మై డియర్ మార్తాండం
మై డియర్ మార్తాండం 2018లో విడుదలైన తెలుగు సినిమా. మేజిన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సయ్యద్ నిజాముద్దీన్ నిర్మించిన ఈ సినిమాకు హరీష్ కె.వి దర్శకత్వం వహించాడు. పృథ్వీరాజ్, రాకేందు మౌళి, కల్పికా గణేష్, జయ ప్రకాష్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2018 డిసెంబరు 29న విడుదలైంది.[1]
మై డియర్ మార్తాండం | |
---|---|
దర్శకత్వం | హరీష్ కె.వి |
నిర్మాత | సయ్యద్ నిజాముద్దీన్ |
తారాగణం | పృథ్వీరాజ్,రాకేందు మౌళి, కల్పికా గణేష్, జయ ప్రకాష్ రెడ్డి |
ఛాయాగ్రహణం | ర్యాండీ |
కూర్పు | గ్యారీ బి.హెచ్ |
సంగీతం | పవన్ |
నిర్మాణ సంస్థ | మేజిన్ మూవీ మేకర్స్ |
విడుదల తేదీ | 29 డిసెంబరు 2018 |
సినిమా నిడివి | 105 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చిత్ర నిర్మాణం
మార్చుమై డియర్ మార్తాండం ఫస్ట్ లుక్ ను జూలై 10,2018న విడుదల చేసి, [2] వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా జూలై 21,2018న సినిమా టీజర్‌ను విడుదల చేసి, [3] 2018 డిసెంబరు 24న ట్రైలర్‌ను సందీప్ వంగ చేతులమీదుగా చేసి, [4] సినిమాను డిసెంబరు 29న విడుదల చేశారు.[5]
కథ
మార్చురాఖి, కళ్యాణ్ ఇద్దరు మిత్రులు అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఇరుకుంటారు. డిఫెన్స్ లాయర్ గా ప్రాక్టీస్ చేసే లాయర్ మార్తాండం ఈ క్రిమినల్ కేసుని ఎలా వాదించాడు ? ఈ హత్యా కేసు నుంచి ఈ ఇద్దరి స్నేహితులని మార్తాండం కాపాడగలిగాడా ? అనేదే ఈ సినిమా మిగతా కథ.
నటీనటులు
మార్చు- పృథ్వీరాజ్ [6]
- రాకేందు మౌళి
- కల్పికా గణేష్
- జయ ప్రకాష్ రెడ్డి
- కృష్ణ భగవాన్
- తాగుబోతు రమేష్
- కళ్యాణ్ విటపు
- మహేష్ విట్టా
- సుదర్శన్
- జబర్దస్త్ ప్రసాద్
- హరీష్ కోయలగుండ్ల
- విష్ణు
- గోకుల్
- భరద్వాజ్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: మేజిన్ మూవీ మేకర్స్
- నిర్మాత: సయ్యద్ నిజాముద్దీన్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరీష్ కె.వి
- సంగీతం: పవన్
- సినిమాటోగ్రఫీ: ర్యాండీ (రామిరెడ్డి)
- ఎడిటర్: గ్యారీ బి.హెచ్
మూలాలు
మార్చు- ↑ The Times of India (29 December 2018). "My Dear Marthandam Movie". Archived from the original on 18 అక్టోబరు 2021. Retrieved 18 October 2021.
- ↑ Zee Cinemalu (10 July 2018). "'మై డియర్ మార్తాండం' ఫస్ట్ లుక్" (in ఇంగ్లీష్). Archived from the original on 18 ఫిబ్రవరి 2020. Retrieved 18 October 2021.
- ↑ Klapboard (21 July 2018). "మై డియర్ మార్తాండం టీజర్‌ను విడుదల చేసిన వైఎస్ జగన్". Archived from the original on 18 అక్టోబరు 2021. Retrieved 18 October 2021.
- ↑ Vaartha (25 December 2018). ""మై డియర్ మార్తాండం" ట్రైలర్". Archived from the original on 18 అక్టోబరు 2021. Retrieved 18 October 2021.
- ↑ Sakshi (25 December 2018). "డిసెంబర్ 29న 'మై డియర్ మార్తాండం'". Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 18 October 2021.
- ↑ Sakshi (27 December 2018). "అప్పుడే నిండుదనం వస్తుంది". Archived from the original on 18 అక్టోబరు 2021. Retrieved 18 October 2021.