రాంప్రసాద్ కదమ్ బోర్డికర్

రాంప్రసాద్ వామన్‌రావ్ కదమ్ బోర్డికర్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి శాసనమండలి సభ్యుడిగా, జింటూరు శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాంప్రసాద్ కదమ్ బోర్డికర్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004-2014
ముందు కుండ్లిక్రావ్ నాగ్రే
తరువాత విజయ్ భామలే
నియోజకవర్గం జింటూరు

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1999 - 2004

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1990 - 1999
ముందు గణేశరావు దూద్‌గాంకర్
తరువాత కుండ్లిక్రావ్ నాగ్రే
నియోజకవర్గం జింటూరు

వ్యక్తిగత వివరాలు

జననం 1955
పర్భాని, మహారాష్ట్ర , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
ఎన్‌సీపీ
సంతానం మేఘనా బోర్డికర్
వృత్తి రాజకీయ నాయకురాలు

రాంప్రసాద్ బోర్డికర్ కుమార్తె మేఘనా బోర్డికర్ జింటూరు నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేస్తుంది.[2][3]

రాజకీయ జీవితం

మార్చు

రాంప్రసాద్ బోర్డికర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి జింటూరు మున్సిపాలిటీ, పంచాయతీ సమితి, బజార్‌ సమితి, బొంబాయి బజార్‌ సమితి ఛైర్మన్‌గా వివిధ హోదాల్లో పని చేసి 1990, 1995 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో జింటూరు శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 1999 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఎన్‌సీపీ నుండి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాంప్రసాద్ బోర్డికర్ ఆ తరువాత తిరిసి కాంగ్రెస్ పార్టీలో చేరి 2004, 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో జింటూరు శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 2016లో కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరాడు.

మూలాలు

మార్చు
  1. "काँग्रेसचे 25 वर्षे आमदार राहिलेले रामप्रसाद बोर्डीकर अखेर भाजपत दाखल" (in మరాఠీ). Divya Marathi. 18 May 2017. Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.
  2. "वडील काँग्रेसकडून 5 वेळा आमदार, आता लेकीला मंत्रिपद; कोण आहेत मेघना बोर्डीकर?" (in మరాఠీ). 15 December 2024. Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.
  3. "मेघना बोर्डीकरांना मंत्रिपद मिळावं... परभणीत समर्थकांकडून ग्रामदैवताला महारुद्राभिषेक" (in మరాఠీ). TV9 Marathi. 12 July 2022. Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.