సర్ సి.ఆర్.రెడ్డి విద్యాసంస్థలు
సర్ కట్టమంచి రామలింగారెడ్డి విద్యా సంస్థలు (సి.ఆర్.రెడ్డి సంస్థలు) ఈ క్రింది విద్యాసంస్థలకు మాతృసంస్థ.
- సర్ సి.ఆర్.రెడ్డి పబ్లిక్ స్కూల్
- సర్ సి.ఆర్.రెడ్డి కళాశాల (ఇంటర్మీడియట్ & డిగ్రీ)
- సర్ సి.ఆర్.రెడ్డి పాలిటెక్నిక్ కాలేజి
- సర్ సి.ఆర్.రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ సైన్సెస్[1]
- సర్ సి.ఆర్.రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల[2]
కట్టమంచి రామలింగ రెడ్డి విద్యా సంస్థలు | |
పూర్వపు నామములు | కట్టమంచి గ్రూప్ ఆఫ్ కాలేజస్ (1989–2005) |
---|---|
నినాదం | Quality service & value based education |
రకం | సార్వజనిక విశ్వవిద్యాలయం |
స్థాపితం | 4 జూలై 1945 |
అధ్యక్షుడు | అల్లూరి ఇంద్రకుమార్ |
స్థానం | ఏలూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
కాంపస్ | పట్టణ ప్రాంతం; 100+ ఎకరాలు |
రంగులు | తెలుపు, గోధుమవర్ణం |
అనుబంధాలు | ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం |
మస్కట్ | CRRian |
డిగ్రీ కళాశాలను ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి అనుసంధానం చేయబడింది. దీనిని 1989లో ప్రారంభించారు. ఇంజనీరింగ్ కళాశాలను 2016-20 బ్యాచి వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి, 2017 నుండి శాశ్వతంగా జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, కాకినాడకు అనుసంధానించారు.
కోర్సులు
మార్చుఈ సంస్థలు స్నాతక, స్నాతకోత్తర, పి.హెచ్.డి స్థాయిలలో సాంకేతిక, సైన్స్, ఫార్మసీ, ఇంజనీరింగు (మెకానికల్, సివిల్, ఎలెక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), మేనేజిమెంటు, న్యాయ రంగాలలో 16 కోర్సులను అందిస్తున్నది. [3] అంతే కాకుండా ప్రాథమిక విద్య, హైస్కూలు విద్యలను కూడా అందిస్తున్నది.[4]
ప్రవేశాలు
మార్చుఈ కళాశాలలో ప్రవేశానికై ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తుంది. ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశానికై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే కామన్ ప్రవేశ పరీక్ష (EAPCET) ద్వారా ఎంపిక చేస్తుంది.
సర్ సి.ఆర్.రెడ్డి కళాశాల
మార్చుఈ కళాశాల 1945, జూలై 4వ తేదీన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డిచే ఏలూరు పట్టణంలో ప్రారంభించబడింది. అతని పేరు మీదుగా "సర్ సి.ఆర్.రెడ్డి మునిపల్ కాలేజీ"గా సెకెండ్ గ్రేడ్ కళాశాలగా ఇది ప్రారంభమయ్యింది. డి.ఎస్.సుబ్రహ్మణ్యం ఈ కళాశాల మొట్టమొదటి ప్రిన్సిపాల్. ప్రస్తుతం 2800 మందికి పైగా విద్యార్థులతో, 109 మంది అధ్యాపకులతో బి.ఎ.,బి.కాం., బి.ఎస్సీ., ఎం.ఎ., ఎం.ఎస్సీ. కోర్సులతో పాటు కొన్ని సర్టిఫికెట్ కోర్సులను నడుపుతున్నది.
పూర్వ విద్యార్థులు
మార్చుఈ కళాశాలలో చదువుకున్న కొందరు పేరుమోసిన వ్యక్తులు:
- ఎస్. వి. రామారావు - సినిమా విశ్లేషకుడు, రచయిత
- ప్రత్తి శేషయ్య - స్వాతంత్ర్య సమరయోధుడు
- ఘట్టమనేని కృష్ణ - సినిమా నటుడు
- మురళీమోహన్ - సినిమా నటుడు, నిర్మాత
- విజయ బాపినీడు - తెలుగు సినిమా దర్శకుడు, బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికల సంపాదకుడు.
- క్రాంతి కుమార్ - సినిమా దర్శకుడు, నిర్మాత
- కడియాల మధుసూదనరావు - మత్స్య శాస్త్రవేత్త
- కోట శ్రీనివాసరావు - సినిమా నటుడు
- పరిటాల ఓంకార్ - సినిమా నటుడు, టెలివిజన్ కళాకారుడు, రచయిత
- కలగర సాయి లక్ష్మణరావు - ఎం.ఎల్.సి. గుంటూరు
- పర్వతనేని సాంబశివరావు - సినిమా దర్శకుడు
- తాడి మోహన్ - చిత్రకారుడు
- ద్వాదశి నాగేశ్వరశాస్త్రి - రచయిత, అధ్యాపకుడు
- జీడిగుంట రామచంద్ర మూర్తి - సాహితీవేత్త
మూలాలు
మార్చు- ↑ "సర్ సి.ఆర్.రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ".
- ↑ "సర్ సి.ఆర్.రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్".
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Courses Offered".
- ↑ "సర్ సి.ఆర్.రెడ్డి స్కూలు". Archived from the original on 2020-02-28. Retrieved 2023-01-13.