ముస్లిములపై అకృత్యాలు
ఈ "వ్యాసం"లో వ్రాసిన విషయాలు వివాదానికి దారి తీసేలాగా ఉన్నాయి. కొందరికి అభ్యంతరకరంగా ఉండవచ్చును. కనుక ఈ వ్యాసం వ్రాయడంలో విధి విధానాలపైన, తటస్థ దృక్కోణంపైనా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. వ్యాసంతో నేరుగా సంబంధం లేని విషయాలు రాయవద్దు.
|
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
జాతి, మత, తెగల విద్వేషాల వలన, మధ్యయుగంలోనూ, నవీన చరిత్రలోనూ, ముస్లిం సమూహాల పై, ముస్లిమేతరుల దురాగతాలు, అకృత్యాలనే ముస్లింలపై అకృత్యాలూ గా భావించవచ్చు.
ఈ అకృత్యాలు ప్రపంచంలో అనేక చోట్ల, అనేక చారిత్రక కాలాలలో జరిగాయని చెప్పుకోవచ్చు.
ముస్లింలపై మక్కావాసుల అకృత్యాలు
మార్చుముస్లింలపై అకృత్యాలు అనే విషయం, ఇస్లాం ప్రారంభకాలం నుండే కానవస్తుంది. ముహమ్మద్ ప్రవక్తగారి కాలంలో, ముహమ్మద్ ప్రవక్త ఏకేశ్వరోపాసన సిద్ధాంతం ప్రకటించినపుడు, మక్కా వాసులు, ఈవిషయం జీర్ణించుకోలేక పోయారు. మక్కా నగర పాలకులైన కురైషులు, నగర వర్తకులు, భూస్వాములు, ముహమ్మద్ ప్రవక్తపై వారి అనుయాయులపై అనేక కష్టాలు కలుగజేసి అకృత్యాలకు పాల్పడ్డారు. దాదాపు పదకొండు సంవత్సాలకాలం ఈ అకృత్యాలు భరింపలేక ముస్లింలు పలు ప్రదేశాలకు వలస వెళ్ళారు. కొందరు అబిసీనియాకు వలస వెళ్ళారు. ముహమ్మద్ ప్రవక్త మదీనాకు వలస (హిజ్రత్) వెళ్ళారు.
క్రూసేడుల కాలం
మార్చుక్రూసేడుల కాలంలో ముస్లింలపై క్రైస్తవుల అకృత్యాలుగా పేర్కొనవచ్చును.
భారతదేశంలో
మార్చుభారత విభజన కాలం
మార్చు1947లో భారతదేశ విభజన జరిగినప్పుడు హిందూ శిక్కు ముష్కరమూకలు ముస్లిములపై ఎక్కడికక్కడే దాడులకు తెగబడ్డాయి. 1948లో హైదరాబాదు రాష్ట్రాన్ని దేశంలో కలిపినప్పుడు 7,000 మంది ముస్లిముల్ని బలవంతంగా పాకిస్తాన్ పంపేశారు.[1] కోట్లాది మంది ముస్లింలు భారత్ లోనే వుండాలనే నిర్ణయించుకున్నారు.
పోలీస్ యాక్షన్ కాలం
మార్చుపోలీస్ యాక్షన్ (ఆపరేషన్ పోలో) తరువాత ముస్లిములపై విస్తారంగా హింస దౌర్జన్యాలు జరిగాయి. ముస్లిములపై జరిగిన ఈ హత్యాకాండపై విచారణ కోసం నెహ్రూ సుందర్ లాల్ కమిటీని వేశారు. ఆనివేదిక ఇంతవరకూ వెలుగు చూడలేదు.).[2]
మూలాలు
మార్చు- ↑ "British-Yemeni Society: Hadhrami migration in the 19th and 20th centuries". Archived from the original on 2000-07-12. Retrieved 2013-10-31.
- ↑ Noorani, AG. Of a Massacre Untold Archived 2007-10-10 at the Wayback Machine. "Frontline." 3 March 2001.