ఆపరేషన్ 2019 2018లో విడుదలైన తెలుగు సినిమా. అలివేలమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అలివేలు నిర్మించిన కరణం బాబ్జి దర్శకత్వం వహించాడు.[1]శ్రీకాంత్‌, దీక్షా పంత్‌, యజ్ఞ శెట్టి పోసాని కృష్ణమురళి నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 25, 2018న విడుదల చేసి,[2] సినిమాను డిసెంబర్ 01, 2018న విడుదల చేశారు.[3]

ఆపరేషన్ 2019
దర్శకత్వంకరణం బాబ్జి
నిర్మాతఅలివేలు
తారాగణంశ్రీకాంత్‌, దీక్షా పంత్‌, యజ్ఞ శెట్టి, పోసాని కృష్ణమురళి
ఛాయాగ్రహణంవెంకట్ ప్రసాద్
కూర్పుఎస్.బి.ఉద్దవ్
సంగీతంరాప్‌ రాక్‌ షకీల్
నిర్మాణ
సంస్థ
అలివేలమ్మ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2018 డిసెంబరు 1 (2018-12-01)
సినిమా నిడివి
141 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

తన గ్రామానికి ఏమైనా చేయాలనే లక్ష్యంతో ఎన్‌.ఆర్. ఐ ఉమా శంక‌ర్ (శ్రీ‌కాంత్‌) తన తరుపున నారాయణ మూర్తి (శివకృష్ణ) ని స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి నిలబెడతాడు, కానీ అతను ఓడిపోతాడు. అప్పుడు జరిగిన గొడవలో ఉమా శంకర్ ఆ ఎమ్మెల్యే పై చేయి చేసుకోవడంతో సంవత్సరం పాటు జైల్లో వుంటాడు. జైలు నుంచి విడుదల అయ్యాక , కోట్లు వెచ్చించి ఎమ్‌.ఎల్.ఏ సీటు కొంటాడు. ఓట్ల‌కు నోట్లు ఎర‌వేసి ఎమ్మెల్యేగా గెలుస్తాడు. అక్క‌డి నుంచి రాష్ట్ర రాజ‌కీయాలు తారుమారు అవుతాయి. ఉమా శంక‌ర్ వ‌ల్ల ముఖ్యమంత్రి సీటు కూడా ప్ర‌మాదంలో ప‌డుతుంది. ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు వాగ్థానాలు ఇచ్చి ఎమ్మెల్యేగా నిలిచిన ఉమాశంక‌ర్‌, ఏ మాట‌నీ నిల‌బెట్టుకోడు. పైగా అడ్డ‌గోలుగా కోట్లు సంపాదిస్తాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ? త‌న ఉద్దేశం ఏమిటి? అస‌లు ఉమాశంక‌ర్ వెనుక ఉన్న క‌థేమిటి ? అన్నదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: అలివేలమ్మ ప్రొడక్షన్స్
  • నిర్మాత: అలివేలు
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కరణం బాబ్జి
  • సంగీతం: రాప్‌ రాక్‌ షకీల్
  • సినిమాటోగ్రఫీ: వెంకట్ ప్రసాద్
  • ఎడిటర్: ఎస్.బి.ఉద్దవ్

మూలాలు మార్చు

  1. Mana Telangana (11 September 2018). "రాజకీయ నేపథ్యంలో 'ఆపరేషన్ 2019'". Archived from the original on 1 సెప్టెంబరు 2021. Retrieved 1 September 2021.
  2. Mana Telangana (25 May 2018). "'ఆపరేషన్ 2019' థియేట్రికల్ ట్రైలర్..." Archived from the original on 1 సెప్టెంబరు 2021. Retrieved 1 September 2021.
  3. The Times of India (1 December 2019). "Operation 2019 Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 1 సెప్టెంబరు 2021. Retrieved 1 September 2021.
  4. Sakshi (1 December 2018). "'ఆపరేషన్ 2019' మూవీ రివ్యూ". Archived from the original on 1 సెప్టెంబరు 2021. Retrieved 1 September 2021.
  5. The Indian Express (30 November 2018). "Srikanth: Operation 2019 is not based on any political party" (in ఇంగ్లీష్). Archived from the original on 1 సెప్టెంబరు 2021. Retrieved 1 September 2021.