మొటిమ
మొటిమలు (acne) స్వేదగ్రంధులకు సంబంధించిన చర్మ వ్యాధి. మొటిమలు ముఖము పైనే కాకుండా మెడ, భుజము, ఛాతి పైన కూడా పుడుతూ ఉంటాయి. 70% నుండి 80% వరకు యువతీ యువకులలో ఇవి కనిపిస్తాయి. యవ్వనములో హార్మోనులు (ఆడువారిలో-ఈస్త్రోజన్, ప్రొజిస్త్రాన్, మగవారిలో-టెస్టోస్టిరాన్) సమతుల్యము (ratio) లోపించడము వలన సబేసియస్-గ్రంధులు నుండి సెబమ్ (oil like substance) ఎక్కువగా తయారై మొటిమలకు దారితీస్తుంది. మొటిమలు చిన్నవి, పెద్దవి అని రెండు రకాలుగా ఉంటాయి. చిన్నవి యుక్తవయసులో కొద్దికాలము పాటు కనిపించినా ఎటువంటి బాధ ఉండదు, వీటివలన ముఖముపై మచ్చలు ఏమి మిగలవు. పెద్దవి-acne vulgaris అనేవి నొప్పి, దురదతో కూడికొని ముఖముపై మచ్చలు ఏర్పడే రకము. సాధారణముగా మొటిమలు ముఖముపైనే కాక మెడపైన, భుజాలపైన, ఛాతీపైన కూడా పుట్టవచ్చును.
లక్షణాలు
మార్చుటీనేజ్ నుంచి మధ్యవయసు వచ్చేవరకు ఆడవారిని ఎక్కువగా బాధించే సమస్యలలో మొటిమలు ఒకటి. మొటిమలు మహిళల సౌందర్యాన్ని సవాల్ చేసే సమస్య. మగ వారిలో కుడా కనిపించును . మొటిమలు (పింపుల్స్) సాధారణంగా 12 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకూ రావడం జరుగుతుంది.
మృదుత్వంతో మెరిసిపోవాల్సిన మోముపై చిన్న మొటిమ వస్తే.. అమ్మాయిల కంగారు అంతాఇంతా కాదు. అది తగ్గేదాకా రకరకాల చికిత్సలు ప్రయత్నిస్తారు. చాలామందిని వేధించే ఈ మొటిమలు ఎందుకు వస్తాయి.. నిర్లక్ష్యం చేస్తే ఎదురయ్యే ఇతర సమస్యలు గురించి వివరంగా తెలుసుకుందాం. కౌమారదశలో ప్రవేశించే వారికే మొటిమల సమస్య ఉంటుందనుకుంటారు చాలామంది. నిజానికి, నలభై ఏళ్లు పైబడినవారికీ వస్తాయివి. కేవలం ముఖంపైనే కాదు.. చేతులు, ఛాతి, వీపు వంటి భాగాలపైనా మొటిమలు వస్తాయి. నాలుగు స్థాయిల్లో వేధించే ఈ సమస్య తీవ్రత కొందరిలో ఎక్కువగా ఉంటుంది. మొటిమలు వచ్చి తగ్గడంతో పాటు.. కొందరికి మచ్చలు పడితే.. మరికొందరికి గుంటల దాకా దారితీస్తాయి. అవి తగ్గడానికి చాలా సమయం పడుతుంది ముఖముపైన ఉండే నూనె గ్రంథులు (sabesious glanda) చర్మములోని వెంట్రుకల కుదుల్లలో ఉండి యుక్తవయస్సులో ఎక్కువగా జిడ్డును తయారుచేయును. వెంట్రుక కుదుల్ల రంద్రాలు మూసుకుపోవడము వలనో, బయటి సూక్ష్మజీవుల (ప్రొపియోనిబాక్టీరియమ్) వలనో ఇన్పెక్షన్ కి గురై పుండుగా మారి, పుండుమానిపోయి మచ్చగా మిగులును. చిదపడము, గోకడము వలన గోళ్ళనుండి ఇన్పెక్షన్ అయి ఎక్కువగా బాదపెట్టును. ఆహారపదార్దములు ముఖ్యముగా నూనెలు, క్రొవ్వులతో కూడిన పదార్దములు తినడము వలన మొటిమలు వస్తాయన్నది అపోహ మాత్రమే.
