రాధామోనల్ నావల్ (1981 జనవరి 26 - 2002 ఏప్రిల్ 14) తమిళ భాషా చిత్రాలలో నటించిన భారతీయ నటి. ఆమె నటి సిమ్రాన్‌కి చెల్లెలు. విజయ్‌, భూమికలతో పాటు బద్రి (2001)లో నటనకు గుర్తింపుతెచ్చుకుంది. ఆమె 2002లో ఆత్మహత్య చేసుకుని మరణించింది.

మోనల్ నావల్
జననం
రాధామోనల్ నావల్

26 జనవరి 1981
ఢిల్లీ, భారతదేశం
మరణం14 ఏప్రిల్ 2002 (21 సంవత్సరాలు)
చెన్నై, భారతదేశం
వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు2000–2002
బంధువులుసిమ్రాన్ (సోదరి)

వ్యక్తిగత జీవితం

మార్చు

ఢిల్లీలో పంజాబీ దంపతులైన అశోక్ నావల్, శారదలకు రాధామోనల్ నావల్ 1981 జనవరి 26న జన్మించింది. ఆమె పాఠశాల విద్యను అక్కడే పూర్తిచేశారు. ముంబైలో కళాశాల విద్య, అలాగే మిథిబాయి కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని అభ్యసించింది. ఆమెకు సిమ్రాన్, జ్యోతి ఆనంద్ అనే ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. సుమిత్ నావల్ అనే సోదరుడు కూడా ఉన్నాడు.

కెరీర్

మార్చు

మోనల్ నావల్ మోడలింగ్, ఫ్యాషన్ షోలు, అందాల పోటీలలో విరివిగా పాల్గొనేది. ఆ తరువాత సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంది. అప్పటికే ఆమె సోదరి సిమ్రాన్ భారతీయ చలనచిత్రాలలో ప్రముఖ నటి. ఆమె 2001లో విజయ్‌తో తమిళ చిత్రం బద్రిలో తన అరంగేట్రం చేయడానికి సంతకం చేసింది, అయితే ముందుగా పార్వై ఒండ్రే పోతుమే విడుదలై విజయం సాధించింది.[1][2]

అలాగే మరికొన్ని చిత్రాలలో చేసింది. చాలా వరకు బాక్సాఫీస్ వద్ద ఒక మోస్తరు విజయాలు సాధించాయి. ఆమె మరణించే సమయానికి కొన్ని చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో సుమన్తో నటించిన తెలుగు చిత్రం దాదాగిరి, తమిళంలో ఈశ్వర్, యుగేంద్రన్ లతో కలిసి నటించిన బెస్ట్ ఆఫ్ లక్ అనే చిత్రాలు ఉన్నాయి. ఆమె మరణించిన రోజున కూడా తన కొత్త చిత్రం పయియే జన్మం ప్రారంభోత్సవానికి హాజరయింది.[3][4][5] మోనల్ నావల్ మరో సోదరి జ్యోతి 2003లో చిత్రరంగంలో రంగప్రవేశం చేసింది.[6]

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర భాష గమనికి
2000 ఇంద్రధనుష్ యవనిక కన్నడ అభిసారికగా పేరుతెచ్చుకుంది
2001 పార్వై ఒండ్రే పోతుమే నీతా తమిళం
బద్రి మమతీ తమిళం
లవ్లీ మధుబాల తమిళం
సముద్రమ్ ప్రియా తమిళం
ఇష్టం తెలుగు ప్రత్యేక పాత్ర
2002 వివరమన ఆలు తమిళం అతిథి పాత్ర
మా తుఝే సలామ్ నర్గీస్ హిందీ
చార్లీ చాప్లిన్ తిలోత్తమ తమిళం
పెసద కన్నుం పెసుమే శ్వేత తమిళం
2005 ఆధిక్కం ఝాన్సీ తమిళం మరణానంతరం విడుదల చేయబడింది

21 ఏళ్ల వయస్సులో మోనల్ నావల్ చెన్నైలోని తన గదిలో 2002 ఏప్రిల్ 14న ఉరి వేసుకుని చనిపోయింది.[7][8]

మూలాలు

మార్చు
  1. "Monal demanding star treatment". New Straits Times. 22 February 2001. Retrieved 18 June 2021.
  2. "rediff.com, Movies: Monal: I joined films because of Shah Rukh Khan!". Rediff.com. 20 August 2001. Retrieved 1 December 2016.
  3. "Telugu Cinema Etc". Idlebrain.com. 14 April 2002. Retrieved 1 December 2016.
  4. "06-09-02". Archived from the original on 29 October 2004.
  5. "rediff.com, Movies: For whom death tolls". Rediff.com. 16 April 2002. Retrieved 1 December 2016.
  6. "Simran's sister act - Times of India". The Times of India. 17 June 2003. Retrieved 1 December 2016.
  7. "Tamil actress Monal commits suicide - Times of India". The Times of India. 14 April 2002. Retrieved 1 December 2016.
  8. "The suicide syndrome!". The Hindu. 18 April 2002. Archived from the original on 1 July 2003. Retrieved 1 December 2016.