మెయిడెన్స్ హోటల్, ఢిల్లీ

(మేడిన్స్ హోటల్ ఢిల్లీ నుండి దారిమార్పు చెందింది)

భారత్ లోని ఢిల్లీ నగరంలో ఉన్న మెయిడిన్స్ హోటల్ ను ఒబెరాయ్ మెయిడిన్స్ హోటల్ అని కూడా పిలుస్తారు. ఢిల్లీలోని సివిల్ లైన్ లో ఉండే ఈ చారిత్రక వారసత్వ హోటల్ అసలు పేరు మెయిడిన్స్ మెట్రోపాలిటన్ హోటల్. దీనిని 1903లో ప్రారంభించారు. ఢిల్లీలోని సివిల్ లైన్స్ లో ఉన్న ఈ హోటల్ తొలినాళ్లలో స్థాపించిన వాటిలో ఆధునిక హోటల్ గా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలోనే ఐరోపా (ఐరోపా) తరహా హోటళ్లు కూడా ఉండేవి. అప్పట్లో బ్రిటన్ రాజుకు చెందిన అధికారులంతా ఇక్కడే బస చేసేవారు.[1]

Maidens Hotel
హోటల్ చైన్Oberoi Hotels & Resorts
సాధారణ సమాచారం
చిరునామాCivil Lines, Delhi
ప్రారంభం1903

చరిత్ర

మార్చు

ప్రస్తుత మెయిడిన్స్ హోటల్ కు ముందున్న అసలైన హోటల్ (మెట్రోపాలిటన్ హోటల్) ను 1894 నుంచి మెయిడిన్ సోదరులు అనబడే ఇద్దరు ఆంగ్లేయులు సంయుక్తంగా నడిపేవారు. ప్రస్తుతమున్న ప్రదేశంలోనే ఉన్న ఒక హోటల్ ను 1902 వరకు జె.మెయిడిన్ నిర్వహించారు. 20వ శతాబ్దపు తొలి నాళ్లలో ఢిల్లీలో ఉన్న హోటళ్లలో ఇదే సుప్రసిద్ధ విశాలమైన హోటల్ గా గుర్తింపు పొందింది. 1903లో ఎడ్వర్డ్ –VII ను భారత చక్రవర్తిగా ప్రకటిస్తూ లార్డ్ కర్జన్ నిర్వహించిన రాజ దర్బారు ఉత్సవాలు ఇక్కడే జరిగాయి. ఆ తర్వాత మెట్రోపాలిటన్ హోటల్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అంతేకాదు అతి ఖరీదైన హోటల్ గా కూడా ఇది గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఇది ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిస్టార్ట్స్ సముదాయంలోని ఒక హోటల్ గా ఇది ఉంది.[2]

విశేషాలు

మార్చు

మెయిడిన్స్ హోటల్ ఇప్పటికే వారసత్వ సంపద కలిగిన విలాసవంతమైన హోటల్ గా ప్రఖ్యాతి గాంచింది. రాజుల కాలంనాటి అద్భుత నిర్మాణ కౌశలం (అర్టిటెక్చర్ వైభవం) నేటికి హోటల్ గదుల బయటి నిర్మాణాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. విశాలమైన గదులు, ఎత్తైన పై కప్పు కలిగి హోటల్ ఎంతో అందంగా ఉంటుంది. విశ్రాంతి కోరుకునేవారికి, వ్యాపార నిమిత్తం వచ్చేవారికి ఈ హోటల్ ఎంతో అనుకూలమైనదిగా గుర్తింపు పొందింది.[3]