కారణాలు
మార్చు- హార్మోన్లలో చోటుచేసుకునే మార్పులు..
- చర్మంలో నూనె గ్రంథుల పనితీరు,
- బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ వంటివి ఇందుకు ప్రధాన కారణాలు.
- పరోక్షంగా ఒత్తిడితోనూ కొన్నిసార్లు వస్తుంటాయి.
- పీసీఓడీ (పాలిసిస్టిక్ ఓవరీస్) సమస్య,
- కొన్నిరకాల ఉత్ప్రేరకాలు,
- గర్భనిరోధక మాత్రలు,
- క్షయకు వాడే మందులు.. వంటివీ ఈ సమస్యకు దారితీస్తాయి.[1]
మొటిమలుపై ప్రభావితము చూపే అంశాలు
మార్చు- మానసిక వత్తిడి ఎక్కువైనపుడు
- ఆడు వారిలో PCOD (Poly Cystic Overian Disease) వున్నపుడు
- వంశపారంపర్యము (కొంతవరకు)
- ఆయిలీ స్కిన్ తత్వం ఎక్కువ వుండడం
మొటిమల రకాలు
మీరు ఎదుర్కొంటున్న మొటిమలు ఏ రకంగా గుర్తించాలో విజయవంతమైన చికిత్సకు కీలకం. మొటిమలు నాన్ఇన్ఫ్లామేటరీ లేదా ఇన్ఫ్లామేటరీగా ఉండవచ్చు. ఈ రెండు వర్గాలలో మొటిమలు యొక్క ఉపరకాలు:
- బ్లాక్ హెడ్స్
- వైట్ హెడ్స్
- పురిపిడికాయ
- స్ఫోటములు
- నోడ్యుల్స్
- తిత్తులు
- ఒక చిన్న పొక్కులు (pustules) లేదా చీము నిండిన మొటిమలు, వీటి అడుగున ఎరుపుదేలి ఉంటాయి.
జాగ్రత్తలు
మార్చు- ముఖము రెండుపూటలా సబ్బుతో కడుగుకోవాలి
- విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి
- నిద్రించే ముందు మేకప్ ని తీసి పడుకోవాలి
- తలగడని తరుచుగా మారుస్తూ ఉండాలి లేదా పరిశుబ్రముగా ఉంచుకోవాలి
- మీ తలకు సరిపోయే షాంపూ ని మాత్రమే ఉపయోగించాలి
- తలలో చుండ్రు ని తీసివేయాలి
- జిడ్డుముఖమైతే నూనె, కొవ్వు పదార్దములు తినడము తగ్గించాలి.
- ప్రతిరోజూ వ్యాయామము చేయాలి
- మొటిమలు చిదపడము, గోకడము చేయరాదు.
- గట్టిగా తువ్వాలతో ముఖము తుడవరాదు.
- అతిగా వ్యాయామం చేయకూడదు
- క్రమంగా మీ ముఖం టవల్ మార్చండి
- మీ పిల్లో వాకేసులు మార్చండి[2]
- మీరు ఉపయోగించే ముఖ ప్రక్షాళన క్రీము యొక్క pH బాగా సమతుల్యంగా ఉండాలి.
- మీరు ఉపయోగించే ప్రోడక్ట్ చర్మంలో చిన్న చిన్న రంధ్రాలను పూడ్చకుండా ఉండేదయ్యేట్లు చూసుకోండి. ప్రయత్నించి-పరీక్షింపబడిన ప్రోడక్ట్ నే వాడండి.
