ప్రధాన మెనూను తెరువు

ఇండోనేషియా

ఆగ్నేయాసియాలో గణతంత్ర దేశం
(ఇండోనేసియా నుండి దారిమార్పు చెందింది)

ఇండోనేషియా లేదా ఇండోనీషా[3] మలయ్ ద్వీపసముదాయంలో ఉన్న దేశం. మలయ్ ద్వీపాల సముదాయం ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీప సముదాయం, ఇది భారత్ - చైనా మరియు ఆస్ట్రేలియాల మధ్య, ఇండియన్ మరియు ఫసిఫిక్ సముద్రాలలో విస్తరించి ఉంది. ప్రపంచం లోనే ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశం మరియు మొత్తం జనాభా పరంగా నాలుగో స్థానంలో ఉంది. 1965లో అధికారం చేజిక్కించుకున్న జనరల్ సుహార్తో 1998లో జరిగిన ప్రజా విప్లవంతో అధికారం కోల్పోవటంతో ఇక్కడ స్వేచ్ఛా ఎన్నికలు జరుగుతున్నాయి.

Republic of Indonesia
రిపబ్లిక్ ఇండోనేషియా
Flag of ఇండోనీషా
Flag
Coat of arms of ఇండోనీషా
Coat of arms
Location of ఇండోనీషా
Capital
and largest city
జకార్తా
Official languagesఇండోనేషియన్
Governmentరాష్ట్రపతి తరహా గణతంత్రము
Susilo Bambang Yudhoyono
ముహమ్మద్ Jusuf కల్లా
స్వాతంత్ర్యం నెదర్లాండ్స్ నుండి
• ప్రకటితం
ఆగస్టు 17 1945
• గుర్తింపబడినది
డిసెంబరు 27 1949
• Water (%)
4.85
Population
• జూలైJuly 2007 స్థాపనం. estimate
234,693,997 (4వది)
• 2000 census
206,264,595
GDP (PPP)2007 estimate
• Total
US$845.6 bn[2] (15)
• Per capita
US$3,400[2] (110వది)
Gini (2002)34.3
medium
HDI (2004)Increase 0.711
Error: Invalid HDI value · 108వది
Currencyరుపయ్యా (IDR)
Time zoneఅనేక (UTC+7 to +9)
• Summer (DST)
లేదు (UTC)
Calling code62
ISO 3166 code[[ISO 3166-2:|]]
Internet TLD.id

చరిత్రసవరించు

హిందూ మరియు బౌద్ధ మత ప్రభావాలతో, 7వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు సుమాత్రా మరియు జావా ద్వీపాలలో కొన్ని రాజ్యములు ఏర్పడ్డాయి. తరువాతి కాలాల్లో భారతీయ గుజరాతీ అరబ్బు వర్తకుల రాకతో ద్వీప సముదాయంలో చాలా చోట్ల ఇస్లాం ప్రబలమైన మతంగా అవతరించి, హిందూ మరియు బౌద్ధ రాజ్యముల పతనానికి దారితీసింది.

16వ శతాబ్దంలో యూరోపియన్లు వచ్చి అనేక చిన్న చిన్న రాజ్యాలుండటాన్ని గమనించారు. సుగంధద్రవ్యాల వ్యాపారంలో ఆధిపత్యం చెలాయించే యత్నంలో ఉన్న యూరోపియన్లకు ఈ చిన్న చిన్న రాజ్యాలు దాడులకు అనువుగా కనిపించాయి.

17వ శతాబ్దంలో స్పానిష్ మరియు పోర్చుగీస్ వారిని బయటకు తరిమి, డచ్ వారు మరింత శక్తివంతమైనారు. తిమూర్ ద్వీపం లోని పోర్చుగీస్ తిమూర్ మాత్రం పోర్చుగీస్ వారి వలస రాజ్యం గానే ఉంది. మొదట డచ్ ఈస్ట్ ఇండియా కంపెని VOC నియంత్రణలోను, తరువాత డచ్ ప్రభుత్వం ఆధ్వర్యంలోను 19వ శతాబ్దం నుండి 2వ ప్రపంచ యుద్ధం వరకు ఇందోనేసియాను డచ్ వారు పరిపాలించారు.

