యజ్ఞ శెట్టి కన్నడ సినిమాలలో తన నటనతో ప్రసిద్ధి చెందిన భారతీయ నటి. ఆమె 2007లో ఓండు ప్రీతియ కథే చిత్రంతో అరంగేట్రం చేసింది, ఆ తర్వాత ఆమె ఎడ్డేలు మంజునాథలో నటించింది. ఈ చిత్రం ఆమెకు ఫిల్మ్‌ఫేర్ ప్రత్యేక అవార్డును తెచ్చిపెట్టింది. ఆమె సుగ్రీవ (2010), అల్లిడే నమ్మే ఇల్లే బందె సుమ్మనే (2011)లలో తన నటనతో మెప్పించింది. గంభీరమైన పాత్రలను పోషించడంలో పేరుగాంచిన ఆమె లవ్ గురు (2009), కల్ల మల్ల సుల్ల (2011), ఉలిదవారు కందంటే (2014)[2] వంటి విమర్శనాత్మక, వాణిజ్య విజయాలందిన చిత్రాలలో నటించింది. ఆమె 2016లో వారస్‌దారతో టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది.

యజ్ఞ శెట్టి
జననం
యజ్ఞ శెట్టి

కుద్రేముఖ్, కర్ణాటక, భారతదేశం
జాతీయతఇండియన్
విద్యాసంస్థమణిపాల్ విశ్వవిద్యాలయం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2006 - ప్రస్తుతం
జీవిత భాగస్వామి
సందీప్ శెట్టి [1]
(m. 2019)

దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాలో లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞ శెట్టి నటించింది.[3]

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

ఆమె ఉమేష్ శెట్టి, జయంతి శెట్టి దంపతులకు కర్ణాటకలోని కుద్రేముఖ్‌లో తుళువ సమాజంలో జన్మించింది. ఆమెకు ముగ్గురు తోబుట్టువులు మహాలక్ష్మి, గాయత్రి, అశ్విని ఉన్నారు. ఆమె తన పాఠశాల విద్యను పనంబూర్‌లోని కేంద్రీయ పాఠశాలలో పూర్తి చేసింది. ఆ తరువాత ఆమె మంగళూరులోని ఎస్.డి.ఎమ్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (BBM) కోర్సును, మణిపాల్ విశ్వవిద్యాలయంలో ఫైనాన్స్‌లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) పూర్తి చేసింది.[4][5]

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆమె సందీప్ శెట్టిని 2019 అక్టోబరు 30న మంగళూరులో వివాహం చేసుకుంది.[6]

ఫిల్మోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనిక
2007 ఓండు ప్రీతియ కథే సాక్షి
2009 ఎద్దేలు మంజునాథ గౌరీ ఫిల్మ్‌ఫేర్ ప్రత్యేక అవార్డు - సౌత్
2009 లవ్ గురు నామినేట్ చేయబడింది, ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు – కన్నడ
2010 సుగ్రీవ పూజ
2010 కరి చిరతే భారతి
2011 పంచామృతము
2011 అల్లిడే నమ్మానే ఇల్లే బందె సుమ్మనే
2011 కల్ల మల్ల సుల్ల రమ్య
2014 క్వాట్లే నాగి
2014 ఉలిదవారు కందంటే శారద
2014 సడగరా యజ్ఞము
2015 ఆక్టోపస్
2016 కిల్లింగ్ వీరప్పన్‌ ముత్తులక్ష్మి నామినేట్ చేయబడింది, ఉత్తమ సహాయ నటిగా SIIMA అవార్డు – కన్నడ
2016 రమాబాయి రమాబాయి
2017 కలత్తూరు గ్రామం సెల్వాంబ తమిళ సినిమా
2018 ఆపరేషన్ 2019 ఉమాదేవి తెలుగు సినిమా
2019 లక్ష్మీస్ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి తెలుగు సినిమా
2019 ఆపరేషన్ నక్షత్ర స్మిత
2019 కథా సంగమ
2020 యాక్ట్ 1978 గీత ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - కన్నడ
2021 H/34 పల్లవి టాకీస్
లవ్ జంక్షన్

మూలాలు

మార్చు
  1. "Kannada Actor Yagna Shetty Marries Entrepreneur Sandeep Shetty". News18. 31 October 2019. Retrieved 19 November 2020.
  2. "Yagna is not just serious". Deccan Chronicle. 19 March 2014. Retrieved 21 January 2015.
  3. "Yagna Shetty Play Laxmi Parvathi Role In Laxmis NTR - Sakshi". web.archive.org. 2023-06-06. Archived from the original on 2023-06-06. Retrieved 2023-06-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Mangalore: ' I didn't Intend to Act in Movies' Yajna Shetty". daijiworld.com. 15 November 2006. Retrieved 21 January 2015.
  5. "Film and finance for Yagna Shetty". indiaglitz.com. 29 September 2006. Archived from the original on 9 April 2015. Retrieved 21 January 2015.
  6. "Photos: Yagna Shetty marries Sandeep Shetty in a grand ceremony". Times Of India. 30 October 2019. Retrieved 19 November 2020.