ఏర్పడే విధానం
మార్చుమొటిమలు (Acne) స్వేదగ్రంధులకు సంబంధించిన చర్మ వ్యాధి. మొటిమలు ముఖము పైనే కాకుండా మెడ, భుజము, ఛాతి పైన కూడా పుడుతూ ఉంటాయి. 70% నుండి 80% వరకు యువతీ యువకులలో ఇవి కనిపిస్తాయి. యవ్వనములో హార్మోనులు (ఆడువారిలో-ఈస్త్రోజన్, ప్రొజిస్త్రాన్, మగవారిలో-టెస్టోస్టిరాన్) సమతుల్యము (ratio) లోపించడము వలన సబేసియస్-గ్రంధులు నుండి సెబమ్ (oil like substance) ఎక్కువగా తయారై మొటిమలకు దారితీస్తుంది. మొటిమలు చిన్నవి, పెద్దవి అని రెండు రకాలుగా ఉంటాయి. చిన్నవి యుక్తవయసులో కొద్దికాలము పాటు కనిపించినా ఎటువంటి బాధ ఉండదు, వీటివలన ముఖముపై మచ్చలు ఏమి మిగలవు. పెద్దవి-Acne vulgaris అనేవి నొప్పి, దురదతో కూడికొని ముఖముపై మచ్చలు ఏర్పడే రకము. సాధారణముగా మొటిమలు ముఖముపైనే కాక మెడపైన, భుజాలపైన, ఛాథిపైన కూడా పుట్టవచ్చును.
ముఖముపైన ఉండే నూనె గ్రంథులు (sabesious glanda) చర్మములోని వెంట్రుకల కుదుల్లలో ఉండి యుక్తవయస్సులో ఎక్కువగా జిడ్డును తయారుచేయును. వెంట్రుక కుదుల్ల రంద్రాలు మూసుకుపోవడము వలనో, బయటి సూక్షమజీవుల (ex. proprioni bacterium acnes) వలనో ఇన్పెక్షన్ కి గురై పుండుగా మారి, పుండుమానిపోయి మచ్చగా మిగులును. చిదపడము, గోకడము వలన గోళ్ళనుండి ఇన్పెక్షన్ అయి ఎక్కువగా బాదపెట్టును. ఆహారపదార్దములు ముఖ్యముగా నూనెలు, క్రొవ్వులతో కూడిన పదార్దములు తినడము వలన మొటిమలు వస్తాయన్నది అపోహ మాత్రమే.
నివారణ
మార్చు- - పింపుల్స్‌ను గిల్లకూడదు
- - మానసిక ఆందోళనను నివారించడానికి ప్రాణాయామం, యోగా చేయాలి.
- - తాజాగా ఉన్న ఆకుకూరలు, పండ్లు, కాయగూరలు తీసుకోవాలి.
- - నిలువ ఉంచిన ఆహార పదార్థాలను తినకూడదు
- - మలబద్ధకం లేకుండా జీర్ణశక్తి బాగా ఉండేలా చూసుకోవాలి.
- - రోజు తగిన మోతాధిలో నీరు తాగాలి (2 నుంచి 3 లీటరులు)
- - స్వీట్స్, కూల్‌డ్రింక్స్, కేక్స్, ఆయిల్ ఫుడ్స్, వేపుళ్లు, కొవ్వు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తినకూడదు.
- - గోరు వెచ్చని నీటితో ముఖాన్ని రోజుకు 4 నుంచి 6సార్లు శుభ్రపరచుకోవాలి.
- - కొన్ని మెడిసినల్ ఉత్పత్తులను వాడి మొటిమలను తగ్గించవచ్చు. అయితే ఈ ఉత్పత్తులను వాడే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. అంతే కాకుండా మార్కెట్లో ఉండే కాస్మెటిక్స్ వాడి కూడా మొటిమలను తగ్గించవచ్చు.[3]
- - సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
- - రోజుకు సరిపోయే స్థాయిలో నిద్ర ఉండేలా చూసుకోవాలి.
