మెహర్ జెసియా (జననం 1970 నవంబరు 30) ఒక భారతీయ నిర్మాత, మోడల్. ఆమె అందాల పోటీ టైటిల్ హోల్డర్ కూడా. ఆమె ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ 1986 టైటిల్ గెలుచుకుంది. మిస్ యూనివర్స్ 1986లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[1][2]

మెహర్ జెసియా
అందాల పోటీల విజేత
జననము (1970-11-30) 1970 నవంబరు 30 (వయసు 53)
కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
వృత్తిమోడల్, నటి
బిరుదు (లు)ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ 1986
ప్రధానమైన
పోటీ (లు)
ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ 1986
(విజేత)
మిస్ యూనివర్స్ 1986 (అన్ ప్లేడ్)
భర్త
(m. 1998; div. 2019)
పిల్లలు2

ప్రారంభ జీవితం

మార్చు

ఆమె 1970 నవంబరు 30న పార్సీ కుటుంబంలో జన్మించింది.[3] ఆమె ముంబై దాదర్లోని జెబి వచా హై స్కూల్ ఫర్ పార్సీ గర్ల్స్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె పార్సీ కాలనీలో పెరిగింది.[3]

కెరీర్

మార్చు

ఆమె 1980లలో తన వృత్తిని ప్రారంభించి, 1986లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. తక్కువ కాలంలోనే, ఆమె మధు సప్రే, ఫిరోజ్ గుజ్రాల్, శ్యామోలీ వర్మ, అన్నా బ్రెడ్మేయర్ వంటి మొదటి తరం భారతీయ సూపర్ మోడల్స్ లో భాగమైంది.[4][5]

సినిమా

మార్చు

ఆమె అర్జున్ రాంపాల్ కలిసి తమ నిర్మాణ సంస్థ చేసింగ్ గణేశ ద్వారా ఐ సీ యు (2006) చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రాంపాల్, విపాషా అగర్వాల్, సోనాలి కుల్కర్ణీ, బొమన్ ఇరానీ తదితరులు నటించారు.[6]

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆమె 1998లో మాజీ మోడల్, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2018 మే 28న, ఈ జంట 20 సంవత్సరాల తరువాత విడిపోయారు.[7] వారికి నవంబరు 2019లో బాంద్రా కుటుంబ న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. వారి ఇద్దరు కుమార్తెలు తమ తల్లితో కలిసి ఉంటున్నారు.[8][9]

మూలాలు

మార్చు
  1. "Catch-Up With The Past Miss Indias". The Times Of India. Archived from the original on 21 March 2009. Retrieved 10 February 2010.
  2. "Style wise". The Hindu. 4 September 2006. Archived from the original on 18 September 2010. Retrieved 10 February 2010.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  3. 3.0 3.1 "Life, as Mehr Jesia knows it". DNA. 20 Sep 2008. Retrieved 2013-09-24.
  4. Aasheesh Sharma (21 September 2013). "Memories of a master". Archived from the original on 30 September 2013. Retrieved 2013-09-24.
  5. Sujata Assomull (25 April 2009). "The magic of Mehr". India Today. Retrieved 2013-09-24.
  6. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మెహర్ జెసియా పేజీ
  7. "Arjun Rampal And Mehr Jesia Announce Their Separation After 20 Years Of Marriage". Headlines Today. Archived from the original on 27 July 2018. Retrieved 28 May 2018.
  8. "Arjun Rampal and Mehr Jesia granted divorce, ending 21 years of marriage". India Today (in ఇంగ్లీష్). 21 November 2019. Archived from the original on 22 November 2019. Retrieved 22 November 2019.
  9. "Arjun Rampal and Mehr Jesia Get Divorced After 21 Years of Marriage, Daughters to Live with Mother". news18.com. Archived from the original on 22 November 2019. Retrieved 22 November 2019.