మేడిపల్లి మండలం (జగిత్యాల జిల్లా)

తెలంగాణ, జగిత్యాల జిల్లా లోని మండలం

మేడిపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు చెందిన మండలం.[1]

మేడిపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, మేడిపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, మేడిపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో జగిత్యాల జిల్లా, మేడిపల్లి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°48′01″N 78°48′15″E / 18.800368°N 78.804131°E / 18.800368; 78.804131
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జగిత్యాల జిల్లా
మండల కేంద్రం మేడిపల్లి (జగిత్యాల జిల్లా)
గ్రామాలు 19
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 205 km² (79.2 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 51,209
 - పురుషులు 25,268
 - స్త్రీలు 25,941
అక్షరాస్యత (2011)
 - మొత్తం 44.92%
 - పురుషులు 58.46%
 - స్త్రీలు 32.34%
పిన్‌కోడ్ 505453

ఇది సమీప పట్టణమైన జగిత్యాల నుండి 11 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కోరుట్ల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది జగిత్యాల డివిజనులో ఉండేది.ఈ మండలంలో  19  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం మేడిపల్లి

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా- మొత్తం 51,209 - పురుషులు 25,268 - స్త్రీలు 25,941

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 205 చ.కి.మీ. కాగా, జనాభా 51,209. జనాభాలో పురుషులు 25,268 కాగా, స్త్రీల సంఖ్య 25,941. మండలంలో 13,283 గృహాలున్నాయి.[3]

కరీంనగర్ జిల్లా నుండి జగిత్యాల జిల్లాకు మార్పు.

మార్చు

లోగడ మేడిపల్లి గ్రామం/ మండలం కరీంనగర్ జిల్లాలో, జగిత్యాల రెవెన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మేడిపల్లి మండలాన్ని (1+18) పద్నెనిమిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లా,కొత్తగా ఏర్పాటైన మెట్‌పల్లి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు

భీమారం మండలం 2022లో నూతనంగా ఏర్పాటయ్యాక 29,847 జనాభాతో, 10 రెవెన్యూ గ్రామాలతో ఏర్పాటైంది.[5]

  1. కట్లకుంట
  2. పోరుమల్ల
  3. తొంబర్రావుపేట
  4. మేడిపల్లి
  5. కొండాపూర్
  6. వల్లంపల్లి
  7. మాచాపూర్
  8. ధమ్మన్నపేట
  9. కల్వకోట
  10. కాచారం

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-30. Retrieved 2019-02-08.
  2. "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  5. Andhra Jyothy (24 July 2022). "కొత్తగా మరో రెండు మండలాలు". Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.

వెలుపలి లంకెలు

మార్చు