- పింపుల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రకృతిసిద్ధ మైన పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ, ఎక్కువ కేలరీలు ఉన్న ఆహార పదార్థాలు మానేయాలి.
- వేపాకులు, పాలు, పసుపు కలిపి మెత్తగా రుబ్బుకుని పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి. దాన్ని ముఖానికి రాసుకుని కొద్ది నిమిషాలపాటు ఉంచుకోవాలి. తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. కొన్ని రోజుల పాటు ఇలా చెయ్యడం వల్ల మొటిమల సమస్య నుంచి బయట పడొచ్చు.
వైద్యం
మార్చుశరీరములో హార్మోనులు అసమతుల్యత కొంతకాలానికి - సుమారుగా 1 సం. నకు, సర్దుకోవడము వలన మొటిమలు వాటంతటవే పోతాయి, మళ్ళీ పుట్టవు. పెద్ద మొటిమలు వున్నవాళ్ళు - 1. క్లిండామైసిన్+అయిసోట్రిటినోయిన్ కలిసివున్న ఆయింట్ ను వాడాలి (eg. Clindac-A ointment) 2. డాక్షిసైక్లిన్ (Doxycycline)100 mg రోజుకి ఒకటి చొప్పున 7-10 రోజులు వాడాలి. 3.మచ్చలు పోవడానికి అలో వెరాతో కూడిన ఆయింట్మెంట్ (eg. Aloderm-B ointment) సుమారు నెల రోజులు వాడాలి.
- పెద్ద మొటిమలు వున్నవాళ్ళు -
- క్లిండామైసిన్+అయిసోట్రిటినోయిన్, కలిసివున్న ఆయింట్ ను వాడాలి (eg. Clindac-A ointment)
- Femcinol -A skin ointment ... apply daily two times.
- డాక్షిసైక్లిన్ (Doxycycline)100 mg రోజుకి ఒకటి చొప్పున 7-10 రోజులు వాడాలి.
- మచ్చలు పోవడానికి "అలొవెరా "తో కూడిన ఆయింట్మెంట్ (eg. Aloderm-B ointment) సుమారు నెల రోజులు వాడాలి.
- ప్రత్యామ్నాయాలున్నాయి...
మొటిమలు త్వరగా నయం కావాలంటే.. కొన్నిరకాల పీల్స్, లేజర్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలాంటివాటిల్లో శాలిసిలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, గ్త్లెకోలిక్ యాసిడ్ ఉన్న పీల్స్ ఎంచుకోవాలి. ఈ చికిత్సను రెండు వారాలకోసారి ఆరు నుంచి ఎనిమిది విడతల వారీగా చేస్తారు. ఈ చికిత్సతో పాటు మందులు కూడా సూచిస్తారు వైద్యులు. అప్పుడే ఫలితం త్వరగా ఉంటుంది. పరిస్థితిని బట్టి లేజర్ చికిత్స కూడా మరో ప్రత్యామ్నాయం.
- లేజర్ చికిత్సలున్నాయ్...
మోముపై గుంటలకు లేజర్, డెర్మారోలర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ గుంటల్ని పూర్తిగా నివారించాలంటే.. ముందు మొటిమల్ని పూర్తిగా నివారించడం తప్పనిసరి. అప్పుడే గుంటల్ని పూర్తిగా తగ్గింవచ్చు. వీటికోసం అందుబాటులో ఉన్న రెండుమూడు రకాల లేజర్ చికిత్సల్లో ఫ్రాక్షనల్ సీఓ2, అర్బియం గ్లాస్, ఎన్డీయాగ్, ఐపీఎల్.. వంటివి కొన్ని. ఈ చికిత్సను నెలకోసారి మూడు, నాలుగు విడతల్లో చేస్తారు. డెర్మారోలర్ అయితే.. ఐదు విడతల్లో నెలకోసారి చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి కూడా చేయవచ్చు.
