ముహమ్మద్ రిజ్వాన్
మొహమ్మద్ రిజ్వాన్ (జననం 1992, జూన్ 1) పాకిస్తానీ అంతర్జాతీయ క్రికెటర్. 2015 నుండి అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ ముల్తాన్ సుల్తాన్స్ కెప్టెన్‌గా ఉన్నాడు.[1][2][3] పాకిస్తాన్ తరపున ఆడిన అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్‌గా విస్తృతంగా పరిగణించబడ్డాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | పెషావర్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పాకిస్తాన్ | 1992 జూన్ 1|||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అడుగులు 7 అంగుళాలు (1.70 మీ.) | |||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్-కీపర్–బ్యాట్స్మాన్ | |||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 224) | 2016 నవంబరు 25 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2022 డిసెంబరు 17 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 200) | 2015 ఏప్రిల్ 17 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 సెప్టెంబరు 10 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 16 | |||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 60) | 2015 ఏప్రిల్ 24 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 ఏప్రిల్ 17 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 16 | |||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||
2008–2015 | పెషావర్ పాంథర్స్ | |||||||||||||||||||||||||||||||||||
2011–2018/19 | సూయి గ్యాస్ | |||||||||||||||||||||||||||||||||||
2016–2017 | లాహోర్ కలందర్స్ (స్క్వాడ్ నం. 16) | |||||||||||||||||||||||||||||||||||
2017 | సిల్హెట్ సిక్సర్స్ | |||||||||||||||||||||||||||||||||||
2018-2020 | కరాచీ కింగ్స్ (స్క్వాడ్ నం. 16) | |||||||||||||||||||||||||||||||||||
2018 | పంజాబ్ (పాకిస్తాన్) | |||||||||||||||||||||||||||||||||||
2019/20–2023 | ఖైబర్ పఖ్తూన్వా (స్క్వాడ్ నం. 16) | |||||||||||||||||||||||||||||||||||
2021–present | Multan Sultans (స్క్వాడ్ నం. 16) | |||||||||||||||||||||||||||||||||||
2022 | ససెక్స్ (స్క్వాడ్ నం. 116) | |||||||||||||||||||||||||||||||||||
2023 | కొమిల్లా విక్టోరియన్స్ (స్క్వాడ్ నం. 116) | |||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2023 ఆగస్టు 25 |
క్రికెట్ రంగం
మార్చుఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20ల్లో 2000 పరుగులు చేసిన ఏకైక బ్యాటర్ గా నిలిచాడు.[4][5] టెస్టులు, వన్డే ఇంటర్నేషనల్స్, ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ లలో కుడిచేతి వాటం బ్యాటర్ గా, వికెట్ కీపర్ గా మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలో సెంచరీలు సాధించాడు.[6][7] టెస్టు క్రికెట్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్ గా కూడా ఉన్నాడు.[8] 2021లో విస్డెన్ క్రికెటర్లలో ఒకడు.[9] ఐసీసీ పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021.[10] పాకిస్తాన్ సూపర్ లీగ్[11] లో ముల్తాన్ సుల్తాన్‌లను విజయపథంలో నడిపించాడు. మహ్మద్ రిజ్వాన్ 26 ఇన్నింగ్స్‌లలో 73.66 సగటుతో 1326 పరుగులతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక రన్ స్కోరర్‌గా ఉన్నాడు.
2016 నుండి 2017 వరకు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్‌కు, 2018 నుండి 2020 వరకు కరాచీ కింగ్స్‌కు, 2023 కెప్టెన్ ముల్తాన్ సుల్తాన్స్‌కు ఆడాడు. అతను దేశవాళీ క్రికెట్‌లో ఖైబర్ పఖ్తుంక్వాకు కెప్టెన్‌గా ఉన్నాడు.[12]
తొలి ఎదుగుదల
మార్చురిజ్వాన్ 1992, జూన్ 1న పెషావర్‌లో జన్మించాడు. రిజ్వాన్ ముగ్గురు సోదరులలో రెండవవాడు. ఇస్లామియా కళాశాల, తరువాత షామా వంటి క్లబ్‌లలో చేరడానికి ముందు టేప్ బాల్‌తో తన క్రికెట్ జీవితాన్ని ప్రారంభించాడు. చివరికి 2007లో పెషావర్ అండర్-19 కొరకు ఆడాడు.[13]
అవార్డులు, గుర్తింపు
మార్చు- 2021కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అత్యంత విలువైన క్రికెటర్ ఆఫ్ ది ఇయర్[14]
- 2021కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్[14]
- 2021 సంవత్సరానికి ఐసీసీ పురుషుల టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో పేరు పొందాడు[15]
- 2021 సంవత్సరానికి విస్డెన్ క్రికెటర్స్ ఆఫ్ ది ఇయర్
- 2021 సంవత్సరానికి ఐసీసీ పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్[16][17]
- 2022 కోసం ఐసీసీ పురుషుల టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో పేరు పొందాడు
మూలాలు
మార్చు- ↑ "Mohammad Rizwan profile". ESPNcricinfo. Retrieved 2022-04-10.
- ↑ "ICC Men's T20I Player Batting Rankings". ICC (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-08-30. Retrieved 2022-09-05.
- ↑ "Most runs in a calendar year". Cricinfo. Retrieved 2022-06-05.
- ↑ "PAK vs WI: Mohammad Rizwan Becomes 1st Batter to Score 2,000 T20 Runs in a Calendar Year". www.news18.com (in ఇంగ్లీష్). Retrieved 2022-04-10.
- ↑ "From Mohammad Rizwan to KL Rahul: Know the batters with the highest averages in T20 internationals". SportsAdda (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-08-29. Retrieved 2022-09-05.
- ↑ "Mohammad Rizwan became the second wicket-keeper in the world to score a century in all formats". LING NEWS 24 (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-02-12. Archived from the original on 2021-02-22. Retrieved 2022-04-10.
- ↑ Saeed, Faisal (2021-02-12). "Mohammad Rizwan becomes first Pakistani wicket-keeper to score century across all formats". Mashable Pakistan (in ఇంగ్లీష్). Retrieved 2022-04-10.
- ↑ "'Never been desperate for captaincy': Pakistan Test vice-captain Mohammad Rizwan". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-06-30. Retrieved 2022-04-10.
- ↑ "Darren Stevens Named Among Five Wisden Cricketers Of The Year In 2021". Wisden (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2021-04-14. Archived from the original on 2022-04-10. Retrieved 2022-04-10.
- ↑ "All the winners of the 2021 ICC Awards announced". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 2022-04-10.
- ↑ "Multan Sultans win maiden PSL title, beat Peshawar Zalmi in final". The Indian Express (in ఇంగ్లీష్). 2021-06-25. Retrieved 2022-04-10.
- ↑ "Sarfaraz Ahmed and Babar Azam to take charge of Pakistan domestic sides". ESPNCricinfo. Retrieved 8 September 2020.
- ↑ Samiuddin, Osman (22 May 2021). "Mohammad Rizwan: 'The pain of letting through four byes will never go'". Wisden. Retrieved 26 August 2023.
- ↑ 14.0 14.1 "Rizwan steals limelight in PCB Awards 2021". www.samaa.tv. Retrieved 7 January 2022.
- ↑ "ICC Men's T20I Team of the Year revealed". International Cricket Council. Retrieved 21 January 2022.
- ↑ "The ICC Men's T20I Cricketer of the Year revealed". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 2022-01-23.
- ↑ "Babar Azam, Mohammad Rizwan, Shaheen Afridi receive ICC trophies".