జగిత్యాల రెవెన్యూ డివిజను

జగిత్యాల రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. జగిత్యాల జిల్లాలోవున్న మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 12 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం జగిత్యాలలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంలోని, జగిత్యాల శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.

జగిత్యాల రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాజగిత్యాల

వివరాలు మార్చు

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]

పరిపాలన మార్చు

జగిత్యాల డివిజనులోని మండలాలు:[4]

క్ర.సం జగిత్యాల రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 జగిత్యాల మండలం 4 రెవెన్యూ గ్రామాలు
2 జగిత్యాల గ్రామీణ మండలం 20 రెవెన్యూ గ్రామాలు
3 రాయకల్ మండలం 20 రెవెన్యూ గ్రామాలు
4 సారంగాపూర్ మండలం 12 రెవెన్యూ గ్రామాలు
5 బీర్పూర్ మండలం 11 రెవెన్యూ గ్రామాలు
6 ధర్మపురి మండలం 13 రెవెన్యూ గ్రామాలు
7 బుగ్గారం మండలం 11 రెవెన్యూ గ్రామాలు
8 పెగడపల్లి మండలం 14 రెవెన్యూ గ్రామాలు
9 గొల్లపల్లి మండలం 21 రెవెన్యూ గ్రామాలు
10 మల్యాల మండలం 15 రెవెన్యూ గ్రామాలు
11 కొడిమ్యాల్ మండలం 15 రెవెన్యూ గ్రామాలు
12 వెల్గటూరు మండలం 12 రెవెన్యూ గ్రామాలు
13 ఎండపల్లి మండలం 14 రెవెన్యూ గ్రామాలు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-03-29.
  3. "Revenue Divisions | District Jagtial, Government of Telangana | India". www.jagtial.telangana.gov.in. Archived from the original on 2021-11-06. Retrieved 2022-03-29.
  4. "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2022-03-29.