ఈ రెండూ వద్దనుకుంటే.. ఫిల్లర్లు ప్రయత్నించవచ్చు. ఇవి తాత్కాలికం, సెమీ పర్మనెంట్, శాశ్వత పద్ధతుల్లో ఉంటాయి. తాత్కాలిక ఫిల్లరయితే.. ఆ ఫలితం ఆరు నుంచి ఎనిమిది నెలలు మాత్రమే ఉంటుంది. సెమీ పర్మనెంట్ చేయించుకుంటే.. ఏడాది నుంచి ఏడాదిన్నర దాకా పనిచేస్తుంది. శాశ్వత ఫిల్లర్‌తో ఐదు నుంచి ఎనిమిదేళ్ల వరకు గుంటలు కనిపించవు. ఈ చికిత్సను మాత్రం ఒకేసారి చేస్తారు.
- ఆడవారికి మొటిమలని దూరం చేసి ముఖసౌందర్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని గృహ-చిట్కాలు...
- ఒక చెంచా గంధపు పొడిలో చిటికెడు పసుపు, కొద్దిగా పాలు పోసి కలిపి ముఖానికి రాస్తే క్రమేణా మొటిమలు తగ్గుతాయి.
- మొటిమలు తగ్గడానికి రెండు రోజులకొకసారి అర కప్పు ఆలోవెరా గుజ్జుని సేవించండి లేదా చర్మం మీదకూడా పూయవచ్చు. గర్భిణులు ఆలోవెరా గుజ్జును సేవించకూడదు.
- దాల్చిన చెక్కను పేస్ట్‌లా చేసి మొటిమలపై రాసి కాసేపాగి కడిగేయండి.
- రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రంగా కడుక్కుని మెంతి ఆకులతో చేసిన పేస్ట్‌ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే మొటిమలు మాయమవుతాయి.
- ఒక టీస్పూన్ మిరియాల పొడి కానీ మిరియాలు కానీ తీసుకుని అందులో 8 వేపాకులు, 20 గ్రాముల చందనం పొడి కలిపి నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తరువాత వేడినీటితో కడగాలి. ఇలా రోజుకొకసారి ఒక వారం రోజులపాటు వేసుకుంటే మొటిమలు రావు. ఉన్నవి తగ్గిపోతాయి.
- కొత్తిమీర రసంలో చిటికెడు ఉప్పు కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చన్నీటితో కడిగితే మొటిమలు పోతాయి. ఉసిరి విత్తనాలను నాలుగైదు గంటలపాటు నీటిలో నానపెట్టి తర్వాత దాన్ని రుబ్బి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించినా కూడా మొటిమలు మాయమవుతాయి. అలాగే ఉల్లి రసం(onion juice) రాస్తే మొటిమలు, కాలిన గాయాల తాలూకు మచ్చలు తగ్గుతాయి.
- కమలా పళ్ళ తొక్కలను ఎండ బెట్టి చూర్ణం చేసి మొహానికి రాసుకుంటే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు కూడా పోతాయి. ముఖాన మొటిమలు, మచ్చలు, పొడలు లాంటివి ఉంటే... కొద్దిగా పొదీనా ఆకులు మెత్తగా నూరి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసి, ఉదయాన్నే శుభ్రంగా కడిగి వేయాలి. ఇలా వారం రోజులు చేస్తే మచ్చలు లేకుండాపోతాయి.
- మొటిమలతో బాధపడేవారు బూరుగు చెట్టుకుండే ముల్లును బాగా అరగదీసి ఆ చూర్ణాన్ని పట్టించినా కూడా ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల సమయానికి సమయం, డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది.
- పసుపు (Turmeric) మహాద్బుతంగా చర్మాన్ని కాపాడే ప్రక్రియలో సహాయపడుతుంది. మీ చర్మానికి మంట కలిగే ప్రదేశాలని చల్లగా చేసి, మచ్చలని తొలగించి, వాపు వచ్చిన ప్రదేశాలలో వాపుని కరిగించుటలో సహాయ పడుతుంది. మీ చర్మ చాయని పెంచి కోమలంగా మరియూ తేజోవంతంగా చేస్తుంది.
