మెట్టుగూడ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇది సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుకు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

మెట్టుగూడ
సమీప ప్రాంతాలు
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాద్
మెట్రోహైదరాబాద్
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
500017
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుటి.ఎస్
లోకసభ నియోజకవర్గంసికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంసికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
జాలస్థలిtelangana.gov.in

నివాసప్రాంతంసవరించు

సికిందరాబాదు రైల్వే స్టేషన్ కు అతి సమీపంలో ఉండడంవల్ల రైల్వే ఉద్యోగులు చాలామంది మెట్టుగూడలో నివాసం ఉంటున్నారు. గృహావసర వస్తువులు కూడా అందుబాటులోనే ఉండడంతో ఈ ప్రాంతం నివాసానికి అనువైనదిగా గుర్తించబడింది.

దర్శనీయ స్థలాలుసవరించు

  1. అయ్యప్ప దేవాలయం
  2. ఉమామహేశ్వరస్వామి దేవాలయం
  3. బిర్లామందిర్
  4. సెయింట్ అంతోనీ చర్చి

రవాణా వ్యవస్థసవరించు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మెట్టుగూడ మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది. ఇక్కడికి సమీపదూరంలో సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను ఉంది. అంతేకాకుండా నాగోల్ నుండి మియాపూర్ వరకు వేసిన హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు మెట్టుగూడ మీదుగా వెలుతుంది.[1][2][3]

మూలాలుసవరించు

  1. వి6 న్యూస్ (9 October 2017). "మెట్టుగూడ-అమీర్ పేట్ : మెట్రో ట్రయల్ రన్ కు ఏర్పాట్లు పూర్తి". Archived from the original on 24 అక్టోబరు 2018. Retrieved 24 October 2018.
  2. ఆంధ్రప్రభ (7 October 2017). "హైద‌రాబాద్ : మెట్టుగూడ టు ప్యార‌డైజ్ మార్గంలో ట్ర‌య‌ల్ ర‌న్‌కు బ్రేక్‌". Archived from the original on 24 అక్టోబరు 2018. Retrieved 24 October 2018.
  3. 10టీవి (25 November 2017). "ఇది మన మెట్రో - కేటీఆర్." Archived from the original on 24 October 2018. Retrieved 24 October 2018.