు పునాది అనిభావిస్తే, కొందరు దీనికి రుగ్మత అంటారు.
- కచ్చితమైన ఒక విషయం అల్లాహ్ ముందు అందరూ సమానమే.
- ప్రవక్తా ఇదే విషయం బోధించారు.
- మతం అనగా జీవనమార్గం, సమాజంతోనూ ముడివడివుంటుంది. మతము "కులం అనవసరం" అంటుంది. సమాజం "సమకాలీన పరిస్థితులలో కులం అవసరంలేదు" అని ప్రకటిస్తూనే కులం ఆసరా తీసుకొంటుంది.
- మతం ఒకటైనా, కులం పేరుతో వేరుకుంపటి పెట్టుకొని మనిషే మతాన్ని, దాని ఉన్నత బోధనలనూ పట్టించుకోక సామాజిక రుగ్మతలను అంటగట్టుకొనుచున్నాడు.
- ప్రభుత్వమంటే ఎవరు? ప్రజలే కదా!. సాధన సంపత్తి గలవారు ప్రభుత్వాలు ఏర్పరచి దేశాలు యేలుతుంటే, సాధన సంపత్తి లేనివారు, వారి వృత్తులను, కులాలను ఆధారం చేసుకొని తామూ ప్రభుత్వాలను వాటి ఫలాలను పొందాలనే ఆరాటం తప్పా? ఒప్పా?. విజ్ఞులందరూ ఆలోచించాలి.
- ప్రభుత్వాలూ, పెద్ద పెద్ద పదవులూ సంపాదించడానికి అందరికీ సమాన అవకాశాలు అవసరం. వీటి ఆధారం కులం చేసుకోవడం జాడ్యం. సామాజిక సంస్కర్తలూ, సామాజిక సేవకులూ, విద్యాధికులూ, సామాజిక శాస్త్రవేత్తలూ, ఆర్థిక శాస్త్రవేత్తలూ, ధార్మిక పండితులూ, ప్రభుత్వాధినేతలూ, ప్రభుత్వయంత్రాంగం అందరూ కలసి, దీనికొరకు ప్రత్యామ్నాయమార్గాలు వెతకడం అవసరం.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Islamic caste." Encyclopædia Britannica. 2006. Encyclopædia Britannica Online. 18 Oct. 2006
- ↑ Muslim Caste in Uttar Pradesh (A Study of Culture Contact), Ghaus Ansari, Lucknow, 1960, Page 66
- ↑ 3.0 3.1 Singh Sikand, Yoginder. "Caste in Indian Muslim Society". Hamdard University. Archived from the original on 2011-08-11. Retrieved 2006-10-18.
- ↑ 4.0 4.1 Aggarwal, Patrap (1978). Caste and Social Stratification Among Muslims in India. Manohar.
- ↑ Bhatty, Zarina (1996). "Social Stratification Among Muslims in India". In M N, Srinivas (ed.). Caste: Its Twentieth Century Avatar. Viking, Penguin Books India. pp. 249–253. ISBN 0140257608. Archived from the original on 2007-03-12. Retrieved 2007-06-12.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Ikram
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Asghar Ali Engineer. "On reservation for Muslims". The Milli Gazette. Pharos Media & Publishing Pvt Ltd,. Retrieved 2004-09-01.
{{cite web}}
: CS1 maint: extra punctuation (link) - ↑ 9.0 9.1 Das, Arbind, Arthashastra of Kautilya and Fatwa-i-Jahandari of Ziauddin Barrani: an analysis, Pratibha Publications, Delhi 1996, ISBN 81-85268-45-2 pgs 124-143
- ↑ 10.0 10.1 Ambedkar, Bhimrao. Pakistan or the Partition of India. Thackers Publishers.
- ↑ 11.0 11.1 Web resource for Pakistan or the Partition of India
- ↑ Gitte Dyrhagen and Mazharul Islam (2006-10-18). "Consultative Meeting on the situation of Dalits in Bangladesh" (PDF). International Dalit Solidarity Network. Archived from the original (PDF) on 2007-08-03. Retrieved 2007-06-12.
- ↑ Dereserve these myths by Tanweer Fazal,Indian express
- ↑ Dhananjay Mahapatra (January 26, 2008). "SC: Are there castes among Muslims?". The Times of India. Retrieved 2008-01-26.
ఇతర పఠనాలు
మార్చు- Ahmad, Imtiaz (1978). Caste and social stratification among Muslims in India. New Delhi: Manohar. OCLC 5147249.
- Ali, A.F. Imam (1993). Changing Social Stratification in Rural Bangladesh. South Asia Books. ISBN 978-8171692675.
- Sikand, Yoginder (2004). Islam, Caste and Dalit Muslim Relations in India. Global Media Publications. ISBN 8188869066.
- Ali, Syed (2002). "Collective and Elective Ethnicity: Caste Among Urban Muslims in India". Sociological Forum. 17 (4): 593–620. doi:10.1023/A:1021077323866. ISSN 0884-8971.
- Ahmad, S. Shamim; Chakravarti, A. K. (1981). "Some regional characteristics of Muslim caste systems in India". GeoJournal. 5 (1): 55–60. doi:10.1007/BF00185243. ISSN 0343-2521.
- Berreman, Gerald D. (1972). "Social Categories and Social Interaction in Urban India". American Anthropologist. 74 (3): 567–586. ISSN 0002-7294.
బయటి లింకులు
మార్చు- Salil Kader. Social Stratification Among Muslims In India. June 15, 2004.
- Identification of socially and educationally backward classes in the Muslim community of Andhra Pradesh, Report and Recommendations of Sri. P. S. Krishanan (Advisor to Government of Andhra Pradesh—includes section on Indian Caste System and Social Stratification in Indian Muslim Society.
- Yoginder Singh Sikand. Islam And Caste Inequality Among Indian Muslims.
- Andhra fatwa draws flak The telegraph, Calcutta - June 22, 2007