మోహనా సింగ్
మోహనా సింగ్ జితర్వాల్ భారతదేశపు మొదటి మహిళా ఫైటర్ పైలట్లలో ఒకరు.[1] ఈమె భావనా కాంత్, అవని చతుర్వేదిలతో పాటు మొదటి మహిళా పోరాట పైలట్‌గా ప్రకటించబడింది. జూన్ 2016లో ఈ ముగ్గురు మహిళా పైలట్‌లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ స్క్వాడ్రన్‌లో చేరారు. వీరిని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అధికారికంగా నియమించాడు.[2] ప్రయోగాత్మక ప్రాతిపదికన భారతదేశ వైమానిక దళంలో ఫైటర్ స్ట్రీమ్‌ను మహిళల కోసం ప్రారంభించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత, ఈ కార్యక్రమానికి మొదటిగా ఎంపికైన వారిలో ఈ ముగ్గురు మహిళలు ఉన్నారు.[3]
మోహనా సింగ్ జితర్వాల్ | |
---|---|
వ్యక్తిగత వివరాలు | |
జననం | ఝుంఝును, రాజస్థాన్, భారతదేశం | 1992 జనవరి 22
వృత్తి | ఫైటర్ పైలట్ |
Military service | |
Allegiance | భారతదేశం |
Branch/service | వైమానిక దళం,ఇండియా |
Rank | ఫ్లైట్ లెఫ్టినెంట్ |
వ్యక్తిగత జీవితం
మార్చుమోహనా సింగ్ న్యూ ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది, పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ నుండి ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్‌లో బీటెక్ పూర్తి చేసింది. ఈమె తండ్రి ప్రతాప్ సింగ్ భారతీయ వైమానిక దళ సిబ్బందిగా పనిచేస్తున్నాడు, ఈమె తల్లి మంజు సింగ్ ఉపాధ్యాయురాలు.[4] ఈమె 9 మార్చి 2020న, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీ శక్తి పురస్కారాన్ని అందుకుంది.[5]
కెరీర్
మార్చుజూన్ 2019లో, ఈమె హాక్ ఎంకే.132 అడ్వాన్స్ జెట్ ను నడిపిన మొదటి మహిళా ఫైటర్.[6] మోహనా సింగ్, 2019 లో ఎయిర్-టు-ఎయిర్, ఎయిర్-టు-గ్రౌండ్ ఫైటింగ్ మోడ్ శిక్షణలో హాక్ ఎంకే.132ను 380 గంటలకు పైగా ఇన్‌సిడెంట్ ఫ్రీ ఫ్లైయింగ్ పూర్తి చేసి, ఫైటింగ్ స్క్వాడ్రన్ లో చేరింది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Meet The Trio Who Will Be India's First Women Fighter Pilots". NDTV.com. Retrieved 2022-03-18.
- ↑ Krishnamoorthy, Suresh (2016-06-18). "First batch of three female fighter pilots commissioned". The Hindu. ISSN 0971-751X. Retrieved 2022-03-18.
- ↑ "Air Force's First 3 Women Fighter Pilots May Fly Mig-21 Bisons From November". NDTV.com. Retrieved 2022-03-18.
- ↑ "India's First Women Fighter Pilots Get Wings". NDTV.com. Retrieved 2022-03-18.
- ↑ "Keep striving for your dreams with hard work, determination: IAF's women fighter pilots". ANI News. Retrieved 2022-03-18.
- ↑ "Mohana Singh becomes first woman fighter pilot to fly Hawk advanced jet". The New Indian Express. Retrieved 2022-03-18.