మొబైల్ ఫోన్ కీ బోర్డు
ప్రాథమిక మొబైల్ ఫోన్ లో అంకెల కీ బోర్డుతో తెలుగు చేర్చగల సదుపాయం కల్పించబడింది. ఉదాహరణకు నోకియా మొబైల్ ఫోన్ తెలుగు కీ బోర్డు చూడండి. మొబైల్ ఫోనులో స్పర్శక్రియకు అనుకూలమైన తెరలు వాడుక ప్రారంభమైన తరువాత మొబైల్ ఫోన్ కీ బోర్డులు భౌతిక రూపం నుండి ఎలెక్ట్రానిక్ బొమ్మ రూపంగా మారాయి. సంక్లిష్ట లిపులు వాడే భాషావాడుకరులకు ఈ పద్ధతి చాలా సులభంగా మారింది. వీటిలో ఎక్కువ భాషలు వాడేవారికి మరింతగా సులువైంది. దీనితో పాటు చేర్చబోయే పదాలను ఊహించి చూపించే సౌలభ్యం కూడా వుంది.
దీనిలో ప్రధానంగా కంప్యూటర్ లో వాడిన కీ బోర్డుని పోలివుండే ఎలెక్ట్రానిక్ కీ బోర్డులు (ఉదా:మల్టీలింగ్ ),[1] ఇతర రూపాలలో వుండే కీ బోర్డులుగా (ఉదా: జీ బోర్డు) [2]విభజించవచ్చు.
ఇన్స్క్రిప్ట్ రూపపు మిథ్యా కీ బోర్డు
మార్చుజీబోర్డు తో తెలుగు ప్రవేశపెట్టటానికి తెలుగు, ఇంగ్లీషు, చేతివ్రాతని గుర్తించే పద్ధతి, మాటని గుర్తించే పద్ధతులు వాడవచ్చు. వీటికి సంబంధించిన తెరపట్టుల చిత్రమాలిక చూడండి.
ఇవీ చూడండి
మార్చుమూలాల జాబితా
మార్చు- ↑ "Telugu Keyboard plugin (మల్టీలింగ్ తెలుగు కీ బోర్డు)". honso. Retrieved 2021-04-11.
- ↑ "Gboard- Google కీబోర్డ్". Google. Retrieved 2021-04-11.