యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్

యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ (జననం 24 మార్చి 1992) భారతదేశానికి చెందిన వడియార్ రాజవంశానికి చెందిన రాజ వంశస్థుడు, రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మైసూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్
యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్
వడియార్ రాజవంశానికి 27వ అధిపతి
Tenure28 మే 2015 – ప్రస్తుతం
పూర్వాధికారిశ్రీకంఠదత్త వడియార్
యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 (2024-06-04)
ముందు ప్రతాప్ సింహా
నియోజకవర్గం మైసూరు

వ్యక్తిగత వివరాలు

జననం (1992-03-24) 1992 మార్చి 24 (వయసు 32)
బెంగళూరు, కర్ణాటక , భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి త్రిశిఖా కుమారి వడియార్ (మ. 2016)
సంతానం 1

యదువీర్ మైసూర్‌ను పాలించిన 25వ & చివరి మహారాజు జయరామచంద్ర వడియార్ మనవడు.[2][3] శ్రీకంఠదత్త . రాణి ప్రమోదా దేవికి పిల్లలు లేరు, కాబట్టి ఆమె యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్‌ను అధికారికంగా దత్తత తీసుకొని అతన్ని మైసూరు వంశానికి 27వ యువరాజుగా చేసి మేలో పట్టాభిషేకం చేసింది.[4]

వివాహం

మార్చు

యదువీర్ వడియార్ 27 జూన్ 2016న రాజస్థాన్‌కు చెందిన పూర్వపు దుంగార్‌పూర్ రాజ కుటుంబానికి చెందిన హర్షవర్ధన్ సింగ్, మహశ్రీ కుమారి కుమార్తె త్రిశిఖా కుమారి దేవిని వివాహం చేసుకున్నాడు.[5] త్రిశిఖ 6 డిసెంబర్ 2017న బెంగుళూరులో కుమారుడు ఆద్యవీర్ నరసింహరాజ వడియార్ కు జన్మనిచ్చింది.[6]

మూలాలు

మార్చు
  1. Deccan Chronicle (4 June 2024). "Yaduveer Krishnadatta Chamaraja Wadiyar Wins Mysuru-Kodagu Lok Sabha Seat" (in ఇంగ్లీష్). Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024.
  2. The Hindustan Times (29 March 2024). "Tracing political journey of Mysuru royal family". Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024.
  3. The Hindu (4 June 2024). "Yaduveer establishes lead of more than one lakh votes in Mysuru" (in Indian English). Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024.
  4. The Hindu (25 May 2015). "Yaduveer to become 'prince' on May 28". The Hindu (in Indian English). Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024.
  5. India Today (25 June 2016). "24-year-old prince of Mysore set to marry a royal from Rajasthan" (in ఇంగ్లీష్). Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024.
  6. "Mysuru Queen Trishika Kumari Devi, Wife of Yaduveer Krishnadatta Chamaraja Wadiyar, Delivers Baby Boy" (in ఇంగ్లీష్). 7 December 2017. Retrieved 28 July 2024.