మెదక్ చర్చి
మెదక్ చర్చి : మెదక్ చర్చి తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో, ఏడవ నెంబరు రహదారిపై హైదరాబాదుకు 90 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చ్.
మెదక్ చర్చి | |
---|---|
18°03′13″N 78°16′02″E / 18.0537°N 78.2671°E | |
Country | భారతదేశం |
Denomination | చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా (వెస్లియన్ మెథడిస్ట్, కాంగ్రిగేషనల్, లూథరన్, కాల్వినిస్ట్తో కూడిన యునైటింగ్ చర్చి ] , ఆంగ్లికన్ మిషనరీ సంఘాలు – SPG, WMMS, LMS, బాసెల్ మిషన్, CMS, , చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్) |
Churchmanship | ఆంగ్లికన్ |
Website | [1] |
History | |
Dedication | సెయింట్ పీటర్ |
Specifications | |
Capacity | 5000 |
Administration | |
Diocese | మెదక్ డియోసెస్ |
Clergy | |
Bishop(s) | ది రైట్ రెవరెండ్ ఎ. సి. సోలమన్ రాజ్ |
Priest(s) | రెవ. కె. ఆండ్రూస్ ప్రేమ్ సుకుమార్ |
చరిత్ర
మార్చుమొదటి ప్రపంచయుద్ధ కాలం లో, మెదక్ జిల్లాలో కరువు సంభవించింది. అప్పుడు మిషనరీ, రెవెరెండ్ . చార్లెస్ వాకర్ పోస్నెట్ (Rev. Charles Walker Posnett), చర్చి నిర్మాణం తలపెట్టి, "పనికి ఆహార పథకం" ప్రవేశపెట్టాడు - " గ్రామస్తులు ఎవరైతే చర్చి నిర్మాణంలో పాల్గొంటారో, వారికి ఆహారం ఇవ్వబడుతుంది." "మెతుకులు" అనగా అన్నం, అందుకే ఆ ప్రాంతానికి "మెదక్" అని పేరు వచ్చింది. అలా ఈ చర్చి నిర్మాణం, 1914 నుండి 1924 వరకు కొనసాగింది. ఇది ఆసియాలోనే అతి పెద్దది. ప్రపంచంలో, వాటికన్ చర్చి తరువాత, అతి పెద్దదైన ఈ చర్చి వాస్తుశిల్పి ఎడ్వర్డ్ హార్డింగ్ (Edward Harding). పూర్తిగా తెల్లరాయితో కట్టబడిన ఈ నిర్మాణం కోసం, ఆరు రంగుల మిశ్రమం కలిగిన చతురస్రపు పలకలను ఇంగ్లాండు నుండి, మేస్త్రీలను బొంబాయి నుండి తెప్పించారు. ఇంకా పాలరాతిని ఇటలీ నుండి తెప్పించారు. వారానికొకసారి, నేలను, అద్దాలను కిరోసిన్ కలిపిన కొబ్బరినూనెతో తుడుస్తారు. కిటికీ రంగుటద్దాలపై వ్రాయబడిన వాక్యాలు, ఇంగ్లీషు, తెలుగు, హిందీ భాషలలో కనిపిస్తాయి. మొదట వాక్యాలు హిందీలో లేవు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ సోదరి, విజయలక్ష్మి పండిట్ ఈ చర్చిని సందర్శించినప్పుడు, జాతీయభాష అయిన హిందీలో వ్రాయించింది.
మరిన్ని విశేషాలు
మార్చుఈ చర్చ్ ఎత్తు సుమారు 200 అడుగులు ఉంటుంది. ఇందులో ఉన్న ప్రధాన హాల్ లో ఐదు వేల మంది ఒకేసారి ప్రార్థన చేయొచ్చు.[1]
బయటి లింకులు
మార్చు[2] మెదక్ చర్చి గురించి
మూలాలు
మార్చు- ↑ నమస్తే తెలంగాణ, Tourism (30 మార్చి 2020). "అందాల అధ్యాత్మిక మందిరం..మెదక్ చర్చి". ntnews. నమస్తే తెలంగాణ. Archived from the original on 30 మార్చి 2020. Retrieved 30 మార్చి 2020.