యర్రం వెంకటేశ్వరరెడ్డి

యర్రం వెంకటేశ్వరరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2004, 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

యర్రం వెంకటేశ్వరరెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004 - 2014
నియోజకవర్గం సత్తెనపల్లి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
లంకెలకూరపాడు, ముప్పాళ్ళ మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ జనసేన పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు సాంబి రెడ్డి
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

యర్రం వెంకటేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కల్లం అంజి రెడ్డి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2009లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల రాజ నారాయణ పై గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.

యర్రం వెంకటేశ్వరరెడ్డి 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు. ఆయన అనంతరం 2019 మార్చి 19న జనసేన పార్టీలో చేరి[2] 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి 9279 ఓట్లు సాధించి మూడోస్థానంలో నిలిచాడు.[3]

మూలాలు

మార్చు
  1. CEO Andhra (2009). "Yarram VenkateswarareddyYarram Venkateswarareddy" (PDF). Retrieved 3 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. Andhra Jyothy (19 March 2019). "జనసేనలో చేరిన సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే" (in ఇంగ్లీష్). Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
  3. JSP's choice of candidates insome segments raises eyebrows