చిరునామా

మార్చు

ఉత్తర ఢిల్లీలోని శ్యామ్ నాథ్ మార్గ్ లోని నివాస సముదాయల ప్రాంతంలో ఈ హోటల్ ఉంది. యమునా నది ఒడ్డుకు సమీపంలో 7 శ్యామ్ నాథ్ మార్గ్ లో ఈ హోటల్ కనిపిస్తుంది. సివిల్ లైన్స్ మెట్రో స్టేషను నుంచి నడిచేవెళ్లేంత దగ్గరలో ఉంటుంది. అంతేకాదు అతిథులు తమ ఖాళీ సమయాలను సరదాగా గడిపేందుకు దగ్గరలోనే అజ్మెరీ గేట్ (సుమారు 6 కి.మీ), కమలా నెహ్రూ రిడ్జ్ ఫారెస్ట్ (సుమారు 2 కి.మీ.), కొన్నాట్ ప్లేస్ (సుమార్ 6 కి.మీ.) లాంటి చూడదగిన ప్రదేశాలున్నాయి. ఇంకా ఆసక్తి ఉన్నవారికోసం హోటల్ కొద్ది దూరంలోనే హుమాయిన్స్ సమాధి, కుతుబ్ మినార్, మహాత్మాగాంధీ సమాధి అయిన రాజ్ ఘాట్, లోడి గార్డెన్ వంటి ఎన్నో సందర్శనీయ స్థలాలున్నాయి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ హోటల్ సుమారు 21 కి.మీ దూరంలో ఉంటుంది. అదేవిధంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషను నుంచి 7 కి.మీ .దూరంలో ఉంటుంది.[4]

హోటల్ సదుపాయాలు

మార్చు

ఎనిమిది ఎకరాల సువిశాలమైన స్థలంలో, అందమైన, ఆహ్లాదకరమైన పూలమొక్కలతో కూడిన తోటల నడుమ మెయిడిన్ హోటల్ ఉంటుంది. అధునాతనంగా తీర్చిదిద్దిన గదులు, బాంకెట్ హాల్ తో పాటు అన్ని అన్ని రకాల విభాగాలకు చెందిన అతిథులకు అందుబాటులో సౌకర్యాలు, సమావేశ మందిరం, ఏసీ, వైర్ లెస్ ఇంటర్నెట్, ఫ్లాట్ స్క్రీన్ టీవీలు, మినీ బార్, డైరెక్ట్ డయల్ ఫోన్ తో పాటు 24 గంటల గది సేవలు అందుబాటులో ఉంటాయి. హోటల్ స్థాపించిన తొలినాళ్లలో బ్రిటీష్ రాజవంశీకులు సందర్శించినప్పడు తీసిన వివిధ రకాల 70 ఫోటో గ్రాఫ్స్ హోటల్ గదులకు ప్రత్యేక ఆకర్షణ కలిగిస్తున్నాయి. ఇక్కడ భారతీయ, ఐరోపా దేశాలకు చెందిన వంట మనుషులతో తయారు చేసిన వివిధ రకాల వంటలు లభ్యమవుతాయి. హోటల్ పై అంతస్తులో గార్డెన టెర్రాస్, కాఫీ షాప్ వంటివి కూడా ఉన్నాయి. గార్డెన్ టెర్రాస్ అతిథులు సేద దీరడానికి ఎంతో అనువైన ప్రదేశం. పుస్తకాలు చదువుకోవడానికి, కాలక్షేపం కోసం కబుర్లు చెప్పుకోవడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం కలిగి ఉంటుంది. హోటల్ లోని కావర్లీ బార్ 19వ శతాబ్దపు తొలినాళ్ల వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు వివిధ రకాల కాక్ టెయిల్, ఇతర బ్రెవరేజెస్ ఆర్డర్ పై అందజేస్తారు. మెయిడిన్స్ హోటల్లోని కర్జన్ గదిలో అందమైన డైనింగ్ రెస్టారెంట్ కూడా ఉంది. లార్డ్ కర్జన్ ఈ హోటల్ ను సందర్శించి వెళ్లిన తర్వాత అప్పట్లో దీనిని ఏర్పాటు చేశారు.[5]

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "'Lodged' in the heart of New Delhi". Hindustantimes. Archived from the original on 2015-01-25. Retrieved 2015-01-23.
  2. "Other group hotels". Oberoihotels.
  3. Fanshawe, Herbert Charles (1908). "A handbook for travellers in India,". Retrieved 29 September 2011. Burma, and Ceylon: including the provinces of Bengal, Bombay, Madras, the United Provinces of Agra and Lucknow, the Panjab, the North-West Frontier Province, Beluchistan ... etc (London ed.). J. Murray. p. 535.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Maidens Hotel Delhi". Cleartrip.com.
  5. "Hotel Accomdation".[permanent dead link]