19వ శతాబ్దపు వ్యవసాయ పద్ధతి Cultuveerstelsel పేరుతో జావా ద్వీపంలో విశాలమైన వనాలు మరియు నిర్బంధ వ్యవసాయం, డచ్ ప్రభుత్వానికి లాభాలు తెచ్చాయి. 26 డిసెంబరు 2004 నాటి సునామీ వలన సుమత్రా దీవి లోని ఉత్తర భాగాలు కొన్ని ముఖ్యంగా Aceh, తీవ్రంగా నష్టపోయాయి.

ఆర్ధిక వ్యవస్థసవరించు

2007లో తయారు చేసిన అంచనాల ప్రకారం ఇండోనేషియా GDP 410.3 బిలియను డాలర్లు ఉంది (అనగా 845.6 బిలియను డాలర్ల కొనుగోలు శక్తి).[2]

ప్రజలుసవరించు

ఇండోనేషియా ప్రజలను రెండు గ్రూపులుగా విభజింపవచ్చును. పశ్చిమాన అత్యధికంగా మలయ్ లు, తూర్పున పాపుఅన్ లు, వీరి మూలాల మెలనేసియాకు చెందినవి. ఇండోనేషియాలోని చాలామంది ప్రజలు భాష మరియు ప్రాంతీయ పరంగా జావనీలు (జావా ద్వీపాలకు చెందినవారు), సుందనీలు లేదా బాటక్లు. ఇండోనేషియాలోని ప్రధాన మతం ఇస్లాం, 2000 గణాంకాల ప్రకారం దాదాపు 89% (88.22%) లు ముస్లింలు. ప్రపంచంలోనే అత్యధిక ముస్లింలు గల దేశంగా పేరొచ్చింది. క్రైస్తవులు (9%), బౌద్ధులు (2%), మరియు హిందువులు (7%).

 
ప్రంబానన్ దేవాలయం, 10వ శతాబ్దానికి చెందిన హిందూ దేవాలయం, జావా, ఇండోనేషియా.

దాదాపు ప్రజలందరూ 'బహాసా దీరాహ్' తమ ప్రథమ భాషగా మాట్లాడుతారు. కానీ అధికారిక భాష ఇండోనేషియన్ లేదా 'బహాసా-ఇండోనేషియా'. ఇది మలయ్ భాషతో దగ్గర సంబంధాలను కలిగి ఉంది. దాదాపు ఇండోనేషియాలోని అన్ని పాఠశాలలలోనూ ఉపయోగించ బడుతున్నది.

సంస్కృతిసవరించు

ఇండోనేషియాలోని కళలపై అనేక సంస్కృతుల ప్రభావం ఉంది. ప్రఖ్యాత 'జావనీ' నృత్యాలు, హిందూ సంప్రదాయాలను సంస్కృతులనూ కలిగివున్నది. ప్రఖ్యాత జావనీ మరియు బాలినీ నృత్యం 'వయాంగ్-కులిత్' అనేక థియేటర్ షోలు, పలు మతపరమైన ఘటనలను చూపెడతాయి. అనేక ద్వీపాలు తమ 'బాతిక్' మరియు 'ఇఖత్' వస్త్రాలకు పేరుగాంచినవి.

సిలాట్ అనునది ఏకైక 'యుద్ధ కళ', ఇది ద్వీపసమూహాలన్నింటిలోనూ ప్రసిద్ధి.

Albumసవరించు

Further readingసవరించు

బయటి లింకులుసవరించు

మూలాలుసవరించు

  1. US Library of Congress; Vickers (2005), page 117.
  2. 2.0 2.1 2.2 "ఎంపిక చేసిన దేశాలు మరియు వర్గాల GDP రిపోర్టు". వరల్డ్ ఫ్యాక్ట్ బుక్కు. సీఐఏ. 2007. Retrieved మార్చి 26. Unknown parameter |accessyear= ignored (|access-date= suggested) (help); Check date values in: |accessdate= (help)
  3. Indonesia at inogolo.com