సీనియర్‌ రాజకీయ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు 1919 డిసెంబర్ 16న గుంటూరుజిల్లా అమృతలూరు మండలంలోని బోడపాడు గ్రామంలో రైతు కుటుంబములో జన్మిచారు . వీరి తల్లిదండ్రులు రాఘవమ్మ , యడ్లపాటి వెంటక సుబ్బయ్య .గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో బి.ఎ చదివి 1941 చెన్నయ్ లో లా కాలేజీ  చదువుతూ  అందులో ఆంధ్రా అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేశారు తరువాత న్యాయవాద వృత్తిని అభ్యసించి న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. ప్రముఖ రైతు నాయకుడు ఎన్జీరంగా ముఖ్య అనుచరుడిగా ఆయనతో కలిసి అడుగులు వేశారు.ఎన్.జి రంగాతో కలిసి 1951 లో కృషీకార్ లోక్ పార్టీ స్థాపనలో ప్రముఖ పాత్ర వహించారు. ఆ తరువాత 1967 లో సి.రాజగోపాలాచారిగారు స్థాపించిన స్వతంత్ర పార్టీ తరపున వేమూరు నియోజక వర్గం 1967, 1972 ఎన్నికలలో గెలుపొందారు. 1972 లో కాంగ్రెస్ ప్రభంజనంలో దేశమంతా స్వతంత్ర పార్టీ ఓడిపోతే, కోస్తా జిల్లాల మొత్తం మీద ఈయన ఒక్కరే గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి మళ్లీ వేమూరు నుంచి గెలుపొంది మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో ప్రణాళిక-న్యాయశాఖ మంత్రిగా వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు

యడ్లపాటి వెంకట్రావు 
జననం16 డిసెంబర్ 1919
బోడపాడు, గుంటూరుజిల్లా
చదువుఎఫ్ ఏ , బి ఏ , న్యాయవాద కోర్సు 
వృత్తిన్యాయవాది, రాజకీయ నాయకుడు 
ప్రసిద్ధులువంద సంవత్సరాలు నిండిన ప్రముఖ రాజకీయ నాయకులు . మాజీ మంత్రివర్యులు , జిల్లా పరిషత్ చైర్మన్ , పార్లమెంటు సభ్యులు .