మేఘనా బోర్డికర్

మేఘనా దీపక్ సాకోర్ బోర్దికర్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె జింటూరు శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా 2024 డిసెంబర్ 15న దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది.[1][2]

మేఘనా బోర్డికర్
మేఘనా బోర్డికర్


మహారాష్ట్ర మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 డిసెంబర్ 15

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019
నియోజకవర్గం జింటూరు

వ్యక్తిగత వివరాలు

జననం 10 ఏప్రిల్ 1980
పర్భాని, మహారాష్ట్ర , భారతదేశం
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు రాంప్రసాద్ బోర్డికర్
జీవిత భాగస్వామి దీపక్ సాకోర్ (ఐపిఎస్ అధికారి)
సంతానం 2
వృత్తి రాజకీయ నాయకురాలు

మేఘనా బోర్డికర్ తండ్రి రాంప్రసాద్ బోర్డికర్ కాంగ్రెస్ నుంచి ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]

రాజకీయ జీవితం

మార్చు

మేఘనా బోర్డికర్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో జింటూరు శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి భంబలే విజయ్ మాణిక్రావుపై 3,717 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[5][6] ఆమె 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థి భంబ్లే విజయ్ మాణిక్రావు పై 4516 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై[7][8] డిసెంబర్ 15న దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది.[9]

మూలాలు

మార్చు
  1. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. English Jagran (15 December 2024). "Maharashtra's New Cabinet: Meet Four Women Ministers Appointed In Devendra Fadnavis-led Govt" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.
  3. "वडील काँग्रेसकडून 5 वेळा आमदार, आता लेकीला मंत्रिपद; कोण आहेत मेघना बोर्डीकर?" (in మరాఠీ). 15 December 2024. Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.
  4. "मेघना बोर्डीकरांना मंत्रिपद मिळावं... परभणीत समर्थकांकडून ग्रामदैवताला महारुद्राभिषेक" (in మరాఠీ). TV9 Marathi. 12 July 2022. Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.
  5. The New Indian Express (24 October 2019). "Maharashtra now has seven more women members in assembly" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  6. The Times of India (26 October 2019). "Meet Maharashtra's 24 women MLAs". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  7. The Economic Times (24 November 2024). "21 women among 288 winning candidates in Maharashtra; only 1 from opposition side". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  8. NDTV Profit (24 November 2024). "Maharashtra Election Results 2024: Full List Of Mahayuti Winners — Fadnavis, Eknath Shinde, Ajit Pawar" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  9. The Indian Express (15 December 2024). "Maharashtra cabinet expanded; here is the full list of ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 15 December 2024. Retrieved 15 December 2024.