వికీపీడియా:టైపింగు సహాయం

అడ్డదారి:
WP:TH
"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
వికీపీడియాలో తెలుగులో టైపు చెయ్యడం ఎలాగో చూపించే వీడియో
టైపు చేయునపుడు కనబడే ULS అమరికలు
భాషఎంపికలు
ప్రవేశ పద్దతి

లిప్యంతరీకరణ (ఇంగ్లీషు అక్షరాల కీ బోర్డు), ప్రామాణిక ఇన్‌స్క్రిప్ట్ ,ఇన్‌స్క్రిప్ట్2,ఆపిల్,మాడ్యులర్ లేఅవుట్ లు వేరే సాఫ్టువేర్ స్థాపించనవసరము లేకుండా తెలుగు టైపు చేసే విధానము. ఇది మొదట్లో విహరిణిలో నడపబడే జావాస్క్రిప్ట్ ద్వారా పనిచేసేది. మే 2012 లో సర్వర్ పై పనిచేసే నరయం అనే మీడియావికీ పొడిగింత వాడబడింది. 11 జూన్ 2013 న యూనివర్సల్ లాంగ్వేజ్ సెలెక్టర్ (ULS) అనే సాఫ్ట్ వేర్ వాడుకలోనికి వచ్చింది. దీని ద్వారా భాషల ఎంపిక సులభమైంది. మరియు వ్యాసాలను చూపించేటప్పుడు ఇతర భాషల వ్యాసాల లింకులను భౌగోళికంగా దగ్గరి భాషలను ప్రారంభంలో చూపెట్టటం వీలైంది. వికీలో టైపు చేసేటప్పుడు కుడివైపు భాష ఎంపికల బొమ్మ కనబడుతుంది. దాని ద్వారా భాష అమరికలను ఎంచుకోవచ్చు. శాశ్వత అమర్పులకొరకు ప్రవేశించిన వాడుకరులు అభిరుచులు విభాగంలో నా అభిరుచులు వాడాలి. వాడుకరి వివరాలు టేబ్ లో అంతార్జాతీయకరణ విభాగంలో More language settings ద్వారా భాష ప్రదర్శన మరియు ప్రవేశపెట్టు పద్ధతులు చేతన స్థితి మరియు అమర్పులు చేయవచ్చు.

కంప్యూటర్ మరియు అంతర్జాలంలో అన్ని ఉపకరణాలలో మరింత సౌకర్యంగా తెలుగు వాడటానికి కీ బోర్డు వ్యాసం చదివి దానిలోని వివిధ పద్ధతులలో మీకు అనుకూలమైన పద్దతి ఎంచుకోండి.

లిప్యంతరీకరణ

లిప్యంతరీకరణ అంటే, ఇంగ్లీషు లిపిలో టైపు చేస్తూ ఉంటే దానంతట అదే తెలుగు లిపి లోకి మారిపోవడం. ఉదాహరణకు "telugu" అని రాస్తే అది "తెలుగు" అని మారిపోతుంది. ఇది రైస్ ట్రాన్స్‌లిటరేషన్ స్టాండర్డ్ పై ఆధారపడిన పద్ధతి.

అక్షరమాల

లిప్యంతరీకరణ చేసేందుకు ఏయే తెలుగు అక్షరం కోసం ఏ ఇంగ్లీషు అక్షరం/అక్షరాలు వాడాలో కింద ఇచ్చిన పట్టికలలో చూడవచ్చు. క్యాపిటల్ లెటర్సుకు స్మాల్ లెటర్సుకూ తేడా ఉండటాన్ని గమనించండి.

a A = aa i I = ee = ii = ia u oo = uu = U R Ru ~l ~L
e E = ae = ea ai o O = oa au = ou aM aH
అం అః


ka kha = Ka ga gha = Ga ~m
ca = cha Ca = Cha ja jha = Ja ~n
Ta Tha Da Dha Na
ta tha da dha na
pa Pa = pha = fa ba bha = Ba ma


ya ra la va = wa Sa sha sa ha La xa = ksha ~ra
క్ష

ప్రత్యేక అక్షరాలు

  • ఌ = ~l
  • ౡ = ~L
  • అరసున్నా (ఁ) = @M
  • సున్నా = M
  • విసర్గ (ః) = H లేదా @h
  • అవగ్రహ (ఽ) = @2
  • నకార పొల్లు = @n
  • ఖాళీ స్పేసు = _ (అండర్‌స్కోర్)

