మోనార్క్ శర్మ యూఎస్ ఆర్మీకి చెందిన ఏహెచ్‌-64ఈ కంబాట్ ఫైట‌ర్ హెలికాప్ట‌ర్ యూనిట్‌లో సైంటిస్ట్‌.[1]

మోనార్క్ శర్మ

జీవిత విశేషాలు

మార్చు

ఆయన భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ కి చెందిన వ్యక్తి. అత‌ని తండ్రి పోలీసు విభాగంలో ఓ ప్ర‌భుత్వ ఉద్యోగి. ఆయన జైపూర్ లోని మహావీర్ జైన్ స్కూలులో విద్యాభ్యాసం చేసాడు. ఆయన జైపూర్‌లోని నేష‌న‌ల్ యూనివ‌ర్సిటీ నుంచి ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్స్‌లో బ్యాచిల‌ర్ డిగ్రీ చేశాడు.

ఉద్యోగ జీవితం

మార్చు

ఆయన 2013లో నాసాలోని మాస్ క‌మ్యూనికేష‌న్ వింగ్‌లో మోనార్క్ శ‌ర్మ జూనియ‌ర్ రీసెర్చ్ సైంటిస్ట్‌గా త‌న కెరీర్ ప్రారంభించాడు. 2012లో నిర్వహించిన లూనా బోట్ శర్మ జీవితాన్ని మార్చేశాయి. శర్మ నేతృత్వంలోని బృందానికి మూన్ బగ్గీ ప్రాజెక్టులో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు దక్కింది. లూనా బోట్ ప్రాజెక్టులో శర్మ బృందం ఐదో స్థానంలో నిలిచింది. మరో విశేషం ఏమిటంటే లూనా బోట్ ప్రాజెక్టులో పాల్గొన్న శర్మ బృందంలో ఆయన సోదరి శ్రుతి శర్మ కూడా ఉన్నారు.[2] ఆ త‌ర్వాత మే 2016లో యూఎస్ ఆర్మీలో చేరాడు. కొద్దికాలంలోనే శర్మ డిజైనింగ్, పరిశోధనలో అద్భుత ప్రతిభ కనబరిచినందుకు గాను అదే ఏడాదిలో ప్రతిష్ఠాత్మక ఆర్మీ సర్వీస్ మెడల్, సేఫ్టీ ఎక్స్‌లెన్స్ అవార్డులను అందుకున్నారు.

అరుదైన అవకాశం

మార్చు

ఆయనకు యూఎస్ ఆర్మీకి చెందిన ఏహెచ్‌-64ఈ కంబాట్ ఫైట‌ర్ హెలికాప్ట‌ర్ యూనిట్‌లో సైంటిస్ట్‌గా ఉద్యోగం వ‌చ్చింది. ఏడాదికి అత‌ని జీతం రూ.1.2 కోట్లు కావ‌డం విశేషం. ఈ ఏడాది యూఎస్ ఆర్మీలో చేరిన ఫైట‌ర్ హెలికాప్ట‌ర్ల డిజైన్‌, ప‌ర్య‌వేక్ష‌ణ‌, త‌య‌రీ, నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లను మోనార్క్ చూసుకోవాల్సి ఉంటుంది.

రాజస్థాన్ లోని ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకైన మోనార్క్ శర్మ.. తొలి నుంచి ఖగోళ శాస్త్రం, డిఫెన్స్ పరికరాల రంగంలో ఆసక్తి కలిగి ఉండేవాడు. అయితే తనకు భారత సైన్యంలో పనిచేసే అవకాశం రాలేదని, అమెరికా సైన్యంలో తన నైపుణ్యంతో స్వదేశానికి పేరు తీసుకొస్తానని శర్మ చెబుతున్నారు.[3]

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు