మోకా శ్రీవిష్ణుప్రసాదరావు

మోకా శ్రీవిష్ణుప్రసాదరావు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన.కోనసీమ దళితుల నాయకుడు.చెన్నారెడ్డి కెబినెట్ లో మార్కెటింగ్ గిడ్డంగులు శాఖ మంత్రి. 1930 అక్టోబ‌రు 28 కాట్రేనికోన‌లో జ‌న్మించారు. అంబేద్క‌ర్ స‌భ‌ల్లో పాల్గొన్నారు. కాట్రేనికోన గ్రామ పంచాయతీ సర్పంచ్ గా 18 ఏళ్ళు పనిచేశారు. 1972 సంవత్సరంలో అల్లవరం,1978లో ముమ్మిడివరం ఎమ్మెల్యే అయ్యారు. ఇంటి వద్దనే నిరాడంబర జీవితం గడిపి 27.12.2020 న అనారోగ్యంతో మృతి చెందారు. మంత్రిగా పని చేసినా సొంత స్కూటర్ పైనే తిరిగేవారు. బడుగు, బలహీన వర్గాలకు అధిక సంఖ్యలో ఇండ్ల స్థలములు, పట్టాలు ఇప్పించారు. ముమ్మిడివరంలో గవర్నమెంట్ ఆసుపత్రి, కోర్టు రావటానికి ,మురముళ్ల రాఘవేంద్ర వారధి నిర్మాణం జరగటానికి క్రుషి చేసారు. దామోదరం సంజీవయ్య అమలాపురం వచ్చినపుడు కాట్రేనికోన సర్పంచ్ గా ఉన్న విష్ణు ప్రసాద్ రావు కోనసీమ లో దళితులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఆయనకు వివరించారు.ఈయనకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు .