యదునందన్ శర్మ

భారతీయ ఉద్యమకారుడు

యదునందన్ శర్మ (1896-1975) బీహార్కు చెందిన రైతు నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. రేయోరాలో జమీందార్లు, బ్రిటిషర్‌లకు వ్యతిరేకంగా టిల్లర్ల హక్కుల కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభించాడు.

యదునందన్ శర్మ
జననం1896
మరణం1975
వృత్తిభారత స్వాతంత్ర్య సమరయోధుడు

జీవిత విషయాలు

మార్చు

యదునందన్ శర్మ 1896లో బీహార్ రాష్ట్రం, ఆర్వాల్ జిల్లాలోని మాంజియావాన్ గ్రామంలో సాధారణ భూమిహార్ బ్రాహ్మణ కుటంబంలో జన్మించాడు.[1] ఈ గ్రామం టెకరీ జమీందారీలో భాగంగా ఉంది. శర్మకు మూడేళ్ళ వయసున్నప్పుడు తండ్రి మరణించడంతో చిన్న వయస్సులోనే గోసంరక్షకునిగా పనిలో చేరాడు. చదువువుకు దూరమైన శర్మకు చదువుకోవాలన్న కోరికతో బెనారస్‌కు పారిపోయాడు.

విద్య, ఉద్యోగం

మార్చు

1919లో టెకారీ హైస్కూల్ నుండి మెట్రిక్యులేట్ పూర్తిచేసి, ఒక గ్రామ పాఠశాలలో ఒక సంవత్సరంపాటు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. కొంతకాలం జమీందారీలో మేనేజర్‌గా కూడా పనిచేసి, వ్యవస్థ గురించి తెలుసుకున్నాడు. దానితో సంతృప్తి చెందక మళ్లళీ బెనారస్ వెళ్లి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చేరి 1929లో పట్టభద్రుడయ్యాడు.

ఉద్యమం

మార్చు

బిఏ డిగ్రీ పూర్తిచేసిన తరువాత, చదువును వదిలిపెట్టి, శాసనోల్లంఘన ఉద్యమంలో చేరాడు.[1] దాంతో పోలీసులు 1930లో అరెస్టు చేసి 16 నెలలపాటు జైలు శిక్ష విధించారు. జైలు నుండి విడుదలైన తరువాత 1933లో కిసాన్ ఉద్యమంలో చేరాడు. 1930లలో సందకో, రేయోరా సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు.[1] ఆర్వాల్ జిల్లాలో రైతుల తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. లెజెండరీ స్వాతంత్ర్య సమరయోధుడు, రైతు నాయకుడు సహజానంద్ సరస్వతికి రెండవ అధిపతి అయ్యాడు. జీవితంలో ఎక్కువ భాగం బ్రిటిష్ పాలన, జమీందారీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూనే నెయామత్పూర్ గ్రామంలోని ఒక ఆశ్రమంలో గడిపాడు. ఇతన్ని కలవడానికి 1936, డిసెంబరులో శీతాకాలపు రాత్రి జవహార్ లాల్ నెహ్రూ ఆశ్రమం సందర్శించి, అక్కడి భారీ సమావేశంలో ప్రసంగించాడు.[1]

రచించిన పుస్తకాలు

మార్చు
  • బకష్ట్ మహామరి ఔర్ ఉస్కా అచూక్ ఇలాజ్ (బకాష్ట్ ఎపిడెమిక్ అండ్ ఇట్స్ ఇన్ఫల్లిబుల్ రెమెడీ) శర్మ, యదునందన్, 1947, హిందీ, అలహాబాద్‌

శర్మ 1975లో మరణించాడు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గయ జిల్లాలోని మఖ్దుంపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 Das, Arvind Narayan (1982). Agrarian Movements in India:Studies on 20th Century Bihar. Routledge.