మోహన్ (చిత్రకారుడు)

ప్రముఖ కార్టూనిస్టు.

మోహన్ (పూర్తిపేరు తాడి మోహన్) చిత్రకారుడు, కార్టూనిస్టు, రచయిత.

తాడి మోహన్
జననంతాడి మోహన్
డిసెంబరు 24, 1951
India ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణంసెప్టెంబర్ 21, 2017
హైదారాబాద్
నివాస ప్రాంతంఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా
జాతీయతభారతీయుడు
విశ్వవిద్యాలయాలుసి.ఆర్.రెడ్డి కళాశాల
వృత్తికార్టూనిస్టు, జర్నలిస్ట్
భార్య / భర్తకమల
తండ్రితాడి అప్పలస్వామి
తల్లిసూర్యావతి

జీవిత విశేషాలు మార్చు

మోహన్ 1951, డిసెంబరు 24న పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులో జన్మించాడు. ఇతని తండ్రి పేరు అప్పలస్వామి. ఇతడు బి.యస్.సి ఫైన్ ఆర్ట్స్ చదివాడు. 1970లో విశాలాంధ్ర దినపత్రిక లో సబ్ ఎడిటర్‌గా చేరి ఒక దశాబ్దంపాటు పనిచేశాడు. ఆ తర్వాత ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌పెస్, ఉదయం దినపత్రికలలో పనిచేశాడు. మాజిక్ లాంప్ పబ్లిక్ లిమిటెడ్ పేరుతో యానిమేషన్ స్టూడియోను స్థాపించి యానిమేషన్ చిత్రాలను రూపొందించాడు. కార్టూన్ కబుర్లు పేరుతో ఒక పుస్తకాన్ని వెలువరించాడు. ఇతడు ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ (ఆంధ్రప్రదేశ్)కు అధ్యక్షుడిగా ఉన్నాడు[1].

మరణం మార్చు

కొంతకాలంగా కాలేయ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్న ఈయన చికిత్స నిమిత్తం 2017, సెప్టెంబరు 7వ తేదీ హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. ఆరోగ్యం బాగా విషమించడంతో 2017 సెప్టెంబరు 21న ఇతడు మరణించాడు[2].

మూలాలు మార్చు

ఇవి కూడా చూడండి మార్చు