మొగుళ్ళపల్లి మండలం

తెలంగాణ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మండలం

మొగుళ్ళపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం భూపాలపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ములుగు డివిజనులో ఉండేది.ఈ మండలంలో  17  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం మొగుళ్లపల్లి.

మొగుళ్ళపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, మొగుళ్ళపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, మొగుళ్ళపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా, మొగుళ్ళపల్లి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°19′47″N 79°36′57″E / 18.329759°N 79.615746°E / 18.329759; 79.615746
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జయశంకర్ జిల్లా
మండల కేంద్రం మొగుళ్ళపల్లి
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 118 km² (45.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 39,387
 - పురుషులు 19,614
 - స్త్రీలు 19,773
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.87%
 - పురుషులు 62.69%
 - స్త్రీలు 36.74%
పిన్‌కోడ్ 506366

మండల జనాభా

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 39,387, పురుషులు 19,614, స్త్రీలు 19,773

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 118 చ.కి.మీ. కాగా, జనాభా 35,901. జనాభాలో పురుషులు 17,902 కాగా, స్త్రీల సంఖ్య 17,999. మండలంలో 9,828 గృహాలున్నాయి.[3]

వరంగల్ జిల్లా నుండి జయశంకర్ జిల్లాకు మార్పు

మార్చు

లోగడ మొగుళ్లపల్లి మండలం వరంగల్ జిల్లా పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మొగుళ్లపల్లి  మండలాన్ని(1+16) పద్హేడు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి)  జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. అకినేపల్లి
  2. పోతుగల్
  3. కుర్కిశాల
  4. పెద్దకోమటిపల్లి
  5. పార్లపల్లి
  6. మోట్లపల్లి
  7. మెట్‌పల్లి
  8. గుండ్లకర్తి
  9. వేములపల్లి
  10. గుడిపహాడ్
  11. పిడిసిల్ల
  12. ముల్కలపల్లి
  13. మొగుళ్ళపల్లి
  14. ఇస్సిపేట్
  15. అంకుశాపూర్
  16. మేదరమట్ల
  17. రంగాపురం

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "జయశంకర్ భూపాలపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు

మార్చు