  • జీరో విడ్త్ నాన్ జాయినర్ (ZWNJ): తెలుగు అజంత భాష. పదాంతంలో పొల్లు ఉండదు. అలాగే పదం మధ్యలో కూడా పొల్లు రాదు. ఇతర భాషా పదాలను తెలుగులో రాసేటపుడు పదం మధ్యలో పొల్లు రాయాల్సి ఉంటుంది. అయితే తెలుగు భాషకున్న సహజ లక్షణం ప్రకారం పొల్లుకు తర్వాతి అక్షరం ముందు అక్షరానికి వత్తుగా మారిపోతుంది. ఉదాహరణకు "ఆన్‌లైన్‌లో" అని రాయాలనుకోండి.. పై పట్టికలలోని సూత్రాల ప్రకారం "aanlainlO" అని ఇంగ్లీషు లిపిలో రాయాలి. అలా రాస్తే తెలుగు లిపిలో అది "ఆన్లైన్లో" అని పడుతుంది. దీన్ని నివారించేందుకు "క్యారట్" (కీబోర్డులో "6" అంకె కీతో పాటు ఉంటుంది చూడండి.) ను వాడాలి, ఇలాగ: aan^lain^lO. అప్పుడు "ఆన్‌లైన్‌లో" అని సరిగా లిప్యంతరీకరిస్తుంది. ఈ సందర్భంలో క్యారట్‌ను జీరో విడ్త్ నాన్ జాయినర్ (Zero Width Non Joiner) అంటారు.[1]
  • ౘాప లోని ౘ = ~ca (యూనీకోడ్ వచ్చే వర్షన్‌లో)
  • ౙాము రాతిరి లోని ౙ = ~ja (యూనీకోడ్ వచ్చే వర్షన్‌లో)

కొన్ని క్లిష్టమైన పదాలు

  • విజ్ఞానము vij~nAnamu
  • శాస్త్రజ్ఞుడు SAstraj~nuDu
  • రామ్ rAm&
  • రాం rAM
  • ఫైర్‌ఫాక్స్ fire^faaks
  • హోమ్‌పేజీ hOm^pEjI
  • ఎంజైమ్‌ eMjaim
  • ఆన్‌లైన్ An^lain
  • లిమ్కా limkA
  • ఎక్స్‌ప్లోరర్ eks^plOrar
  • వ్యాఖ్యానం vyAkhyAnaM
  • అనిశ్చితి aniSciti
  • దుఃఖసాగరం duHkhasaagaram
  • తెలుఁగు telu@Mgu
  • ఆమ్లం aamlaM లేదా AmlaM
  • పాన్పు paan&pu
  • అన్వేషణ an&vEshaNa
  • ఇన్ఫోసిస్ in&FOsis

కొన్ని ఉదాహరణలు

dESa bhAshalaMdu telugu lessa - దేశ భాషలందు తెలుగు లెస్స

telugulO vrAyaDam ippuDu kashTaM kAdu - తెలుగులో వ్రాయడం ఇప్పుడు కష్టం కాదు

viSvadAbhirAma vinuravEma - విశ్వదాభిరామ వినురవేమ

SrI madbhagavadgIta tatvavivEcanI vyAkhya - శ్రీ మద్భగవద్గీత తత్వవివేచనీ వ్యాఖ్య

fair^fAks veb^braujar - ఫైర్‌ఫాక్స్ వెబ్‌బ్రౌజర్

yAvatprapancAnikI cATiceppanDi. - యావత్ప్రపంచానికీ చాటిచెప్పండి.

మొబైల్ లో తెలుగు

వికీపీడియా ను మొబైల్ ద్వారా సవరిస్తున్నపుడు Gboard ద్వారా నేరుగా తెలుగులో టైప్ చేయవచ్చు ఈ ( గూగుల్ కీబోర్డ్ ) అనేది Android మరియు iOS పరికరాల కోసం Google చే అభివృద్ధి చేయబడిన ఇన్పుట్ పద్ధతి ప్రోగ్రామ్.ఇది గ్లైడ్ ఇన్పుట్ మరియు మాట్లాడటం ద్వారా టైపు చేయటం ( వాయిస్ ఇన్పుట్ లేదా text to speech) వంటి విధులను అందిస్తుంది,ఈ కీబోర్డ్ చాలా Android పరికరాల్లో ముందే ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది , అది లేనప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ లలో ప్లే స్టోర్ జిబోర్డ్ ( Gboard) లేదా ఇండిక్ కీబోర్డ్ (Google Indic Keyboard) అనే అనువర్తనం డౌన్‌లోడ్ చేసుకోవాలి, యాపిల్ app store లో కూడా జిబోర్డ్ అనువర్తనం ఉంటుంది , దీనిని స్థాపించిన తరువాత ఫోన్లో Settings > Language/Input Tools > Google Keyboard settings / Gboard ను ఓపెన్ చేయాలి అందులో తెలుగు భాషను ఎంపికచేయాలి దానితోపాటుగా అందుబాటులో ఉన్న అన్ని కీబోర్డ్ సంస్కరణలను కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఇవేకాక చాలా మొబైల్ లో తెలుగు రాయటానికి చాలా అనువర్తనాలు అందుబాటులో ఉన్నాయి.

ఇవీ చూడండి

వనరులు

  1. "Developing OpenType Fonts for Telugu Script (2 of 3):Shaping Engine". Microsoft. Archived from the original on 2018-01-24.