- మంచి గంధపుముక్కను చెక్కమీద సానతో అరగదీసి ఆ గంధమును ముఖానికి రాసుకున్నా లేదా పుదీనా ఆకులను రుబ్బి రాసుకున్నా కొద్దిసేపటి తరువాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమలు [2] పోతాయి.
- జాజికాయను నీటిలో గంధంగా అరగదీసి మొటిమలకు రాస్తే మొటిమలు పోతాయి.[4] ముఖసౌందర్యం పెరుగుతుంది.
- నిమ్మరసంలో తులసి ఆకుల్ని(tulasi chief) పేస్ట్‌లా నూరి, మొటిమలపై రాస్తే అవి మటుమాయం కావడమే గాక, మచ్చలు కూడా పోతాయి
- ఒక టేబుల్ స్పూన్ చొప్పున తేనె, పాలు, పసుపు పొడి, సగం చెంచా నిమ్మకాయ రసం కలిపి మోహనికి రాసుకొని 25 లేక 30 నిమిషాలు ఉంచుకొని చల్లటి నీళ్ళతో కడుక్కుంటే మొటిమలు తగ్గుతాయి.
- నిమ్మకాయ రసం మొటిమలకి రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి వేయాలి.
- ఒక టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుని ముఖానికి పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.
- టమోటా(tomato paste) గుజ్జు మొటిమలకి రాసి పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి, ఇలా రోజు రెండు సార్లు చేస్తే మొటిమలు తగ్గుతాయి.
ఇది ఎలా నిర్ధారించబడుతుంది?
మార్చు- భావిత ప్రాంతాల పూర్తి పరీక్ష మొటిమల నిర్ధారణలో సహాయపడుతుంది. కారణంతో బాటు మొటిమలను గుర్తించడానికి క్రింది పరీక్షలు సూచించబడ్డాయి
- రక్త పరీక్షలు, అలాగే PCOS (Polycystic ovary syndrome) ను గుర్తించడానికి అల్ట్రాసౌండ్ స్కాన్లు ఉపయోగించబడతాయి.
- రెటినోయిడ్ (Retinoid), బెంజోయిల్ పెరాక్సైడ్ కలయిక చికిత్సను కూడా ఉపయోగించవచ్చు.
మొటిమల చికిత్సకు దీర్ఘకాలం పడుతుంది, వీటిని నయం చేయడానికి సమయం పడుతుంది, ముఖ్యంగా మంచి చర్మ సంరక్షణ అవసరం.
మొటిమలతో జాగ్రత్తలు
మార్చుచూడటానికి మొటిమలు చిన్నగానే ఉంటాయి గానీ యుక్తవయసు పిల్లలను తెగ ఇబ్బంది పెడతాయి. సౌందర్యపరంగానే కాదు.. మానసికంగానూ వేధిస్తాయి. అందుకే ముఖంపై ఒక్క మొటిమ కనబడినా వెంటనే గిల్లేస్తుంటారు. నిజానికి ఇలా గిల్లటం వల్ల మొటిమలు తగ్గకపోగా మరింత తీవ్రమయ్యే ప్రమాదముంది. కాబట్టి మొటిమలు గలవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.
- ముఖంపై నూనె లేదా జిడ్డుగా ఉండే ఎలాంటి పదార్థాలనూ రాయకూడదు. ఇలాంటివి చర్మంలోని తైల గ్రంథులు మూసుకునేలా చేసి మొటిమలను మరింత తీవ్రం చేస్తాయి. తప్పనిసరైతేనే ముఖానికి మేకప్ వేసుకోవాలి. అలాగే పడుకునేప్పుడు మేకప్‌ను పూర్తిగా కడుక్కోవాలి.
