మై డియర్ భూతం
మై డియర్ భూతం 2022లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై ఏఎస్ బాలాజీ నిర్మించిన ఈ సినిమాకు ఎన్.రాఘవన్ దర్శకత్వం వహించాడు. ప్రభుదేవా, రమ్య నంబీశన్, మాస్టర్ సాత్విక్, సురేశ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జులై 15న విడుదలైంది.[1]
మై డియర్ భూతం | |
---|---|
దర్శకత్వం | ఎన్.రాఘవన్ |
రచన | ఎన్.రాఘవన్ |
నిర్మాత | ఏఎస్ బాలాజీ |
తారాగణం | ప్రభుదేవా, రమ్య నంబీశన్, మాస్టర్ సాత్విక్ |
ఛాయాగ్రహణం | యూ.కే.సెంథిల్ కుమార్ |
కూర్పు | సన్ లోకేష్ |
సంగీతం | డి. ఇమ్మాన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ |
విడుదల తేదీ | 15 జూలై 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుభూతలోకానికి రాజు కర్ణముఖి (ప్రభుదేవా) ఓ ముని వల్ల శపింపబడతాడు దింతో భూలోకంలో అతను ఓ రాయిలా మారిపోతాడు.అయితే తిరిగి ఎవరి వల్ల బయటపడతాడో, ఆ వ్యక్తి ఓ మంత్రాన్ని చదివితేనే కర్ణ ముఖి తిరిగి అతని లోకానికి చేరుకుంటాడు. అసలు కర్ణ ముఖి ఎందుకు శపించబడ్డాడు. చివరికి అతని లోకానికి వెళ్ళాడా? లేదా అనేదే మిగిలిన కథ.[2]
నటీనటులు
మార్చు- ప్రభుదేవా[3]
- రమ్య నంబీశన్
- మాస్టర్ సాత్విక్
- సురేశ్ మీనన్
- సంయుక్త
- ఇమ్మాన్ అన్నాచి
- లొల్లు సభా
- స్వామినాథన్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్
- నిర్మాత: ఏఎస్ బాలాజీ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్.రాఘవన్
- సంగీతం: డి. ఇమ్మాన్
- ఎడిటర్ : సన్ లోకేష్
- మాటలు: నందు తుర్లపాటి
- పాటలు: డా.చల్లా భాగ్యలక్ష్మి
మూలాలు
మార్చు- ↑ Sakshi (12 July 2022). "ఈవారం థియేటర్‌లో రిలీజయ్యే సినిమాలు ఇవే." Archived from the original on 12 July 2022. Retrieved 12 July 2022.
- ↑ The New Indian Express. "My Dear Bootham Movie Review: A fun-filled kids film that needed more sensitivity" (in ఇంగ్లీష్). Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.
- ↑ Eenadu (11 July 2022). "తెలుగు చిత్రసీమే నన్ను పైకి తీసుకొచ్చింది". Archived from the original on 12 July 2022. Retrieved 12 July 2022.