మహ్మద్ ఇలియాస్
మహ్మద్ ఇలియాస్ మహమూద్ (జననం 1946, మార్చి 19) పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1964 - 1969 మధ్యకాలంలో పది టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మహ్మద్ ఇలియాస్ మహమూద్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | లాహోర్, పంజాబ్, బ్రిటిష్ ఇండియా | 1946 మార్చి 19|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | లెగ్‌బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | నాజర్ మొహమ్మద్ (మామ) ఫిరోజ్ నిజామి (మామ) ముదస్సర్ నాజర్ (బంధువు) కమ్రాన్ అక్మల్ (అల్లుడు) ఇమ్రాన్ ఫర్హత్ (అల్లుడు) | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 49) | 1964 డిసెంబరు 4 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1969 ఫిబ్రవరి 28 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2021 నవంబరు 5 |
క్రికెట్ రంగం
మార్చుఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా, అప్పుడప్పుడు లెగ్ స్పిన్ బౌలర్ గా రాణించాడు. 1961 నుండి 1972 వరకు పాకిస్తాన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. 1965 ఏప్రిల్ లో కరాచీలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడవ టెస్ట్‌లో 126 పరుగులు చేశాడు. ఐదున్నర గంటల్లో విజయానికి 202 పరుగులు చేయాల్సి ఉండగా, కేవలం రెండు వికెట్ల నష్టానికి ఒక సెషన్‌తో లక్ష్యాన్ని చేరుకుంది.[2][3] 1964 డిసెంబరులో సౌత్ ఆస్ట్రేలియాపై 154 పరుగులు చేయడం ద్వారా అతని అత్యధిక ఫస్ట్-క్లాస్ స్కోరును నమోదు చేశాడు.[4]
1972-73లో పాకిస్తాన్ జట్టుతో కలిసి రెండోసారి ఆస్ట్రేలియాలో పర్యటించాడు. అయితే పర్యటన ప్రారంభంలో గాయపడి న్యూజిలాండ్ లెగ్ ఆఫ్ ది టూర్‌కు బయలుదేరే ముందు జట్టు నుండి తొలగించబడి, పాకిస్తాన్‌కు తిరిగి వచ్చాడు.[5] కొంతకాలం జాతీయ సెలెక్టర్‌గా పనిచేశాడు. కానీ 2011లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడనే ఆరోపణతో తొలగించబడ్డాడు.[6]
కుటుంబం
మార్చుఅతను ఇమ్రాన్ ఫర్హత్, కమ్రాన్ అక్మల్‌ల మామ.[7] [8] నాజర్ మహమ్మద్ ఇతని మేనమామ.[7]
మూలాలు
మార్చు- ↑ "Mohammad Ilyas". CricketArchive. Retrieved 2023-09-13.
- ↑ Wisden Cricketers' Almanack 1966, pp. 905–6.
- ↑ "3rd Test, Karachi, Apr 9 - 14 1965, New Zealand tour of Pakistan". Cricinfo. Retrieved 2023-09-13.
- ↑ "Adelaide, Dec 18 - 21 1964, Pakistan tour of Australia". Cricinfo. Retrieved 2023-09-13.
- ↑ Wisden 1974, p. 913.
- ↑ "Selector Ilyas suspended by PCB". Cricinfo. Retrieved 2023-09-13.
- ↑ 7.0 7.1 "Cricketing dynasties: The 22 families of Pakistan Test cricket — Part 2 | Sports | thenews.com.pk". www.thenews.com.pk.
- ↑ "Selector files complaint against Farhat" Retrieved 2023-09-13.