- బయటకు వెళ్లేముందు తప్పనిసరిగా సన్ స్క్రీన్ ని చర్మానికి రాసుకోవడం మంచిది.సూటిగా సూర్యకిరణాలు తాకడం వలన చర్మంలో సెబమ్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి చర్మం జిడ్డుగా మారుతుంది.
- ప్రోటీన్లు, కార్బోహైడ్రాట్లు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ఉత్తమం.
- ఆయిల్ తత్త్వం తక్కువగా ఉండే చర్మసౌందర్యా ఉత్పత్తులను వాడడం ఉత్తమం. నీటి శాతం ఎక్కువగా ఉండే వాటిని వాడడం మంచిది.
- చర్మాన్ని రోజుకి 2 సార్లు అయినా శుభ్రపరచడం వలన కొంతమేరకు చర్మాన్ని కాపాడుకోవచ్చు. [5]
- రోజు నీరు ఎక్కువగా తాగడం వలన ఈ సెబమ్ ఉత్త్పతి తగ్గి చర్మం జిడ్డుబారకుండా ఉంటుంది.
- ప్రతిరోజూ చర్మాన్ని తేమాగా ఉండేలా చూసుకోవాలి
- రోజూ షాంపూతో తలస్నానం చేయటం వల్ల ముఖం జిడ్డుబారకుండా ఉంటుంది. తలకు నూనె, క్రీముల వంటివి వాడితే.. అవి ముఖమంతా విస్తరించి, మొటిమలు ఉద్ధృతం కావటానికి దోహదం చేస్తాయి.
- మొటిమల సమస్య తీవ్రంగా గలవారిలో కొందరికి తైలగ్రంథుల మార్గంలో అధికంగా నూనె పేరుకుపోవటం వల్ల పసుపురంగులో గానీ నల్లగా గానీ ముఖంపై చిన్న బుడిపెలు (బ్లాక్‌హెడ్స్) ఏర్పడుతుంటాయి. వీటిని గిల్లటం మంచిది కాదు. దీంతో మొటిమలు తగ్గటం ఆలస్యమవుతుంది.
- రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. ఇది మొటిమలు తగ్గేందుకూ దోహదం చేస్తుంది.
- కొందరు మొటిమలు తగ్గేందుకు వేసుకునే మందులను మొదలు పెట్టిన తర్వాత ఫలితం లేదని వెంటనే ఆపేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి మందులు పూర్తి ప్రభావం చూపేందుకు 8 వారాల వరకు సమయం పడుతుందని గుర్తించాలి.[6]
- ముక్కు మీద మొటిమలు ఉండటం అనేది రక్తపోటును, గుండెకు సంబంధించిన సమస్యలను సూచిస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంపై శ్రద్ధపెట్టాలి.[7]
మందులు
మార్చుమూలాలు
మార్చు- ↑ Acne-Causes and Treatment, retrieved 2023-05-11
- ↑ 2.0 2.1 "మొటిమలు - గంధపుముక్క". Archived from the original on 2016-03-04. Retrieved 2015-03-17.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-06-05. Retrieved 2020-06-05.
- ↑ "How To Get Rid Of Pimples Fast: 13 Home Remedies & Diet Tips". STYLECRAZE (in అమెరికన్ ఇంగ్లీష్). 2013-10-22. Retrieved 2023-05-11.
- ↑ "How To Get Rid Of Pimples On The Nose?". SkinKraft (in ఇంగ్లీష్). Retrieved 2023-05-11.
- ↑ "మొటిమలు ఎందుకు వస్తాయి. రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తులు". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2023-05-11.
- ↑ "మొటిమలు మీ ఆరోగ్యం గురించి ఏ చెబుతున్నాయ్?". Samayam Telugu. Retrieved 2023-05-11.
- Harison's textbook of Medicine & From my knowledge
- మోల్స్ తొలగింపు ప్రక్రియ
- https://skinbrowse.com/how-to-get-rid-of-pimples-on-nose-with-home-remedies/ Archived 2021-09-24 at the Wayback Machine
- బ్లాక్ హెడ్స్